తెలంగాణ

telangana

ETV Bharat / business

మంచి మైలేజ్​ ఇచ్చే బైక్​ కొనాలా? టాప్​-10 ఆప్షన్స్​ ఇవే! - Best Mileage Bikes Under 1 Lakh

Best Mileage Bikes Under 1 Lakh : మీరు ఎక్కువ మైలేజ్​ ఇచ్చే బైక్ కొనాలని అనుకుంటున్నారా? రూ.1 లక్ష వరకు పెట్టగలరా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో సూపర్ స్టైలిష్​ లుక్స్​తో, బెస్ట్ పెర్ఫార్మెన్స్, రైడింగ్ ఎక్స్​పీరియన్స్​ ఇచ్చే టాప్​-10 బైక్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

Best Mileage Bikes Under 1 Lakh
Best Mileage Bikes Under 1 Lakh (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 16, 2024, 5:00 PM IST

Best Mileage Bikes Under 1 Lakh :భారత్​లో బైక్స్​కు ఎంత క్రేజ్​ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ యువతను ఆకర్షించేందుకు సూపర్​ స్టైలిష్​ లుక్స్​తో, బెస్ట్ పెర్ఫార్మెన్స్, రైడింగ్ ఎక్స్​పీరియన్స్​ ఇచ్చే బైక్​లను మార్కెట్​కి విడుదల చేస్తున్నాయి. వాటిలో రూ.1 లక్ష బడ్జెట్​లో ఎక్కువ మైలేజ్​ ఇచ్చే టాప్​-10 బైక్​ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Bajaj Platina 100 :తక్కువ బడ్జెట్​లో మంచి రైడింగ్ ఎక్స్​పీరియెన్స్​ కావాలనుకునే వారికి బజాజ్​ ప్లాటినా 100 మంచి ఆప్షన్ అవుతుంది. దీనిలో 102 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 7.79 bhp @ 7500 rpm​ పవర్​ జనరేట్ చేస్తుంది. దీని మైలేజీ 72 kmpl ​. మార్కెట్​లో ఈ బైక్​ ధర సుమారుగా రూ.61,617 (యూవరేజ్ ఎక్స్ షో రూం ధర​)ఉంటుంది.

TVS Sport :టీవీఎస్ కంపెనీ రిలీజ్ చేసిన సూపర్​ స్టైలిష్​​ మోడల్ ఈ టీవీఎస్ స్పోర్ట్​. ఇది మంచి డైనమిక్​, స్పోర్టీ లుక్​ కలిగి ఉంటుంది. దీనిలో 109.7 cc సామర్థ్యం కలిగిన ఇంజిన్ అమర్చారు. దీనిపై లీటర్ పెట్రోల్​తో 80 kmpl మైలేజ్​ ఇస్తుంది. మార్కెట్​లో దీని ధర సుమారుగా రూ.63,319 (యూవరేజ్ ఎక్స్ షో రూం ధర​)ఉంటుంది.

Honda SP 125 : హోండా కంపెనీ నుంచి వచ్చిన సూపర్​ స్టైలిష్ బైక్ హోండా SP 125. ఈ ఛార్మింగ్​ బైక్​లో 124 cc సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. దీని మైలేజ్​ 65 kmpl . ఇది 7 రంగుల్లో లభిస్తుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.86,747(ఎక్స్​ షో రూం) ఉంటుంది.

Hero HF Deluxe :ఆఫీసుకు వెళ్లేవారికి హీరో హెచ్​ఎఫ్​ డీలక్స్​ మంచి ఆప్షన్ అవుతుంది. ఈ బైక్​లో 97.2 cc సామర్థ్యం కలిగిన ఇంజిన్​ ఉంది. ఈ బైక్​ మైలేజ్​ 65 kmpl​. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.56,207 (ఎక్స్​ షో రూం)ఉంటుంది.

Honda Shine 100 :సోర్ట్స్​​ లుక్స్​తో ఉండే హోండా షైన్ 100 ఆఫీస్​, ఇంటి అవసరాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ బైక్​పై గంటకు 68 kmpl మైలేజ్ ఇస్తుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.65,011(ఎక్స్​ షో రూం) ఉంటుంది.

Hero Splendor Plus : బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఎలక్ట్రిక్​​ బైక్​ల్లో హీరో స్ప్లెండర్ ప్లస్ ఒకటి. ఈ బైక్​ 97.2 cc ఇంజిన్ సామర్థ్యం కలిగిఉంది. 60 kmpl మైలేజ్ ఇచ్చే స్ప్లెండర్ ప్లస్, 9.8 లీటర్ల సామర్థ్యంతో వస్తుంది. ఈ బైక్​కు ప్రస్తుతం మార్కెట్లో సుమారుగా రూ.73,633 (ఎక్స్​ షో రూం) ఉంటుంది.

Hero Splendor Plus Xtec :స్ప్లెండర్​ ప్లస్​ ఫేస్​లిఫ్ట్​ మోడల్​ స్ప్లెండర్ ప్లస్ ఎక్స్​టెక్​ను 2022లో హీరో కంపెనీ లాంఛ్ చేసింది. 97.2 cc ఇంజిన్, గంటకు 68 kmpl మైలేజ్​తో వస్తున్న ఈ బైక్​లో డిజిటల్​ ఇన్స్​ట్రుమెంట్​ క్లస్టర్​ను అమర్చారు. ఈ సెగ్మెంట్​లో ఈ ఫీచర్​తో వస్తున్న మొదటి బైక్​ ఎక్స్​టెక్​ అని కంపెనీ చెబుతోంది. ఈ ఫీచర్​ ద్వారా కాల్స్​, మేసేజ్​లను క్లస్టర్​ స్క్రీన్​పై చూసుకోవచ్చు. మార్కెట్​లో దీని ధర సుమారుగా రూ.79,707(ఎక్స్​ షో రూం)ఉంటుంది.

TVS Raider 125 : టీవీఎస్ కంపెనీ విడుదల చేసిన పవర్​ఫుల్​ బైక్ టీవీఎస్ రైడర్ 125. ఇందులో 124.8 cc సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. దీనిపై లీటర్​ పెట్రోల్​తో 56.7 kmpl వరకు ప్రయాణించవచ్చు. ఇది స్టైలిష్ లుక్స్​తో, రైడింగ్ చేయడానికి మంచి కంఫర్ట్​గా ఉంటుంది. మార్కెట్లో ఈ బైక్ ధర సుమారుగా రూ.97,071(ఎక్స్ షో రూం) ఉంటుంది.

Honda Shine :హోండా రిలీజ్​ చేసిన స్టైలిష్​ బైక్​ హోండా షైన్​ యూత్​ను ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ బైక్​123.94 cc సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. ఇది 10.59 bhp​ పవర్​ జనరేట్ చేస్తుంది. ఈ హోండా బైక్​ మైలేజ్​ 55 kmpl. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.80,409(ఎక్స్​ షో రూం) ఉంటుంది.

Hero Glamour :స్టైలిష్​ లుక్స్​తో హీరో విడుదల చేసిన బైక్ హీరో గ్లామర్. దీనిలో 124.7 cc సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. ఇది 10.39 bhp పవర్​ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ లీటర్​కు 55 kmpl మైలేజ్​ ఇస్తుంది. మంచి బడ్జెట్​ బైక్​ కొనాలని అనుకునేవారికి ఈ సూపర్​ స్ప్లెండర్​ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మార్కెట్లో ఈ బైక్ ధర సుమారుగా రూ.83,110(ఎక్స్​ షో రూం) ఉంటుంది.

రూ.5 లక్షల్లో మంచి కారు కొనాలా? టాప్-6 మోడల్స్ ఇవే! - Best Cars Under 5 Lakh

ఎక్కువ 'మైలేజ్' ఇచ్చే స్కూటీ కొనాలనుకుంటున్నారా? రూ.1లక్షలోపు టాప్​-10 మోడల్స్​ ఇవే! - Best Scooty Under 1 Lakh

ABOUT THE AUTHOR

...view details