Best Mileage Bikes Under 1.5 Lakh : మీరు రూ.1.5 లక్షల బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ లేదా స్కూటర్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో చాలా బైక్స్ & స్కూటర్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో లేటెస్ట్ ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఉండి, ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్-10 వెహికల్స్ గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
1. Royal Enfield Hunter 350 : రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బైక్‌లో 349.34 సీసీ BS6 ఇంజిన్ ఉంటుంది. ఇది 20.2 bhp పవర్, 27 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానమై ఉంటుంది. ఈ బైక్ ముందు, వెనుక భాగాల్లో డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. పైగా దీనిలో యాంటీ-లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఈ బైక్‌లో 13 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. 350 సీసీ బైక్‌ల్లో 36 కి.మీ/లీటర్ మైలేజ్ ఇచ్చే టూ-వీలర్ ఇదే కావడం విశేషం. అందుకే ఇది బెస్ట్ మైలేజ్ బైక్‌ల లిస్ట్‌లో స్థానం సంపాదించింది. ప్రస్తుతం ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ 3 వేరియంట్లలో, 8 అందమైన రంగుల్లో లభిస్తోంది.
Royal Enfield Hunter 350 Price :మార్కెట్లో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బైక్ ధర సుమారుగా రూ.1,49,000 నుంచి రూ.1,74,430 వరకు ఉంటుంది.
2. Bajaj Pulsar NS200 :ఈ బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 మోటార్ సైకిల్లో 199.5 సీసీ సామర్థ్యం కలిగిన BS6 ఇంజిన్ ఉంటుంది. ఇది 24.13 bhp పవర్, 18.74 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానమై ఉంటుంది. ఈ బైక్ ముందు, వెనుక భాగాల్లో డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. పైగా దీనిలో యాంటీ-లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఈ బైక్‌లో 12 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ బండి లీటర్ పెట్రోల్‌కు 36 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ బజాజ్ బైక్ 3 వేరియంట్లలో, 20 కలర్ ఆప్షన్లలో దొరుకుతోంది.
Bajaj Pulsar NS200 :మార్కెట్లో ఈ బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 బైక్ ధర సుమారుగా రూ.1,42,060 నుంచి రూ.1,58,438 వరకు ఉంటుంది.
3. Honda Hornet 2.0 : ఈ హోండా హార్నెట్ 2.0 బైక్‌లో 184.4 సీసీ సామర్థ్యం కలిగిన BS6 ఇంజిన్ ఉంటుంది. ఇది 17.03 bhp పవర్, 15.9 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానమై ఉంటుంది. ఈ బైక్ ముందు, వెనుక భాగాల్లో డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. పైగా దీనిలో యాంటీ-లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఈ బైక్‌లో 12 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ బండి లీటర్ పెట్రోల్‌కు 42.3 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ హోండా హార్నెట్ 2.0 బైక్ సింగిల్ వేరియంట్లో, 4 రంగుల్లో అందుబాటులో ఉంది.
Honda Hornet 2.0 Price :మార్కెట్లో ఈ హోండా బైక్ ధర సుమారుగా రూ.1,40,327 వరకు ఉంటుంది.
4. TVS Apache RTR 200 4V : ఈ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ బైక్‌లో 197.75 సీసీ సామర్థ్యం కలిగిన BS6 ఇంజిన్ ఉంటుంది. ఇది 20.54 bhp పవర్, 17.25 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానమై ఉంటుంది. ఈ బైక్ ముందు, వెనుక భాగాల్లో డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. పైగా దీనిలో యాంటీ-లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఈ బైక్‌లో 12 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ బండి 41.9 కి.మీ/ లీటర్ మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ టీవీఎస్ బైక్ సింగిల్ వేరియంట్లో, 2 కలర్ ఆప్షనల్లో లభిస్తోంది.
TVS Apache RTR 200 4V Price :మార్కెట్లో ఈ టీవీఎస్ మోటార్ సైకిల్ ధర సుమారుగా రూ.1,49,920 వరకు ఉంటుంది.
5. Hero Xpluse 200 4V : ఈ హీరో ఎక్స్‌ప్లస్ 200 4వీ బైక్‌లో 199.6 సీసీ సామర్థ్యం కలిగిన BS6 ఇంజిన్ ఉంటుంది. ఇది 18.9 bhp పవర్, 17.35 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానమై ఉంటుంది. ఈ బైక్ ముందు, వెనుక భాగాల్లో డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. పైగా దీనిలో యాంటీ-లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లు. ఈ బండి 32.9 కి.మీ/లీటర్ మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ హీరో మోటార్ సైకిల్ 2 వేరియంట్లో, 13 అందమైన రంగుల్లో ఉంటుంది.
Hero Xpluse 200 4V Price : మార్కెట్లో ఈ హీరో బైక్ ధర రూ.1,47,388 - రూ.1,54,763 ప్రైస్ రేంజ్లో ఉంది.
6. Yamaha Aerox 155 :ఈ యమహా ఏరోక్స్ 155 స్కూటీలో 155 సీసీ BS6 ఇంజిన్ ఉంటుంది. ఇది 14.75 bhp పవర్, 13.9 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ స్కూటర్ ముందు భాగంలో డిస్క్ బ్రేకులు, వెనుక భాగాల్లో డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. పైగా దీనిలో యాంటీ-లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఈ స్కూటీ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.5 లీటర్లు. ఈ బండి 40 కి.మీ/లీటర్ మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ యమహా స్కూటర్ 2 వేరియంట్లో, 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.