తెలంగాణ

telangana

ETV Bharat / business

బెస్ట్ లైఫ్‌టైం ఫ్రీ క్రెడిట్ కార్డులు ఇవే!- యాన్యువల్ ఫీజ్ నిల్- బెనిఫిట్స్ ఫుల్​​

జీవితకాల ఉచిత క్రెడిట్ కార్డులతో ఎన్నో లాభాలు- మరెన్నో బెనిఫిట్లు- టాప్ 5 ఇవే!

By ETV Bharat Telugu Team

Published : 10 hours ago

Lifetime Free Credit Cards
Lifetime Free Credit Cards (Getty Images)

Best Lifetime Free Credit Cards India :ఖర్చులు పెరుగుతుండటమో లేక అవసరాలు అలా ఉన్నాయో గానీ క్రెడిట్ కార్డులను ప్రస్తుత రోజుల్లో ప్రజలు విరివిగా వాడుతున్నారు. ఈఎంఐల్లో చెల్లించే ఆప్షన్ ఉండటం వల్ల వాటిని వాడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ఎలాంటి ఛార్జీలు కట్టకుండా ఉండే లైఫ్‌టైం ఫ్రీ క్రెడిట్ కార్డులు పొందాలని చూస్తున్నారా? అందుకోసం చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అవి ఉచితంగానే లభిస్తున్నాయి. జాయినింగ్ సమయంలో సహా వార్షిక రుసుములు కూడా వసూలు చేయవు. అవేంటో? వాటిలో బెనిఫిట్స్ ఏంటో? తెలుసుకుందాం.

జీవితకాల ఉచిత క్రెడిట్ కార్డ్‌ల ప్రయోజనాలు

  • డబ్బులు ఆదా: వార్షిక రుసుము లేకపోవడం వల్ల యూజర్లకు డబ్బులు ఆదా అవుతాయి. ఎక్కువ కాలం వినియోగించే కార్డ్ హోల్డర్‌లకు గణనీయమైన మొత్తంలో డబ్బును మిగులుతాయనే చెప్పాలి.
  • రివార్డులు, ఆఫర్లు: అనేక జీవితకాల ఉచిత క్రెడిట్ కార్డులు క్యాష్‌బ్యాక్, షాపింగ్, డైనింగ్, ట్రావెల్ వంటి వివిధ విషయాల్లో డిస్కౌంట్‌లతోపాటు ఆకర్షణీయమైన రివార్డులను అందిస్తాయి.
  • క్రెడిట్ స్కోర్​: వార్షిక రుసుము సహా అదనపు ఖర్చు లేకుండా క్రెడిట్ స్కోర్​ను పొందవచ్చు.
  • అదనపు ప్రయోజనాలు: ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపులు, ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లకు ఉచిత యాక్సెస్, వ్యాపారులతో ప్రత్యేకమైన డీల్‌లు వంటి కాంప్లిమెంటరీ ప్రయోజనాలు అందిస్తాయి. ముఖ్యంగా దరఖాస్తు విధానం చాలా వేగంగా జరుగుతుంది. మరి టాప్​-10 లైఫ్​ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డులు ఏంటంటే?

అమెజాన్‌ పే-ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు
అమెజాన్‌ అనేక షాపింగ్‌ అవసరాలకు ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాం అయినందున ఈ కార్డుతో చాలా ప్రయోజనాలు ఉంటాయి. రోజువారీ కొనుగోళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. మూడు లేదా ఆరు నెలల పాటు నో-కాస్ట్ ఈఎంఐని అమెజాన్‌ పే-ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు అందిస్తుంది. మీరు ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ కలిగి ఉంటే అమెజాన్‌ ఇండియాలో కొనుగోళ్లపై 5% క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు. అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ లేకపోతే 3% క్యాష్‌ బ్యాక్‌ పొందే అవకాశం ఉంది. పొందిన రివార్డులపై పరిమితి, గడువు తేదీ లేదు.

ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్లాటినం చిప్‌ క్రెడిట్‌ కార్డు
ఈ కార్డుతో ఇంధనం మినహా రిటైల్ స్టోర్లలో మీరు ఖర్చు చేసే ప్రతి రూ.100కు 2 రివార్డు పాయింట్లను పొందొచ్చు. బీమా, యుటిలిటీపై ఖర్చు చేసే ప్రతి రూ.100కు 1 రివార్డ్‌ పాయింట్‌ లభిస్తుంది. భారత్‌ అంతటా హెచ్‌పీసీఎల్‌ పెట్రోల్‌ పంపుల వద్ద 1% (గరిష్ఠంగా రూ.4 వేలు) ఇంధన సర్‌ఛార్జ్‌ మినహాయింపును పొందొచ్చు. దేశంలో 12 ప్రధాన నగరాల్లో 2,500 కంటే ఎక్కువ రెస్టారెంట్స్‌లో డైనింగ్‌పై కనీసం 15% ఆదా చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఎక్కువ రివార్డు పొందాలనుకునేవారికి ఈ కార్డు అనుకూలంగా ఉంటుంది.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ సెలక్ట్‌ క్రెడిట్‌ కార్డు
ఈ కార్డుకు ప్రవేశ, వార్షిక ఫీజులు లేనప్పటికీ లగ్జరీ క్రెడిట్‌ కార్డు మాదిరి అన్ని ఫీచర్లను అందిస్తుంది. ఈ కార్డుతో రూ.15 వేలు ఖర్చు చేస్తే, రూ.500 విలువైన వోచర్‌ను పొందొచ్చు. ఆన్‌లైన్‌లో చేసే ప్రతి రూ.150 ఖర్చుపై 6 రివార్డ్‌ పాయింట్లు, ఆఫ్‌లైన్‌లో ప్రతి 150 ఖర్చుపై 3 రివార్డ్‌ పాయింట్లు వస్తాయి. ఒక రివార్డు పాయింట్‌ విలువ 25 పైసలు. రివార్డు పాయింట్లపై పరిమితి లేదు. త్రైమాసికానికి 4 ఉచిత విమానాశ్రయ, రైల్వే లాంజ్‌ సందర్శనలు చేయొచ్చు. నెలకు రూ.300 వరకు ఇంధన సర్‌ఛార్జ్‌ మినహాయింపును పొందొచ్చు.

RBL బ్యాంక్‌బజార్ SaveMax క్రెడిట్ కార్డ్

  • బుక్ మై షో, జొమాటా యాప్స్/ప్లాట్ ఫామ్స్ ఉపయోగించినప్పుడు 10% క్యాష్‌బ్యాక్ ఇస్తుంది.
  • రుణాలను వేగంగా దరఖాస్తు చేసుకోవడంలో ఉపయోగపడుతుంది.

HSBC VISA ప్లాటినం క్రెడిట్ కార్డ్

  • కార్డ్ జారీ అయిన మొదటి 30 రోజులలోపు HSBC ఇండియా మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి లాగిన్ చేస్తే రూ.500 క్యాష్‌బ్యాక్‌ వస్తుంది (రూ.5000 ఖర్చు చేయాలి).
  • ఇంధన రుసుముపై రూ.3000 వరకు వార్షిక తగ్గింపును అందిస్తుంది.
  • ప్రతి రూ.150కు రెండు రివార్డు పాయింట్లు అందిస్తుంది.
  • బ్రిటిష్ ఎయిర్‌వేస్, సింగపూర్ ఎయిర్‌లైన్స్​లో ఫ్లైట్ టికెట్స్​ను బుక్ చేసుకున్నప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు.
    అయితే వీటితోపాటు ఐడీఎఫ్​సీ ఫస్ట్ మిలీనియం క్రెడిట్ కార్డ్, కొటాక్ 811 డ్రీమ్ డిఫరెండ్ క్రెడిట్ కార్డ్, ఫెడరల్ బ్యాంక్ స్కాపియా క్రెడిట్ కార్డ్, AU LIT క్రెడిట్ కార్డులు కూడా టాప్​-10 లైఫ్​ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డుల జాబితాలో కచ్చితంగా ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details