తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.9 లక్షల బడ్జెట్లో మంచి కారు కొనాలా? ఈ టాప్-10 వెహికల్స్​ ఇవే! - Best Car For Family - BEST CAR FOR FAMILY

Best Car For Family : ఫ్యామిలీతో కలిసి ట్రిప్స్​ వేసేందుకు కొత్త కారు కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.9 లక్షలా? అయితే ఈ స్టోరీ మీ కోసమే. ప్రస్తుతం భారత మార్కెట్లో మంచి మైలేజ్, ఫీచర్లతో లభిస్తున్న టాప్-10 కార్లపై ఓ లుక్కేద్దాం.

Best Car For Family
Best Car For Family (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 10, 2024, 12:33 PM IST

Best Car For Family : ప్రస్తుత కాలంలో కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలంటే కారు తప్పనిసరి అయిపోయింది! ఎందుకంటే బైక్​పై ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువ మంది ప్రయాణించలేరు. అందుకే తమ బడ్జెట్లో మంచి మైలేజ్, ఫీచర్లు ఉన్న కారు కొనాలని చాలా మంది ఆశపడుతుంటారు. ఇలాంటి వారి కోసం ప్రస్తుతం ఇండియన్​ మార్కెట్​లో రూ.9 లక్షల బడ్జెట్​లో ఉన్న 10 మంచి​ కార్ల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1. Citroen Basalt :సిట్రోయెన్ బసాల్ట్ కారు 6 వేరియంట్లు, 7 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ధర సుమారుగా రూ.7.99 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు మంచి మోడ్రన్ లుక్​లో కనిపిస్తుంది. అలాగే 6 ఎయిర్ బ్యాగులతో లభిస్తుంది.

  • ఇంజిన్ కెపాసిటీ : 1199 సీసీ
  • మైలేజ్ : 18.7 - 18.75 kmpl
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
  • ట్రాన్స్​మిషన్ : మాన్యువల్, ఆటోమేటిక్
  • సీటింగ్ కెపాసిటీ : 7

2. Maruti Brezza : మారుతి బ్రెజ్జా ఒక కాంపాక్ట్ ఎస్​యూవీ. ఇది మంచి రైడ్ ఎక్స్​పీరియన్స్​ను ఇస్తుంది. అలాగే విశాలమైన ఇంటీరియర్​ను కలిగి ఉంటుంది. మారుతి బ్రెజ్జా ధర సుమారుగా రూ. 8.34 లక్షలు - రూ.14.14 లక్షల వరకు ఉంటుంది. 15 వేరియంట్లలో ఈ కారు లభిస్తుంది.

  • ఇంజిన్ కెపాసిటీ : 1462 సీసీ
  • మైలేజ్ : 17.38- 19.89 kmpl
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
  • ట్రాన్స్​మిషన్ : మాన్యువల్, ఆటోమేటిక్
  • సీటింగ్ కెపాసిటీ : 5

3. Mahindra XUV 3XO : మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ 25 వేరియంట్లు, 16 కలర్స్​లో లభిస్తుంది. దీని ధర రూ.7.49 లక్షలు - రూ.15.49 లక్షల వరకు ఉంటుంది. ఈ ఎస్​యూవీలో విశాలమైన క్యాబిన్, సౌకర్యవంతమైన సీట్లు ఉంటాయి.

  • ఇంజిన్ కెపాసిటీ : 1197 సీసీ
  • మైలేజ్ : 18.06- 21.2 kmpl
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్, డీజిల్
  • ట్రాన్స్​మిషన్ : మాన్యువల్, ఆటోమేటిక్
  • సీటింగ్ కెపాసిటీ : 5

4. Toyota Urban Cruiser Taisor : ఈ కారు ఆకర్షణీయమైన లుక్​లో ఉంటుంది. విశాలమైన క్యాబిన్, ఆధునిక ఫీచర్లు, మంచి పెర్ఫార్మెన్స్​ను ఇస్తుంది. దీని ధర రూ.7.74 - రూ.13.04 లక్షల వరకు ఉంటుంది. ఇది 12 వేరియంట్లు, 12 కలర్ ఆప్షన్లలలో లభిస్తుంది.

  • ఇంజిన్ కెపాసిటీ : 1197 సీసీ
  • మైలేజ్ : 18.7- 18.75 kmpl
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్, సీఎన్ జీ
  • ట్రాన్స్​మిషన్ : మాన్యువల్, ఆటోమేటిక్
  • సీటింగ్ కెపాసిటీ : 5

5. Hyundai Venue :హ్యుందాయ్ వెన్యూ రిచ్ లుక్​లో ఉంటుంది. ఐదు గేర్‌ బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో నలుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఇది 25 వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్స్​లో లభిస్తుంది. దీని ధర రూ.7.94 లక్షలు - రూ.13.48 లక్షల వరకు ఉంటుంది.

  • ఇంజిన్ కెపాసిటీ : 998 సీసీ
  • మైలేజ్ : 17.5- 23.4 kmpl
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్, డీజిల్
  • ట్రాన్స్​మిషన్ : మాన్యువల్, ఆటోమేటిక్
  • సీటింగ్ కెపాసిటీ : 4

6. Kia Sonet :ఈ కారు 31 వేరియంట్లు, 9 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ధర రూ.7.99 లక్షలు - రూ.15.77 లక్షల వరకు ఉంటుంది. ఇదొక స్టైలిష్ కాంపాక్ట్ ఎస్​యూవీ. మంచి రైడింగ్ ఎక్స్​పీరియన్స్​ను ఇస్తుంది.

  • ఇంజిన్ కెపాసిటీ : 998 సీసీ టర్బోఛార్జెడ్
  • మైలేజ్ : 17.5- 23.4 kmpl
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
  • ట్రాన్స్​మిషన్ : మాన్యువల్, ఆటోమేటిక్

7. Tata Nexon : టాటా నెక్సాన్ ఆకర్షణీయమైన, విశాలవంతమైన ఇంటీరియర్​ను కలిగి ఉంటుంది. అలాగే ఫైవ్-స్టార్ సేఫ్టీ రేటింగ్​ను పొందింది. ఈ కారు ధర రూ.8 లక్షలు - రూ.15.80 లక్షల వరకు ఉంటుంది. 11 వేరియంట్లు, 6 కలర్ ఆప్షన్స్​లో లభిస్తుంది.

  • ఇంజిన్ కెపాసిటీ : 1199 సీసీ
  • మైలేజ్ : 17.01- 24.08 kmpl
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్, డీజిల్, సీఎన్ జీ
  • ట్రాన్స్​మిషన్ : మాన్యువల్, ఆటోమేటిక్
  • సీటింగ్ కెపాసిటీ : 5

8. Honda Amaze :మంచి రైడ్ ఎక్స్​పీరియన్స్​ను ఇస్తుంది. అలాగే మంచి లుక్​లో ఉంటుంది. 11 వేరియంట్లు, 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. హోండా అమేజ్ కారు ధర రూ.7.29 లక్షలు - రూ.10.05 లక్షల వరకు ఉంటుంది.

  • ఇంజిన్ : 1199 సీసీ
  • మైలేజ్ : 18.3-18.6 kmpl
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
  • ట్రాన్స్​మిషన్ : మాన్యువల్, ఆటోమేటిక్
  • సీటింగ్ కెపాసిటీ : 5

9. Nissan Magnite :బడ్జెట్​లో వెహికల్ కొనాలకునేవారికి నిస్సాన్ మాగ్నెట్ కారు మంచి ఆప్షన్ అవుతుంది. 999 సీసీ ఇంజిన్​తో ఈ కారు లభిస్తుంది. విశాలమైన ఇంటీరియర్​ను కలిగి ఉంటుంది. ఇది 30 వేరియంట్లు, 9 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ధర రూ.6 లక్షలు- రూ.11.11 లక్షల వరకు ఉంటుంది.

  • ఇంజిన్ : 999 సీసీ
  • మైలేజ్ : 17.4-19.7 kmpl
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
  • ట్రాన్స్​మిషన్ : మాన్యువల్, ఆటోమేటిక్
  • సీటింగ్ కెపాసిటీ : 5

10. Renault Triber :రెనో ట్రైబర్ 8 వేరియంట్లు, 9 కలర్ ఆప్షన్స్​లో లభిస్తుంది. ఇందులో నాలుగు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. దీని ధర రూ.6లక్షలు - రూ.8.98 లక్షల వరకు ఉంటుంది.

  • ఇంజిన్ : 999 సీసీ
  • మైలేజ్ : 18.2- 19 kmpl
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
  • ట్రాన్స్​మిషన్ : మాన్యువల్, ఆటోమేటిక్
  • సీటింగ్ కెపాసిటీ : 7

ఆగస్టులో లాంఛ్ కానున్న టాప్​-8 కార్స్ ఇవే! ఫీచర్స్ అదుర్స్ - ధర ఎంతో తెలుసా? - Cars Launching In August 2024

ట్యాక్సీ/క్యాబ్ బిజినెస్ చేస్తారా? టాప్-10 కమర్షియల్ కార్స్ ఇవే! - Best Commercial Car In 2024

ABOUT THE AUTHOR

...view details