Bank Holidays In October 2024 :రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2024 అక్టోబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం, దేశంలోని వివిధ బ్యాంకులకు ఏకంగా 15 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. వీటిలో కొన్ని జాతీయ సెలవులు, మరికొన్ని ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడం మంచిది.
2024 అక్టోబర్ నెలలోని బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే! - Bank Holidays In October 2024
Bank Holidays In October 2024 : బ్యాంక్ కస్టమర్లకు ముఖ్య గమనిక. 2024 అక్టోబర్ నెలలో ఏకంగా 15 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అందువల్ల బ్యాంక్ పనులు ఏమైనా ఉంటే, ఇప్పటి నుంచే పక్కాగా ప్లాన్ చేసుకోవడం మంచిది. లేకుంటే తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడెప్పుడు బ్యాంక్‌లకు సెలవులు ఉన్నాయో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
Published : Sep 27, 2024, 12:32 PM IST
List Of Bank Holidays In October 2024
2024 అక్టోబర్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితా ఇదే!
- అక్టోబర్ 1 (మంగళవారం) : జమ్మూకశ్మీర్ మూడో విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఆ రోజు జమ్ములోని బ్యాంకులు పనిచేయవు.
- అక్టోబర్ 2 (బుధవారం) : మహాత్మా గాంధీ జయంతి, మహాలయ అమావాస్య సందర్భంగా దేశంలోని బ్యాంకులు అన్నింటికీ సెలవు.
- అక్టోబర్ 3 (గురువారం) : నవరాత్ర స్థాపన సందర్భంగా రాజస్థాన్‌లోని బ్యాంకులకు సెలవు.
- అక్టోబర్ 6 (ఆదివారం)
- అక్టోబర్ 10 (గురువారం) : దుర్గాపూజ/ దసరా పండుగ సందర్భంగా త్రిపుర, అసోం, నాగాలాండ్, బంగాల్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు హాలీ డే ఉంటుంది.
- అక్టోబర్ 11 (శుక్రవారం) : దసరా, ఆయుధపూజ, దుర్గాష్టమి సందర్భంగా బ్యాంకులకు సెలవు.
- అక్టోబర్ 12 (రెండో శనివారం)
- అక్టోబర్ 13 (ఆదివారం)
- అక్టోబర్ 14 (సోమవారం) : దుర్గాపూజ (దసైన్) సందర్భంగా సిక్కింలోని బ్యాంకులకు సెలవు.
- అక్టోబర్ 16 (బుధవారం) :లక్ష్మీపూజ సందర్భంగా త్రిపుర, బంగాల్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.
- అక్టోబర్ 17 (గురువారం) : మహర్షి వాల్మీకి జయంతి/ కటి బిహు సందర్భంగా కర్ణాటక, అసోం, హిమాచల్‌ప్రదేశ్‌లోని బ్యాంకులు పని చేయవు.
- అక్టోబర్ 20 (ఆదివారం)
- అక్టోబర్ 26 (శనివారం) :భారతదేశంలో జమ్మూకశ్మీర్ విలీనం జరిగిన దినం (ఎక్సెషన్ డే) సందర్భంగా జమ్ము, శ్రీనగర్‌లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
- అక్టోబర్ 27 (ఆదివారం)
- అక్టోబర్ 31 (గురువారం) :దీపావళి/ నరక చతుర్దశి, సర్దార్ వల్లభ్‌బాయి పటేల్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు.
సెలవు దినాల్లో ఆర్థిక లావాదేవీలు జరపడం ఎలా?
How To Make Transactions In Bank Holidays : అక్టోబర్ నెలలో 15 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. అలాగే యూపీఐ, ఏటీఎం సేవలు కూడా ఎప్పటిలానే నడుస్తాయి. కనుక బ్యాంక్‌లకు వెళ్లకుండానే సులువుగా మీ ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టుకోవచ్చు.