5 Major Credit Card Mistakes : మన జీవితంలో అకస్మాత్తుగా అనేక ఆర్థిక అవసరాలు వస్తుంటాయి. అటువంటి అత్యవసర పరిస్థితుల్లో మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో క్రెడిట్ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే ప్రస్తుతం క్రెడిట్ కార్డులు నిత్యావసరంగా మారాయి. ఈ రోజుల్లో చెల్లింపులు చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు.
అయితే క్రెడిట్ కార్డును సరైన పద్ధతిలో ఉపయోగించుకున్నట్లయితే మీకు అత్యవసర సమయాల్లో ఆర్థిక సాధనంగా ఉపయోగపడుతుంది. అలాగే రివార్డ్స్, క్యాష్ బ్యాక్, డిస్కౌంట్లను అందిస్తుంది. అయితే, అనవసరమైన ఖర్చుల కోసం క్రెడిట్ కార్డును వాడడం మిమ్మల్ని అప్పుల ఊబిలోకి నెడుతుంది. ఈ క్రమంలో క్రెడిట్ కార్డు ఉన్నవారు చేయకూడని 5 తప్పులేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆలస్యంగా చెల్లింపులు
క్రెడిట్ కార్డులు తీసుకునేవారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. కొన్ని క్రెడిట్ కార్డు జారీ సంస్థలు అధిక వడ్డీ రేటుతో కార్డులను అందిస్తాయి. ఈ క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో కట్టేయాలి. లేదంటే ఆలస్య రుసుములు పడి అప్పుల ఊబిలో కూరుకుపోతారు. అలాగే క్రెడిట్ కార్డు బిల్లు సకాలంలో చెల్లించకపోవడం వల్ల మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఆటోమెటిక్ పేమెంట్స్ లేదా క్రెడిట్ కార్డు చెల్లింపులు సకాలంలో జరిగాయని నిర్ధరించే రిమైండర్‌ను సెట్ చేసుకోండి. అలాగే, క్రెడిట్ కార్డ్ బకాయిలకు కనీస చెల్లింపులు చేయకుండా ఉండడం మంచిది. లేదంటే మీ బకాయి ఉన్న బ్యాలెన్స్‌పై వడ్డీ పడుతుంది.
క్రెడిట్ వినియోగం
క్రెడిట్ బ్యూరో సంస్థలు పరిగణనలోకి తీసుకునే ముఖ్యమైన అంశాల్లో క్రెడిట్ యుటిలైజేషన్ లిమిట్ కూడా ఒకటి. క్రెడిట్ కార్డు కస్టమర్‌కు అనుమతించిన పరిమితిలో ఎంత మొత్తం వినియోగించారో ఇది తెలియజేస్తుంది. అందుకే క్రెడిట్ యుటిలైజేషన్ లిమిట్‌ను 30 శాతానికి మించనివ్వొద్దు. ఇది మంచి క్రెడిట్ స్కోరు మెయింటెన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే మీ కార్డ్ స్టేట్మెంట్లను క్రమం తప్పకుండా సమీక్షించండి. అప్పుడు మీ క్రెడిట్ కార్డుపై అనధికార ఛార్జీలు, బిల్లింగ్ ఎర్రర్స్, బోగస్ ఛార్జీలు ఏవైనా పడితే ఈజీగా గుర్తించగలరు.