Postal Life Insurance : జీవిత బీమాపై జనాల్లో అవగాహన పెరిగింది. కుటుంబ పెద్దలు తమకు ఏమైనా జరిగితే.. ఆ తర్వాత కుటుంబానికి అండగా ఉంటుందనే ఉద్దేశంతో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను సెలక్ట్ చేసుకుంటున్నారు. ఇందులో పలువురు టర్మ్ పాలసీలు తీసుకుంటున్నారు. కానీ.. చాలా మందికి అవి భారంగా ఉంటున్నాయి. అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తోందన్న కారణంతో వాటిని తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. అలాంటి వారికోసం.. పోస్టల్ డిపార్ట్ మెంట్ అందుబాటులో ఉండే జీవిత బీమా పాలసీలను అమలు చేస్తోంది. అలాంటి వాటిల్లో మేలైన పాలసీ (Health Insurance) గురించి ఇక్కడ చూద్దాం.
755 చెల్లిస్తే.. రూ.15 లక్షల బీమా..
పోస్టాఫీసు నుంచి ఈ బీమా తీసుకున్న వారు ప్రమాదవశాత్తూ మరణిస్తే.. వారి కుటుంబానికి రూ.15 లక్షలు చెల్లిస్తారు. నామినీగా ఎవరిని ఎంచుకుంటే వారికి ఈ నగదు అందుతుంది.
మరణించినప్పుడే కాకుండా.. శాశ్వత వైకల్యం కలిగినా కూడా రూ.15 లక్షలు చెల్లిస్తారు.
పాలసీదారులు మరణిస్తే.. పిల్లల చదువులకు ఇబ్బంది కాకుండా లక్ష రూపాయలు, పిల్లల పెళ్లి కోసం మరో లక్ష రూపాయలు అదనంగా చెల్లిస్తారు.
ఇక పాలసీదారుడు బతికి ఉంటే.. వైద్య ఖర్చులకు లక్ష రూపాయలు అందజేస్తారు.
ఆసుపత్రిలో సాధారణ వైద్యం చేయించుకుంటే.. రోజుకు వెయ్యి రూపాయలు, ICUలో చేరితే రోజుకు 2 వేల రూపాయలు ఇస్తారు.
చేయి లేదా కాలు విరిగితే.. రూ.25 వేల వరకు పరిహారం చెల్లిస్తారు.
399 రూపాయలు చెల్లిస్తే..
399 రూపాయల ప్రీమియంతో కూడా ప్రమాద బీమా అందుబాటులో ఉంది. ఈ పాలసీలో వ్యక్తి మరణిస్తే.. రూ.10 లక్షల వరకు ఇన్సూరెన్స్ పొందవచ్చు.
శాశ్వతంగా వైకల్యం ఏర్పడినా.. అవయవం కోల్పోయినా.. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా రూ.10 లక్షలు చెల్లిస్తారు.
పాలసీదారుకు ప్రమాదం జరిగి హాస్పిట్లో చేరితే.. ఇన్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ కింద రూ.60 వేల వరకు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది.
అదేవిధంగా.. ఔట్ పేషెంట్ కోటాలో రూ. 30 వేల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు.