తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వక్ఫ్ JPC మీటింగ్​లో గొడవ! గ్లాస్​ బాటిల్​ పగులగొట్టి గాయపడ్డ టీఎంసీ ఎంపీ - WAQF JPC MEETING SCUFFLE

వక్ఫ్ బిల్లుపై జేపీసీ మీటింగ్​లో గందరగోళం- ఎంపీల మధ్య వాగ్వాదం- గ్లాస్​ బాటిల్​ను​ టేబుల్​కు కొట్టి గాయపడిన టీఎంసీ ఎంపీ

Waqf JPC Meeting scuffle
Waqf JPC Meeting scuffle (ANI)

By ETV Bharat Telugu Team

Published : Oct 22, 2024, 3:03 PM IST

Updated : Oct 22, 2024, 4:03 PM IST

Waqf JPC Meeting scuffle : కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లుపై ఏర్పాటైన సంయుక్త​ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో మంగళవారం గందరగోళం నెలకొంది. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటి ఎంపీలు వాగ్వావాదానికి దిగారు. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ- గ్లాస్​ వాటర్ బాటిల్​ను టేబుల్​కు కొట్టి విసిరేశారు. దీంతో ఆయన చేతికి గాయం అయింది. ఈ కారణంగా కొద్దిసేపు సమావేశం ఆగిపోయింది. వెంటనే కల్యాన్​ బెనర్జీకి ప్రథమ చికిత్స చేశారు. ఆ తర్వాత ఆయన్ను ఏఐఎమ్​ఐఎమ్ అధినేత అసదుద్దీన్​ ఓవైసీ, ఆప్​ నేత సంజయ్ సింగ్ సమావేశం జరుగుతున్న గదికి తీసుకెళ్లారు. జగదాంబికా పాల్ నేతృత్వంలోని జేపీసీ- ఒడిశాలోని కటక్​కు చెందిన జస్టిస్​ ఇన్​ రియాలిటీ, పంచశాఖ ప్రచార్ ప్రతినిధుల అభిప్రాయాలు, సూచనలు వింటున్న క్రమంలో ఈ ఘటన జరింది. ఈ వ్యవహారాన్ని పార్లమెంటరీ కమిటీ తీవ్రంగా పరిగణించింది. కల్యాణ్​ బెనర్జీని ఒకరోజు సస్పెండ్ చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది.

కారణం ఇదే!
రిటైర్డ్​ జడ్జీలు, సుప్రీం కోర్టు లాయర్లు హాజరైన ఈ సమావేశంలో కల్యాణ్​ బెనర్జీ అప్పటికే మూడుసార్లు మాట్లాడారు. మరోసారి మాట్లాడే అవకాశం కావాలని కోరారు. అయితే దీనికి బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ అభ్యంతరం తెలిపారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమలో ఎంపీలు దుర్భాషలాడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అక్కడే ఉన్న గ్లాస్​ వాటర్​ బాటిల్​ను టేబుల్​కేసి కొట్టగా బెనర్జీ చేతికి గాయమైంది. అనంతరం పగిలిన బాటిల్​ను ఛైర్మన్​ వైపు విసిరేశారు. ఫలితంగా సమావేశం వాయిదా పడింది.

సోమవారం జరిగిన జేపీసీ సమావేశంలో కూడా సభ్యులు వాగ్వాదానికి దిగారు. విపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు బీజేపీ సభ్యులు కౌంటర్ ఇచ్చారు. వక్ఫ్​ బిల్లుపై సంప్రదింపుల ప్రక్రియపై విపక్ష సభ్యులు ప్రశ్నలు సంధించారు. రాజకీయ కారణాలతో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెడుతోందని ఆరోపించారు. ఈ బిల్లుపై ఏఐఎమ్ఐఎమ్ నేత అసదుద్దీన్​ ఓవైసీ దాదాపు గంట పాటు ప్రెజంటేషన్ ఇచ్చారు. బిల్లు వల్ల వచ్చే చిక్కులపై ఆందోళన వ్యక్తం చేశారు. అయికే, వక్ఫ్​ ఆస్తి నిర్వహణలో సంస్కరణలు తీసుకురావడానికి, పారదర్శకతకు భరోసా ఇవ్వడానికి ఈ బిల్లు అవసరమని బీజేపీ సభ్యులు వాదించారు.

Last Updated : Oct 22, 2024, 4:03 PM IST

ABOUT THE AUTHOR

...view details