Unique Marriage In Karnataka: గ్రామస్థులు అందరూ కలిసి తమ గ్రామ పంచాయతీ సభ్యుడికి అమ్మాయిని వెతికి మరీ వివాహం చేశారు. పెళ్లి ఖర్చులు కూడా భరించారు. ఈ వేడుకను ఘనంగా జరిపించి నూతన దంపతులను ఆశ్వీరాదించారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
దావణగారే మండలంలోని గూడాల్ గ్రామ పంచాయతీ సభ్యుడు అంజినప్ప(45). అంజినప్ప అంటే ఊరందరికీ ప్రేమ. గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేశాడు. అలానే తన ఓమ్ని కారును అంబులెన్స్ రూపంలో మార్చి అత్యవసర సేవలు అందిస్తున్నాడు. అలానే గ్రామంలో ప్రజలకు ఏ పని చేయడానికైనా ముందుకు వచ్చి మరి చేసేవాడు. ప్రజలకు ఎప్పుడు సహాయం చేస్తూ ఉండేవాడు. ఫలితంగా అంజినప్పను మూడు సార్లు పంచాయితీ సభ్యుడిగా గ్రామస్థులు ఎన్నుకున్నారు.
అయితే అంజినప్ప తన చెల్లిళ్ల కోసం పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ గ్రామస్థులు పెళ్లి చేసుకోవాలని ప్రోత్సహించారు. స్వయంగా గ్రామస్థులే వధువును చూశారు. హర్పనహళ్లి మండలానికి చెందిన పల్లవితో ఫిబ్రవరి 2న పెళ్లి చేశారు. కులమత భేదాలు లేకుండా గ్రామస్థులు అందరు కలిసి వివాహనికి కావాల్సిన మొత్తం ఖర్చులు భరించారు.
అనాథ యువతికి పెళ్లి చేసిన జిల్లా యంత్రాంగం
అనాథ ఆశ్రమంలో పెరిగిన ఓ యువతికి జిల్లా యంత్రాంగం వివాహం జరిపించింది. ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇంటర్వ్యూ ఆధారంగా వరుడిని ఎంపిక చేశారు. జిల్లా పరిపాలన యంత్రాంగం మొత్తం వధువు కుటుంబంగా నిలిచి ఈ వేడుకను ఘనంగా జరిపించారు. ఈ వివాహం హరియాణాలో జరిగింది.