తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాన్ని మరింత మెరుగుపరిచాం : నిర్మలా సీతారామన్ - UNION BUDGET 2025

Union Budget 2025 Live Updates
Union Budget 2025 Live Updates (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2025, 8:59 AM IST

Updated : Feb 1, 2025, 12:36 PM IST

Union Budget 2025 Live Updates : వికసిత భారత్‌ లక్ష్యంగా అడుగులేస్తున్న కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్​ను లోక్​సభలో ప్రవేశపెట్టారు. త్వరిత, సమ్మిళిత అభివృద్ధి, పెట్టుబడుల సాధన లక్ష్యంగా ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.

LIVE FEED

4:35 PM, 1 Feb 2025 (IST)

  • వ్యవసాయ రంగానికి అన్ని రకాలుగా అండగా ఉంటున్నాం
  • విత్తనం నుంచి మార్కెట్ వరకు అన్నిరకాల మార్పులకు శ్రీకారం చుట్టాం
  • పెట్టుబడిసాయం, రుణాలు, కొత్త వంగడాల సృష్టి.. ఇలా అనేక రకాలుగా రైతుకు మద్దతు ఇస్తున్నాం
  • చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాన్ని మరింత మెరుగుపరిచాం
  • పెరుగుతున్న అవసరాలకు తగినట్లు విద్యుదుత్పత్తి, పంపిణీకి ప్రాధాన్యం ఇచ్చాం
  • విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీకి అవసరమైన మూలధన వ్యయం కల్పించాం
  • ఖర్చు చేసే ప్రతి రూపాయి విషయంలో అత్యంత వివేకంతో వ్యవహరించాం

2:53 PM, 1 Feb 2025 (IST)

కేంద్ర బడ్జెట్‌లో 12 లక్షల రూపాయల్లోపు వార్షిక ఆదాయస్తులకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వడం మధ్యతరగతి వర్గానికి భారీ ఊరటనిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2025-26ఆర్థిక సంవత్సరం కోసం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌, ప్రజల బడ్జెట్‌, సంస్కరణల బడ్జెట్‌ అని మోదీ వ్యాఖ్యానించారు. ప్రతీ భారతీయుడి కలలను నెరవేర్చే ఈ పద్దు.. 140 కోట్లమంది ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందన్నారు. ప్రతీసారి బడ్జెట్‌ ప్రభుత్వ కోషాగారాన్ని నింపడంపై దృష్టిసారిస్తే.. ఈసారి పద్దు మాత్రం ప్రజల జేబులను నింపడానికి, తద్వారా వారి పొదుపును పెంచడానికి ఉద్దేశించిందని మోదీ వివరించారు. ప్రజల పొదుపు, పెట్టుబడులకు ఊతమిస్తుందని పేర్కొన్నారు. పర్యాటకం, మౌలికవసతుల అభివృద్దికి బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించినట్లు తెలిపారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ను ఈ పన్ను మరింత బలోపేతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

12:35 PM, 1 Feb 2025 (IST)

బడ్జెట్‌లో కీలక ప్రకటనలు ఇవే

  • ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్‌
  • కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు పన్ను సున్నా
  • వృద్ధులకు వడ్డీపై టీసీఎస్‌ ఊరట
  • 36 ఔషధాలకు బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ తొలగింపు
  • బీమా రంగంలో ఎఫ్‌డీఐ 100 శాతానికి పెంపు
  • వచ్చే వారం ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బిల్లు
  • గిగ్‌ వర్కర్లకు ఆరోగ్య బీమా
  • కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు

12:14 PM, 1 Feb 2025 (IST)

రూ.12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి మినహాయింపు

  • వ్యక్తిగత ఆదాయపన్నుపై కేంద్రం కీలక నిర్ణయం
  • రూ.12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి మినహాయింపు
  • స్టాండర్డ్‌ డిడక్షన్‌తో కలుపుకొంటే రూ.12.75 లక్షల వరకు పన్ను సున్నా

12:07 PM, 1 Feb 2025 (IST)

వచ్చే వారం పార్లమెంటు ముందుకు ప్రత్యేక ఇన్​కమ్ ట్యాక్స్​ బిల్లు

  • వచ్చే వారం పార్లమెంటు ముందుకు ప్రత్యేక వ్యక్తిగత ఆదాయపన్ను బిల్లు
  • ఆదాయపన్ను విధానంలో సంస్కరణలు తీసుకొస్తున్నాం
  • ఆదాయపన్ను విధానాన్ని మరింత సులభతరం చేస్తాం
  • ప్రస్తుత ఆదాయపన్ను నిబంధనల్లో సగానికి తగ్గిస్తాం
  • బిల్లులో సులభతర విధానం తీసుకురాబోతున్నాం
  • TDS, TCSను క్రమబద్ధీకరిస్తాం
  • వృద్ధులకు వచ్చే ఆదాయంపై వడ్డీని రూ.లక్షకు పెంచాం
  • రూ.6 లక్షలలోపు అద్దెను ఆదాయపన్ను నుంచి మినహాయింపు

12:03 PM, 1 Feb 2025 (IST)

క్యాన్సర్‌, తీవ్రవ్యాధులకు సంబంధించిన 36 ఔషధాలపై దిగుమతి సుంకం తొలగింపు

  • క్యాన్సర్‌, తీవ్రవ్యాధులకు సంబంధించిన 36 ఔషధాలపై దిగుమతి సుంకం తొలగింపు
  • మరో ఆరు రకాల ఔషధాలపై దిగుమతి సుంకం రద్దు
  • ఔషధాలకు అవసరమైన బల్క్‌ డ్రగ్స్‌ దిగుమతులపై సుంకం రద్దు
  • విద్యుత్‌ వాహనాలు, మొబైల్‌ ఫోన్లకు అవసరమైన లిథియం అయాన్‌ బ్యాటరీలకు అదనపు ప్రోత్సాహకాలు

11:53 AM, 1 Feb 2025 (IST)

బీమా రంగంలో 74 శాతం నుంచి వంద శాతానికి ఎఫ్‌డీఐల పెంపు

  • ద్వితీయశ్రేణి నగరాల్లో జీజీసీల ఏర్పాటుకు రాష్ట్రాలకు సహాయం
  • పండ్లు, కూరగాయల ఎగుమతులకు అవసరమైన ప్రత్యేక కార్గో సౌకర్యం
  • బీమా రంగంలో 74 శాతం నుంచి వంద శాతానికి ఎఫ్‌డీఐల పెంపు
  • ప్రీమియం మొత్తం ఇండియాలోనే ఉంచే సంస్థలకు ఈ వెసులుబాటు

11:50 AM, 1 Feb 2025 (IST)

IIT, IIS విద్యార్థులకు రూ.10 వేల కోట్ల స్కాలర్​షిప్స్​

  • షిప్‌ బిల్డింగ్‌ కోసం కొత్త ఎకో సిస్టమ్‌ ఏర్పాటు
  • ఐఐటీ, ఐఐఎస్‌ విద్యార్థులకు రూ.10 వేల కోట్ల ఉపకార వేతనాలు
  • జ్ఞానభారత మిషన్‌ ఏర్పాటు
  • మ్యూజియాలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉన్న పురాతత్వ ప్రతుల పునరుద్ధరణకు సాయం
  • ఎగుమతులు పెంచేలా ఎంఎస్‌ఎంఈ, వాణిజ్య శాఖల ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు
  • ఎగుమతుల డాక్యుమెంటేషన్‌ విషయంలో సహాయం
  • ఎగుమతులకు ఉద్దేశించిన ప్రత్యేక వస్తువులకు అదనపు సాయం
  • విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం పంపిణీ సంస్థలకు ప్రోత్సాహకాలు
  • విద్యుత్ సంస్కరణలకు కీలకంగా రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం
  • వర్థమాన ద్వితీయ శ్రేణి నగరాల్లో జీసీసీల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సాహం
  • ఉద్యాన పంటల ఉత్పత్తుల రవాణకు ప్రత్యేక కార్యక్రమం

11:45 AM, 1 Feb 2025 (IST)

ఉడాన్‌ పథకం ద్వారా 120 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు

  • ఉడాన్‌ పథకం ద్వారా 120 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు
  • వచ్చే పదేళ్లలో 4 కోట్ల మంది కొత్త ప్రయాణికులకు సౌకర్యం
  • బిహార్‌లో కొత్త గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు
  • పట్నా ఎయిర్‌పోర్టు అభివృద్ధికి చర్యలు
  • మిథిలాంచల్‌ ప్రాంతంలో పశ్చిమ కోసి కాలువ నిర్మాణం
  • ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్‌ టూరిజంపై అదనపు శ్రద్ధ
  • మెడికల్‌ టూరిజం ప్రోత్సాహానికి వీసా నిబంధనల సులభతరం

11:40 AM, 1 Feb 2025 (IST)

కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5లక్షలకు పెంపు

  • చిన్నస్థాయి అణురియాక్టర్ల కోసం జాతీయ అణుశక్తి మిషన్
  • దేశవ్యాప్తంగా పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల విక్రయానికి రెండో ప్రణాళిక
  • రూ.25 వేల కోట్లతో నేషనల్ మారిటైమ్ ఫండ్ ఏర్పాటు
  • ప్రభుత్వం, ప్రైవేటు, పోర్టుల భాగస్వామ్యంతో మారిటైమ్ మిషన్‌
  • వృద్ధి కేంద్రాలుగా పట్టణాల అభివృద్ధికి రూ.లక్ష కోట్లతో ప్రత్యేక మిషన్
  • కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.3 లక్షల నుంచి రూ. 5లక్షలకు పెంపు
  • 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం
  • రూ.20 వేల కోట్లతో నేషనల్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్
  • 2030 నాటికి నాలుగు చిన్న, మధ్యస్థాయి రియాక్టర్ల ఏర్పాటు

11:34 AM, 1 Feb 2025 (IST)

వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 75 వేల కొత్త మెడికల్ సీట్లు

  • వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 75 వేల కొత్త మెడికల్ సీట్లు
  • దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు
  • సంస్కరణలకు ప్రోత్సాహంగా రాష్ట్రాలకు 5 ఏళ్ల వ్యవధితో వడ్డీ లేని రుణాలు
  • జల్‌జీవన్ మిషన్ కింద 15 కోట్ల మందికి రక్షిత మంచినీరు అందించాం
  • ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందించేందుకు మరిన్ని నిధులు
  • రాష్ట్రాలు, యూటీలతో ఒప్పందం ద్వారా 100 శాతం మంచినీటి కుళాయిలు
  • పీఎం ఆరోగ్య యోజన కింద గిగ్‌ వర్కర్ల కోసం హెల్త్ కార్డులు
  • గిగ్‌ వర్కర్ల నమోదు, ఐడీ కార్డుల కోసం ప్రత్యేక ఆన్‌లైన్ వేదిక

11:26 AM, 1 Feb 2025 (IST)

ఆరు విభాగాల్లో సంస్కరణలకు కేంద్రం శ్రీకారం

  • ఆరు విభాగాల్లో సంస్కరణలకు కేంద్రం శ్రీకారం
  • పన్నులు, పట్టణాభివృద్ధి, ఆర్థిక రంగంలో సంస్కరణలు
  • గనులు, విద్యుత్‌, నియంత్రణ సంస్థల్లో సంస్కరణలు
  • ఆర్థిక రంగానికి మూడో ఇంజిన్‌గా పెట్టుబడులు
  • 8 కోట్ల మంది చిన్నారులు, కోటి మంది బాలింతల కోసం అంగన్‌వాడీ 2.0
  • దేశవ్యాప్తంగా 50 వేల పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల ఏర్పాటు
  • క్లీన్‌టెక్‌ మిషన్ కింద సోలార్, ఈవీ, బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహం
  • పరిశ్రమలకు ప్రోత్సాహం కోసం నేషనల్ మానుఫ్యాక్చరింగ్ మిషన్
  • రూ.30 వేల పరిమితితో పట్టణ పేదల కోసం యూపీఐ లింక్డ్‌ క్రెడిట్‌ కార్డులు
  • వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 75 వేల కొత్త మెడికల్ సీట్లు


11:16 AM, 1 Feb 2025 (IST)

బొమ్మల తయారీలో దేశాన్ని ప్రపంచస్థాయిలో నిలిపేలా ప్రత్యేక కార్యక్రమం

  • పత్తి ఉత్పాదకత పెంచేందుకు జాతీయస్థాయిలో ప్రత్యేక మిషన్
  • పత్తి రైతులకు మేలు చేసేలా దీర్ఘకాలిక లక్ష్యాలతో జాతీయ పత్తి మిషన్
  • 7.74 కోట్ల రైతులకు స్వల్పకాలిక రుణాల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులు
  • యూరియా ఉత్పత్తిలో స్వయంసమృద్ధికి కొత్త కర్మాగారాలు
  • ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే పది సూత్రాల్లో రెండోది ఎంఎస్‌ఎంఈ రంగం
  • ఎగుమతుల్లో 45 శాతం వరకు ఎంఎస్‌ఎంఈల భాగస్వామ్యం
  • ఎంఎస్‌ఎంఈలకు వచ్చే ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లు
  • 27 రంగాల్లో స్టార్టప్‌లకు రుణాల కోసం ప్రత్యేక కార్యాచరణ
  • నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు రూ.5 లక్షలతో క్రెడిట్ కార్డు
  • సూక్ష్మ సంస్థలకు తొలి ఏడాది 10 లక్షల వరకు క్రెడిట్ కార్డులు
  • ఎంఎస్‌ఎంఈలకు రూ.10 వేల కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్ ఏర్పాటు
  • బొమ్మల తయారీలో దేశాన్ని ప్రపంచస్థాయిలో నిలిపేలా ప్రత్యేక కార్యక్రమం
  • మేడిన్ ఇండియా బ్రాండ్ కింద బొమ్మల తయారీకి ప్రత్యేక ప్రోత్సాహం
  • బిహార్‌లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ ఫుడ్ టెక్నాలజీ, అంత్రపెన్యూర్‌షిప్

11:13 AM, 1 Feb 2025 (IST)

వాకౌట్‌ చేసిన విపక్షాలు

  • విపక్షాల నిరసనల మధ్య బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి
  • బడ్జెట్‌ ప్రసంగం సమయంలో సభ నుంచి వాకౌట్‌ చేసిన విపక్షాలు

11:10 AM, 1 Feb 2025 (IST)

బడ్జెట్​ చదువుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

  • త్వరిత, సమ్మిళిత అభివృద్ధి, పెట్టుబడుల సాధన లక్ష్యంగా బడ్జెట్‌
  • గత పదేళ్లలో సాధించిన అభివృద్ధే మాకు స్ఫూర్తి, మార్గదర్శి
  • పదేళ్లలో సాధించిన అభివృద్ధి, సంస్కరణలతో ప్రత్యేక గుర్తింపు
  • ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించినా భారత్‌ మెరుగైన పనితీరు సాధించింది
  • గురజాడ సూక్తిని ప్రస్తావించిన నిర్మలా సీతారామన్‌
  • 'దేశమంటే మట్టి కాదోయ్‌- దేశమంటే మనుషులోయ్‌' నినాదం ప్రస్తావించిన నిర్మల
  • పది కీలక రంగాలపై ప్రత్యేక దృష్టితో కేంద్ర బడ్జెట్ 2025-26
  • రాష్ట్రాల భాగస్వామ్యంతో పీఎం ధన్‌ధాన్య యోజన పథకం అమలు
  • గ్రామీణ ప్రాంతాల నుంచి వలసల నివారణకు ప్రత్యేక కార్యక్రమం
  • పప్పుధాన్యాల స్వయంసమృద్ధికి 6 ఏళ్ల వ్యవధితో ప్రత్యేక మిషన్
  • కూరగాయలు, పండ్ల లభ్యత పెంచేలా ప్రత్యేక సమగ్ర కార్యక్రమం
  • పండ్లు, కూరగాయల లభ్యత పెంచేలా రాష్ట్రాలతో కలసి ప్రత్యేక ప్రాజెక్టు
  • బిహార్ కేంద్రంగా మఖానా బోర్డు ఏర్పాటు

11:02 AM, 1 Feb 2025 (IST)

  • పార్లమెంటు ముందుకు కేంద్ర వార్షిక బడ్జెట్‌
  • బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌
  • వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్‌
  • ఎన్డీఏ ప్రభుత్వం మూడోదఫా అధికారంలోకి వచ్చాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌

10:41 AM, 1 Feb 2025 (IST)

బడ్జెట్​కు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం

  • బడ్జెట్​కు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం
  • కాసేపట్లో పార్లమెంట్​లో బడ్జెట్​ ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

10:30 AM, 1 Feb 2025 (IST)

కాసేపట్లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

  • కేంద్ర క్యాబినెట్‌ సమావేశం ప్రారంభం
  • సమావేశం అనంతరం బడ్జెట్​కు ఆమోదం తెలపనున్న కేంద్ర మంత్రివర్గం
  • కాసేపట్లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

10:06 AM, 1 Feb 2025 (IST)

బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేంద్ర మంత్రివర్గం

  • పార్లమెంట్​కు చేరుకున్న ఆర్థిక మంత్రి సీతారామన్
  • బడ్జెట్​ ట్యాబ్​తో ఫొటోలకు పోజుఇచ్చిన ఆర్థిక మంత్రి
  • కాసేపట్లో కేంద్ర మంత్రివర్గ సమావేశం
  • బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేంద్ర మంత్రివర్గం

10:04 AM, 1 Feb 2025 (IST)

  • బడ్జెట్ వివరాలను రాష్ట్రపతి ద్రౌపదీముర్ముకు వివరించిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌
  • కేంద్రమంత్రికి మిఠాయి తినిపించిన రాష్ట్రపతి

9:43 AM, 1 Feb 2025 (IST)

రాష్ట్రపతితో కేంద్ర ఆర్థిక మంత్రి భేటీ

కాసేపట్లో పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వరుసగా ఎనిమిదోసారి సీతారామన్‌ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా సీతారామన్‌ నిలవనున్నారు. అంతకుముందు బడ్జెట్ ట్యాబ్‌తో నిర్మలా సీతారామన్‌ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపదీముర్ముతో సమావేశమై బడ్జెడ్‌ ట్యాబ్‌ను చూపి కాసేపు మాట్లాడారు. ఎన్​డీఏ ప్రభుత్వం మూడోదఫా అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడుతోంది.

9:39 AM, 1 Feb 2025 (IST)

బడ్జెట్‌కు ముందు లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

  • లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
  • సెన్సెక్స్​ 136 పాయింట్ల లాభంతో 77,637 వద్ద ట్రేడింగ్ ప్రారంభం
  • నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 23,528 వద్ద ట్రేడింగ్

9:12 AM, 1 Feb 2025 (IST)

రాష్ట్రపతి భవన్‌కు బయల్దేరిన నిర్మలా సీతారామన్‌

ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్‌

Last Updated : Feb 1, 2025, 12:36 PM IST

ABOUT THE AUTHOR

...view details