తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పేదలు, యువత, అన్నదాతలే టార్గెట్​- కేంద్ర బడ్జెట్​లో కీలక విషయాలివే! - UNION BUDGET 2025

కేంద్ర బడ్జెట్ 2025 : రూ. 50,65,345 కోట్లలో ఎవరికి ఎంత కేటాయించారంటే?

Union Budget 2025 Estimates
Union Budget 2025 Estimates (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2025, 3:02 PM IST

Union Budget 2025 Estimates :పేదలు, యువత, రైతులు, మహిళల పురోభివద్ధే లక్ష్యంగా కేంద్రం 2025-26 బడ్జెట్‌ను పార్లమెంటు ముందు ఉంచింది. వికసిత్ భారత్‌ దిశగా సంస్కరణలు కొనసాగిస్తామని చెబుతూనే సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఎవరూ ఊహించని విధంగా చరిత్రలో తొలిసారి వేతన జీవులకు 12 లక్షల వరకూ ఆదాయ పన్ను మినహాయింపులు కల్పించింది. మొత్తం రూ.50,65,345 కోట్లతో నూతన బడ్జెట్‌ను ప్రతిపాదించింది.

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్​లో బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఇది 8వ సారి. తద్వారా ఎక్కువసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా అరుదైన ఘనత సాధించారు. 'ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించిన అభివృద్ధి చర్యలు పది విస్తృత రంగాల్లో ఉన్నాయి. పేదలు, యువత, అన్నదాత, మహిళలపై దృష్టిపెట్టినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. 'వ్యవసాయ అభివృద్ధి, దిగుబడి పెంపు, గ్రామాల్లో నిర్మాణాత్మక అభివృద్ధి, సమగ్రాభివృద్ధి పథంలోకి అందరినీ కలుపుకుని వెళ్లడం, మేకిన్‌ ఇండియాలో భాగంగా ఉత్పత్తి పెంపు, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఇలకు మద్దతు, ఉద్యోగాలు కల్పించే అభివృద్ధి, ప్రజా ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణల రంగంలో పెట్టుబడులు, ఇంధన సరఫరా పరిరక్షణ, ఎగుమతులకు ప్రోత్సాహం, ఆవిష్కరణలు పెంచి పోషించడం ఇందులో భాగం. ఈ అభివృద్ధి యాత్రలో వ్యవసాయం, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ, పెట్టుబడులు, ఎగుమతులు మన శక్తివంతమైన ఇంజన్లు' అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

2025-26 బడ్జెట్‌ ఆదాయం(కోట్లు) :

మొత్తం ఆదాయం 50,65,345
రెవెన్యూ ఆదాయం 34,20,409
మూలధన ఆదాయం 16,44,936
రుణ వసూళ్లు 29,000
ఇతర ఆదాయం 47,000
అప్పులు,ఇతర రుణాలు 15,68,936

2025-26 బడ్జెట్‌ వ్యయం( కోట్లు)

మొత్తం వ్యయం 50,65,345
రెవెన్యూ వ్యయం 39,44,255
వడ్డీ చెల్లింపులు 12,76,338
గ్రాంట్స్‌ ఇన్ ఎయిడ్ 4,27,192
మూలధన వ్యయం 11,21,090
రెవెన్యూలోటు 5,23,846
ద్రవ్యలోటు 15,68,936

వివిధ శాఖలు- కేటాయింపులు :

రంగాలుకేటాయింపులు
రక్షణరంగం రూ. 4,91,732 కోట్లు
గ్రామీణాభివృద్ధి రూ.2,66,817 కోట్లు
హోంశాఖ రూ.2,33,211 కోట్లు
వ్యవసాయం రూ.1,71,437 కోట్లు
విద్యారంగం రూ.1,28,650 కోట్లు
ఆరోగ్యరంగం రూ.98,311 కోట్లు
పట్టణాభివృద్ధి రంగం రూ.96,777 కోట్లు
ఐటీ, టెలికాం రూ.95,298 కోట్లు
ఇంధన రంగం రూ.81,174 కోట్లు
వాణిజ్యం, పారిశ్రామికం రూ.65,553 కోట్లు
సామాజిక సంక్షేమం రూ.60,052 కోట్లు
శాస్త్ర సాంకేతిక రంగం రూ.55,679 కోట్లు

కేంద్రబడ్జెట్‌లో ఆదాయ వ్యయ వివరాలను కేంద్రం స్పష్టంగా వివరించింది.

బడ్జెట్‌లో రూపాయి రాక(పైసల్లో)

అప్పులు 24
జీఎస్​టీ 18
కార్పొరేట్ 17
ఆదాయ పన్ను 22
కస్టమ్స్‌ పన్ను 04
ఎక్సైజ్‌ పన్ను 05
పన్నేతర ఆదాయం 09
రుణేతర మూలధన 01


బడ్జెట్‌లో రూపాయి పోక(పైసల్లో)

పన్నుల్లో రాష్ట్రాల వాటా 22
వడ్డీ చెల్లింపులు 20
కేంద్ర పథకాలకు 16
రక్షణరంగానికి 08
మేజర్‌ రాయితీలు 06
ఫైనాన్స్ కమిషన్ 08
కేంద్ర ప్రాయోజిత పథకాలు 08
ఇతర ఖర్చులు 08
పెన్షన్లు 04

ABOUT THE AUTHOR

...view details