Uddhav Thackeray Health Issue : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం ఆయనను ముంబయిలోని రిలయన్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ఉద్ధవ్‌కు గుండె సంబంధిత సమస్య తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇంతకుముందు 2012లో ఉద్ధవ్ ఠాక్రే యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు.
ఆస్పత్రిలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే - UDDHAV THACKERAY HEALTH
శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు అస్వస్థత- యాంజియోప్లాస్టీ నిర్వహించే అవకాశం
Published : Oct 14, 2024, 3:46 PM IST
|Updated : Oct 14, 2024, 4:15 PM IST
ఉద్ధవ్ ఠాక్రే ఆరోగ్యం విషయంపై ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే సోషల్ మీడియాలో స్పందించారు. ముందుగా ప్లాన్ చేసుకున్న విధంగానే ఉద్ధవ్ ఠాక్రే సోమవారం ఉదయం రిలయన్స్ ఆస్పత్రికి సాధారణ చెకప్ కోసం వెళ్లారని తెలిపారు. అందరి ఆశీస్సులతో ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. సోమవారం సాయంత్రం ఉద్ధవ్ ఠాక్రే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు.