Telangana Tourism Goa Tour Package 2024:నిత్యం టూరిస్టులతో కళకళలాడే గోవాకు మన దేశంలోని పర్యాటకులతో పాటు.. ఎంతో మంది విదేశీయులు కూడా వస్తుంటారు. మరి మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా ? అయితే, మీకో గుడ్‌న్యూస్. చాలా తక్కువ బడ్జెట్‌లోనే తెలంగాణ టూరిజం (Telangana Tourism) గోవా టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. మరి లేట్ చేయకుండా.. గోవా ట్రిప్ ఎన్ని రోజులు ఉంటుంది ? ఒక్కరికి ఎన్ని డబ్బులు ఛార్జ్ చేస్తారు ? అనే వివరాలను ఇప్పుడు చూద్దాం.
తెలంగాణ టూరిజం హైదరాబాద్ నుంచి గోవాకు.. గోవా ప్యాకేజ్ టూర్- ఇటెనరరీ (GOA PACKAGE TOUR – ITINERARY) పేరుతో ట్రిప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ నాలుగు రోజుల పాటు ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఈ టూర్ స్టార్ట్ అవుతుంది. వివరాలు చూస్తే..
హైదరాబాద్ - గోవా టూర్ షెడ్యూల్ ఇదే :
- మొదటి రోజు బషీర్‌బాగ్ నుంచి మధ్యాహ్నాం 2 గంటలకు గోవాకు ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రంతా జర్నీ చేసిన తర్వాత గోవాకు చేరుకుంటారు.
- రెండవ రోజున ఉదయం 6 గంటలకు కలంగుట్ (Calangute) చేరుకుంటారు. అక్కడ హోటల్‌లో ఫ్రెషప్ అయిన తర్వాత.. నార్త్ గోవాలోని మపుసా సిటీ, బోగ్దేశ్వర్ ఆలయం, ఫోర్ట్ అగుడా, బాగా బీచ్, కలంగుట్ బీచ్ వంటివాటిని చూస్తారు.
- మూడవ రోజున సౌత్ గోవాలో టూర్ ఉంటుంది. ఇక్కడ డోనా పౌలా బీచ్, మిరామార్ (గాస్పర్ డయాస్ బీచ్), ఓల్డ్ గోవా చర్చిలు, మంగేషి టెంపుల్, కోల్వా బీచ్, మార్డోల్ బీచ్‌లలో ఎంజాయ్ చేయొచ్చు.
- సాయంత్రం పాన్‌జిమ్‌లో క్రూజ్‌బోట్‌లో జర్నీ ఉంటుంది. ఇక్కడ జర్నీ కోసం మీరే సొంతంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అది ఒక్కొక్కరికి రూ.500లను చెల్లించాల్సి ఉంటుంది.
- తర్వాత నైట్ కలంగుట్ చేరుకుని.. అక్కడే స్టే చేస్తారు.
- నాలుగవ రోజున ఉదయం 11 గంటలకు కలంగుట్ నుంచి హైదరాబాద్‌కు జర్నీ స్టార్ట్ అవుతుంది.
- ఐదవ రోజున మార్నింగ్ 6 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. దీంతో గోవా టూర్ పూర్తవుతుంది.