తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మాలీవాల్ కేసు దర్యాప్తు కోసం సిట్- 'అప్పుడు లేడీ సింగం- ఇప్పుడేమో బీజేపీ ఏజెంటా?'- ఆప్​పై స్వాతి ఫైర్ - Swati Maliwal Assault Case - SWATI MALIWAL ASSAULT CASE

Maliwal On App Leaders : ఆప్ ఎంపీ స్వాతీ మాలీవాల్​పై దాడి కేసును దర్యాప్తు చేసేందుకు సిట్​ను ఏర్పాటు చేశారు దిల్లీ పోలీసులు. మరోవైపు ఆప్​ తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, అలాగే అవినీతి కేసును నమోదు చేస్తారని బెందిస్తున్నారని ఎంపీ స్వాతీ మాలీవాల్​ మండిపడ్డారు.

Maliwal On App Leaders
Maliwal On App Leaders (ANI)

By ETV Bharat Telugu Team

Published : May 21, 2024, 8:16 AM IST

Updated : May 21, 2024, 9:34 AM IST

Swati Maliwal On Assualt Case : ఆప్ ఎంపీ స్వాతీ మాలీవాల్​పై దాడి కేసును దర్యాప్తు చేసేందుకు దిల్లీ పోలీసులు స్పెషల్ ఇన్విస్టిగేషన్​ టీమ్​(సిట్)ను​ ఏర్పాటు చేశారు. నార్త్ దిల్లీ అదనపు డీసీపీ అంజిత చెప్యాలా నేతృత్యంలో సిట్​ ఏర్పాటు చేశారు. ఈ టీమ్​లో ముగ్గురు ఇన్​స్పెక్టర్ స్థాయి అధికారులు, ఒకరు సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ అధికారి ఉన్నారు. విచారణ జరిపిన తర్వాత సిట్ తన నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తుందని దిల్లీ పోలీసులు తెలిపారు. మరోవైపు ఆప్​ తనపై అసత్యాలను ప్రచారం చేస్తుందని మాలీవాల్ ఎక్స్ వేదికగా స్పందించారు.

ఇప్పుడు బీజేపీ ఏజెంటా?
దిల్లీ మంత్రులు, ఆప్​ నేతలు తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఎంపీ స్వాతీ మాలీవాల్ మండిపడ్డారు. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహయకుడు బిభవ్ కుమార్​ దాడి చేశారని చెప్పినందుకు తనపై పాత కేసులు తిరగేస్తామంటూ బెదిరిస్తున్నారని మాలీవాల్ తెలిపారు. బీజేపీ ఆదేశాల మేరకే ఇదంతా చేస్తున్నారని ఆప్​ నేతలు చేస్తున్న విమర్శలపై స్వాతీ స్పందిస్తూ ఎక్స్​లో పోస్ట్ చేశారు.

"నేను బీజేపీ ఆదేశాల మేరకే ఇదంతా చేశానని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. నేను అవినీతికి పాల్పడినట్లు నాపై ఎఫ్​ఐఆర్​ వేస్తామని అంటున్నారు. ఆ ఎఫ్​ఐఆర్​ 8 ఏళ్ల క్రితమే 2016లో నమోదు చేశారు. ఆ తర్వాత సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ నన్ను రెండు సార్లు మహిళా ఛైర్​పర్స్​గా నియమించారు. ఈ కేసు పూర్తి నకిలీదని, అప్పడే కోర్టు సంవత్సరన్నర పాటు స్టే విధించింది. నగదు లావాదేవీలు ఏమి జరగలేదని తెలిపింది. దిల్లీ మంత్రుల ప్రకారం ఇప్పటి వరకు నేను లేడీ సింగంగా ఉన్నా. బిభవ్ కుమార్​పై ఫిర్యాదు చేసే సరికి బీజేపీ ఏజెంట్​గా మారాను? నేను నిజం మాట్లాడినందుకే మొత్తం ట్రోల్​ ఆర్మీని నాపై మోహరించారు. నా బంధువుల వివరాలను వారి కారు నంబర్లను ట్వీట్ చేయడం వల్ల వారి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. అబద్ధాలు ఎక్కువ కాలం ఉండవు. మీరు చేప్పే ప్రతి అబద్ధానికి నేను మిమ్మల్ని కోర్టుకి తీసుకెళ్తాను"

---స్వాతీ మాలీవాల్, ఆప్​ ఎంపీ

సీఎం ఇంట్లో సీన్​ రీ క్రియేట్
మరోవైపు సీన్ రీ క్రియేట్ చేయడానికి బిభవ్​ కుమార్​ను సీఎం కేజ్రీవాల్ నివాసానికి తీసుకెళ్లారు. మే 13 ఉదయం జరిగిన ఘటనల క్రమం గురించి వివరాలు తెలుసుకోవడానికి డ్రాయింగ్ రూమ్​కు తీసుకెళ్లారు. అక్కడే మాలీవాల్​పై దాడి జరిగిన్నట్లు ఆరోణలు ఉన్నాయి. సీక్వెన్స్ వారీగా పోలీసులు ప్రశ్నలు అడిగి వాటికి సమాధానాలను రాసుకున్నారు. దాదాపు గంటపాటు సీఎం ఇంటిలోనే విచారించారు. ఇప్పుడు స్వాతీ మాలీవాల్, బిభవ్​ కుమార్​లతో సీన్​ రీ క్రియేట్ చేసి వారి వాంగ్మూలను తీసుకున్నామని దిల్లీ పోలీసులు తెలిపారు. వాటిని ఇప్పుడు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.

అదుపుతప్పి 20 అడుగుల లోయలో పడ్డ బస్సు- 19మంది మృతి- 8మందికి తీవ్ర గాయాలు - Accident In Chhattisgarh

మైనారిటీలకు వ్యతిరేకంగా ఒక్కసారి కూడా మాట్లాడలేదు- NDAకు 400సీట్లు పక్కా!: ప్రధాని మోదీ - Lok Sabha Elections 2024

Last Updated : May 21, 2024, 9:34 AM IST

ABOUT THE AUTHOR

...view details