Stone Floating On Water In Bihar : బిహార్లోని ఓ దేవాలయంలో నీటిలో తేలియాడే రాయిని చూసేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ రాయిపై శ్రీరామ్ రాసి అని ఉండడమే అందుకు కారణం. అది రాముడి శిల అని దానిని చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. కేవలం బిహార్ నుంచే కాదు నేపాల్, బంగాల్ నుంచి కూడా భక్తులు వస్తున్నారు.
ముజఫర్పుర్ జిల్లాలోని బాబా గరీబ్నాథ్ ఆలయంలో ఈ అద్భుతమైన రాయి ఉంది. పదేళ్ల క్రితమే ఈ రాయిని రామేశ్వరం నుంచి తీసుకొచ్చారని ఆలయ పూజారి చెబుతున్నారు. శివుడ్ని పూజించిన తర్వాత ప్రజలు ఈ రాయిని చూడటానికి వస్తున్నారు. అయోధ్య, రామేశ్వరం వెళ్లలేని వారు కూడా ఈ రాయిని చూడడానికి ఆలయాన్ని సందర్శిస్తున్నారని ఆలయ పూజారి చెప్పారు.
" ఈ అద్భుతమైన రాయి రామాయణం కాలం నాటిది. ఈ రాయిని పదేళ్ల క్రితమే రామేశ్వరం నుంచి తీసుకొచ్చారు. ఈ తేలియాడే రాయి వల్ల ఆలయంలో ఆకర్షణీయంగా మారింది. ఈ రాయిని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారు. గతంలో బిహార్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చేవారు. ఇప్పుడు నేపాల్, బంగాల్ నుంచి ప్రజలు వస్తున్నారు. అయోధ్య, రామేశ్వరం వెళ్లలేని వారు కూడా ఈ రాయిని చూస్తే చాలు ఆ రాముడిని చూసిన్నట్లుగా భావిస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు అందరూ ఈ రాయి రామాయణ కాలంలో సముద్రంపై నిర్మించిన రాయి అని భావిస్తున్నారు. ఈ రామసేతు శిల చూసిన తర్వాత శ్రీరాముడే ప్రత్యక్షంగా ఉన్నట్లు అనిపిస్తోంది."
-మహంత్ వినయ్ పాఠక్, ఆలయ ప్రధాన పూజారి