తెలంగాణ

telangana

ETV Bharat / bharat

2029లో జమిలి ఎన్నికలు! రాజ్యాంగంలో కొత్త చాప్టర్​ చేర్చేందుకు లా కమిషన్ సిఫార్సులు! - 2029లో జమిలి ఎన్నికలు

Simultaneous Polls In India: 2029లో జమిలి ఎన్నికల నిర్వహణకు లా కమిషన్‌ సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం రాజ్యాంగంలో కొత్త అధ్యాయాన్ని చేర్చనున్నట్లు సమాచారం. జమిలి ఎన్నికలు, ఉమ్మడి ఎన్నికల జాబితా వంటి అంశాలు లా కమిషన్‌ సిఫార్సుల్లో ఉండే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Simultaneous Polls In India
Simultaneous Polls In India

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 9:21 PM IST

Updated : Feb 28, 2024, 9:53 PM IST

Simultaneous Polls In India :జమిలి ఎన్నికలను 2029 మే-జూన్ మధ్యలో జరిపేందుకు కేంద్రం వేగంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం రాజ్యాంగంలో కొత్త చాప్టర్‌ను చేర్చేందుకు లా కమిషన్‌ ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జమిలి ఎన్నికలపై కొంతకాలంగా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశంపై అధ్యయనం చేసేందుకు ఇటీవల కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో 'ఒకే దేశం- ఒకే ఎన్నిక'పై కమిటీని కూడా వేసింది. ఈ నేపథ్యంలోనే జమిలి నిర్వహణపై లా కమిషన్‌ త్వరలోనే కేంద్రానికి కీలక ప్రతిపాదనలు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

రాజ్యాంగంలో కొత్తగా చేర్చే చాప్టర్‌లో జమిలి ఎన్నికలు, వాటి సుస్థిరత, లోక్‌సభ, అసెంబ్లీ, పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలకు సరిపోయేలా ఉమ్మడి ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలు ఉండాలని లా కమిషన్‌ సూచించినట్లు సమాచారం. అసెంబ్లీలకు సంబంధించి రాజ్యాంగంలో ఉన్న నిబంధనలను భర్తీ చేసేలా కొత్త చాప్టర్‌ను రూపొందించాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఐదేళ్లలో జమిలి ఎన్నికలకు వీలుగా రాష్ట్రాల అసెంబ్లీ గడువులను మూడు దశల్లో సర్దుబాటు చేయాలని సూచించినట్లు సమాచారం. ఒకవేళ అవిశ్వాసంతో ప్రభుత్వాలు కూలినా, హంగ్‌ ప్రభుత్వాలు ఉన్నా అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఐక్య ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేలా ప్రతిపాదన ఈ పద్ధతి అమలు కానీ పక్షంలో మిగతా కాలానికి ఎన్నికలు జరపాలని లా కమిషన్‌ సిఫార్సులు చేయనున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి.

15 ఏళ్లకు రూ.10 వేల కోట్ల ఖర్చు-జమిలి ఎన్నికలపై ఈసీ అంచనా
జమిలి ఎన్నికలకు వెళ్తే ప్రతి 15 ఏళ్లకోసారి కొత్త ఈవీఎంలు కొనుగోలు చేయాల్సి వస్తుందని, అందుకు రూ.10వేల కోట్ల చొప్పున ఖర్చు అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే అంచనా వేసింది. జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర న్యాయశాఖ, ఈసీకి ప్రశ్నావళిని పంపింది. దానికి ఈసీ ఇటీవల సమాధానం తెలియజేసింది. పూర్తి వార్తను చదివేందుకు ఈ లింక్​పై క్లిక్ చేయండి.

కోవింద్​ కమిటీ చేతికి జమిలి ఎన్నికల 'రోడ్​మ్యాప్'! లా కమిషన్ స్పెషల్ ఫార్ములా!​

ఒకే దేశం ఒకే ఎన్నిక- మరోసారి హైలెవల్​ కమిటీ భేటీ- కోవింద్ స్పెషల్ రివ్యూ!

Last Updated : Feb 28, 2024, 9:53 PM IST

ABOUT THE AUTHOR

...view details