How to Find Car Wheel Alignment Problems : ప్రస్తుత రోజుల్లో వివిధ రవాణా అవసరాల రీత్యా ఎక్కువ మంది కారును కొంటున్నారు. లక్షలు పోసి కొన్న కారును సరిగ్గా మెయింటెనెన్స్ చేయడం చాలా ముఖ్యం. ఇకపోతే చాలా మంది ఇంజిన్, ఇంటీరియర్, ఫ్యూయల్ సేవింగ్పై తీసుకునే శ్రద్ధ వీల్ అలైన్‌మెంట్ గురించి తీసుకోరు. అంటే వాహనం చక్రాల అమరిక విషయంలో కాస్త నిర్లక్ష్యంగా ఉంటారు. కాగా, కారుకి స్టీరింగ్ ఎంత ముఖ్యమో వీల్ అలైన్‌మెంట్ కూడా అంతే కీలకం. ఇది కారును అదుపులో ఉంచడంతో పాటు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తుంది. కాబట్టి కారు వీల్ అలైన్‌మెంట్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. అయితే ఇంతకీ కారుకు వీల్ అలైన్‌మెంట్ ఎప్పుడు అవసరం? తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
సాధారణంగా మనం మంచి రోడ్లపై ప్రయాణించినప్పుడు వీల్ అలైన్‌మెంట్ పెద్ద సమస్య కాకపోయినప్పటికీ, గుంతల పడిన రోడ్ల మీద వెళ్లేటప్పుడు ఇది పెను సవాలుగా మారుతుంది. ఇక ఈ సమస్య ఉన్న కార్లలో దాని పనితీరు, మైలేజ్, డ్రైవింగ్ విధానాలపై ఎక్కువ ఎఫెక్ట్ చూపుతుంది. అలాగే మీరు వాహనంలో భారీ వస్తువులను తీసుకెళ్లేటప్పుడు లేదా ఎత్తైన మలుపులు తిరిగేటప్పుడు వీల్ అలైన్‌మెంట్ మారే అవకాశం ఉంటుంది. అదే విధంగా కొన్నిసార్లు కార్లను వేగంగా నడపడం, వేగంగా మలుపు తిప్పడం లేదా వాహనాలకు జరిగే ప్రమాదాలు వంటి కారణాల వల్ల కూడా వీల్ అలైన్‌మెంట్ ఏర్పడుతుంది. అయితే ఇది వాహనం రకాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఎప్పటికప్పుడు కారు వీల్ అలైన్‌మెంట్ చెక్ చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.
ఇక వీల్ అలైన్‌మెంట్ సమస్యను ఎలా గుర్తించాలంటే..
వైబ్రేట్ అవ్వడం : వీల్ అలైన్‌మెంట్ మారిన తర్వాత మీ కారులో వచ్చే మొదటి సంకేతం వాహనం చాలా వరకూ వైబ్రేట్ అవుతుండటం. వాహనం నడుపుతున్నప్పుడు వచ్చే వైబ్రేషన్లకు ఈ సమస్య ప్రధాన కారణం కావొచ్చు.