తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సగ్గుబియ్యంతో పసందైన వంటలు - టేస్ట్​ సూపర్​! తింటే వదిలిపెట్టరు! - Saggubiyyam Dosa

Sabudana Recipes: తెలుగువారి ఇళ్లల్లో సగ్గుబియ్యానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎండాకాలం వచ్చిదంటే చాలు చల్లదనం కోసం సగ్గుబియ్యంతో చేసిన జావను తాగుతారు. అలాగే వడియాలు, పాయసం, కిచిడి ఇలా ఎన్నో రకాల వంటలు చేసుకుంటారు. అయితే కేవలం ఇవి మాత్రమే కాదు దోశలు, వడలు కూడా చేసుకోవచ్చు. మరి వాటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

Sabudana Recipes
Sabudana Recipes

By ETV Bharat Telugu Team

Published : Feb 15, 2024, 3:35 PM IST

Sabudana Recipes: సగ్గుబియ్యంతో వివిధ రకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా వీటిని కిచిడీ, పాయసం, సహా ఇతర వంటకాల్లో ఉపయోగిస్తారు. అంతేకాకుండా పిండివంటల్లో కూడా విరివిరిగా వాడతారు. అయితే కేవలం ఇవి మాత్రమే కాదు దోశలు, వడలు కూడా చేసుకోవచ్చు. ఇవి తయారు చేయడం కూడా ఈజీ. అంతేకాకుండా సగ్గుబియ్యంలో చాలా పోషకాలు దాగున్నాయి. మరి ఈ వంటలకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

సగ్గుబియ్యం వడ:

కావలసిన పదార్థాలు:

  • సగ్గుబియ్యం - ఒకటిన్నర కప్పు
  • బంగాళదుంపలు - రెండు
  • పంచదార - అర టీస్పూన్‌
  • పల్లీలు - ముప్పావు కప్పు
  • పచ్చిమిర్చి - మూడు(సన్నగా తురుముకోవాలి)
  • కొత్తిమీర- ఒక కట్ట(సన్నగా తురుముకోవాలి)
  • నిమ్మరసం - అర టేబుల్‌స్పూన్‌
  • ఉప్పు - రుచికి తగినంత
  • నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా.

తయారీ విధానం:

  • ముందుగా సగ్గుబియ్యాన్ని కడిగి పావు కప్పు నీళ్లు పోసి మూత పెట్టి రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు బంగాళదుంపలను ఉడికించుకుని పొట్టు తీసి మెత్తగా చేసుకుని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. పల్లీలు వేయించి పొడి చేసుకోవాలి.
  • ఇప్పుడు బంగాళదుంప మిశ్రమంలో సగ్గుబియ్యం, పల్లీల పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం, పంచదార, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి.
  • ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ వడలుగా ఒత్తుకోవాలి.
  • తరువాత కొద్దిసేపు వాటిని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​పై కడాయి పెట్టి నూనె పోసి వేడి అయ్యాక వడలు వేసి వేయించాలి.
  • ఏదైనా చట్నీతో వేడివేడిగా సర్వ్‌ చేసుకుంటే సూపర్​ టేస్టీగా ఉంటాయి.

క్రిస్పీ పొటాటో లాలీపాప్స్​- ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తినడం పక్కా!

సగ్గుబియ్యం దోశలు:

కావలసిన పదార్థాలు:

  • సగ్గుబియ్యం - ఒక కప్పు
  • బొంబాయి రవ్వ - అరకప్పు
  • పెరుగు - మూడు టీస్పూన్లు
  • ఉల్లిపాయ - ఒకటి
  • కొత్తిమీర - ఒకకట్ట
  • ఉప్పు - తగినంత
  • జీలకర్ర - అర టీస్పూన్‌
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • పచ్చిమిర్చి - నాలుగు.

తయారీ విధానం:

  • ముందుగా సగ్గుబియ్యాన్ని కడిగి గంటన్నర పాటు నానబెట్టుకోవాలి.
  • తరువాత మిక్సీలో వేసి మెత్తగా పట్టుకుని ఓ బౌల్‌లోకి తీసుకోవాలి.
  • తరువాత అందులో బొంబాయి రవ్వ, పెరుగు వేసి బాగా కలపాలి.
  • కొద్దిగా నీళ్లు వేసి చిక్కటి పిండిలా కలుపుకుని.. పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఆ మిశ్రమంలో జీలకర్ర, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
  • మిశ్రమం మరీ పలుచగా, మరీ చిక్కగా కాకుండా చూసుకోవాలి.
  • స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి, పాన్‌ అంతటా రాసి మిశ్రమాన్ని దోశలా పోసుకోవాలి.
  • చిన్నమంటపై రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి.
  • బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఈ దోశలు సర్వ్‌ చేసుకోవచ్చు. పల్నీ లేదా కొబ్బరి చట్నీతో సూపర్​గా ఉంటాయి.

ఇక సగ్గుబియ్యం పోషకాలు చూస్తే ఇందులో ప్రొటీన్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీనితో పాటు క్యాలరీల పరిమాణం కూడా చాలా తక్కువ. ఇవి ఎముకలను బలోపేతం చేయడంతో పాటు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.

స్నాక్స్​లో ఆయిల్ ఫుడ్ వద్దు - ఇవి తింటే అదుర్స్ - రుచికి రుచీ ఆరోగ్యానికి ఆరోగ్యం!

వహ్వా అనిపించే "బటర్​ గార్లిక్​ పొటాటో" - తిని తీరాల్సిందే!

మఖానా ఖీర్ - టేస్ట్‌ అదుర్స్‌ అంతే!!

ABOUT THE AUTHOR

...view details