తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పట్టాలు తప్పిన సబర్మతీ ప్యాసింజర్ ఎక్స్​ప్రెస్ 22 బోగీలు​- ఏడు రైళ్లు రద్దు - kanpur Train Accident

Kanpur Train Accident : ఉత్తర్​ప్రదేశ్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. మొత్తం 22 బోగీలు పట్టాలు తప్పాయి. కాన్పుర్‌- భీమ్‌సేన్‌ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది.

kanpur Train Accident
kanpur Train Accident (ANI)

By ETV Bharat Telugu Team

Published : Aug 17, 2024, 7:44 AM IST

Updated : Aug 17, 2024, 9:15 AM IST

Kanpur Train Accident :ఉత్తర్​ప్రదేశ్‌లోని కాన్పుర్‌ - భీమ్‌సేన్‌ రైల్వే స్టేషన్​ పరిధిలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. మొత్తం 22 బోగీలు పట్టాలు తప్పాయి. శనివారం తెల్లవారుజామున 2:30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. రైలు వారణాసి నుంచి అహ్మదాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రట్టాలపై పెట్టిన ఓ వస్తువును రైలు ఇంజిన్​ ఢీకొట్టడమే ఈ ప్రమాదానికి కారణం అని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇంజిన్ ముందు భాగం దెబ్బతిందని, రైలు పట్టాలు తప్పడం వల్ల ఏడు రైళ్లను రద్దు చేశారు. మరో మూడు రైళ్లను దారి మళ్లించారు.

ప్రమాద ఘటనపై పోలీసులు, ఐబీ సంయుక్తంగా దర్యాప్తు చేపట్టాయి. ఇంజిన్‌ ఢీకొన్న వస్తువు అధికారులు భద్రపరిచారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. మరోవైపు రైల్వేశాఖ ప్రత్యేక చర్యలు తీసుకొని ప్రయాణికులందరినీ మరో రైలులో గమ్యస్థానాలకు చేర్చింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు.ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు.

అయితే, రైలు ప్రమాదంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో అంటూ ఆందోళనతో రైలు నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ప్రయాణికులంతా తమ సామాన్లతో రైలు పట్టాల వద్దే కూర్చున్నారు. ఈ నేపథ్యంలో సమీప ప్రాంతాల ప్రయాణికుల కోసం అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.

"ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి కాన్పుర్ రైల్వే స్టేషన్‌కు ప్రయాణికులను తీసుకెళ్లేందుకు బస్సులను ఏర్పాటు చేశాం. రైలు ప్రయాణికులను తరలించడానికి కాన్పూర్ నుంచి ప్రమాద స్థలానికి ఎనిమిది కోచ్‌ల MEMU రైలు బయలుదేరింది" అని నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శశి కాంత్ త్రిపాఠి పేర్కొన్నారు.

హెల్ప్‌లైన్ నంబర్‌లను విడుదల చేసిన రైల్వే :ప్రయాగ్‌రాజ్: 0532-2408128, 0532-2407353, కాన్పుర్: 0512-2323018, మీర్జాపుర్: 054422200090, 7295 59702, అహ్మదాబాద్: 07922113977, బనారస్ సిటీ: 8303994411 , గోరఖ్‌పుర్: 0551-2208088.

ఝాన్సీ రైల్ డివిజన్ హెల్ప్‌లైన్ నంబర్‌లు : ఝాన్సీ రైల్ డివిజన్ -0510-2440787, 0510-2440790. ఒరై -05162-252206, బందా-05192-227543, లలిత్‌పుర్ జంక్షన్ - 07897992404.

గౌడవెల్లి వద్ద రైలు ప్రమాదం- ఇద్దరు కుమార్తెలు సహా తండ్రి మృతి - Three People Died Hit by Train

మస్కిటో టెర్మినేటర్‌ ఆన్ వీల్స్​! దోమల నివారణకు స్పెషల్ ట్రైన్​ స్టార్ట్​ - Special Train For Mosquitos

Last Updated : Aug 17, 2024, 9:15 AM IST

ABOUT THE AUTHOR

...view details