PM Relief Fund Donation To Ayodhya :ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళం అందేలా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు రూ.2,100 కోట్ల చెక్కు రావడం చర్చనీయాంశమైంది. ఈ చెక్కును పంపిన వ్యక్తి దానిపై తన పేరు, మొబైల్ నంబర్, అడ్రస్‌ను రాశారు. కానీ చెక్కును ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ పేరు మీద ట్రస్ట్‌కు పోస్టు ద్వారా పంపించారు. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. రెండు రోజుల క్రితమే ఈ చెక్కు తమ కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు. అయితే ఆ చెక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని, ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపించాల్సిందిగా ట్రస్టు అధికారులను ఆదేశించినట్లు చంపత్ రాయ్ చెప్పారు.
ఎఫ్‌డీల్లో రూ.2,600 కోట్లు
ప్రస్తుతం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేరిట బ్యాంకు ఖాతాలో 2600 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ ఉందని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. రామ మందిరం మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అందులో తెల్లని పాలరాతితో రామయ్య విగ్రహాన్ని ఉంచనున్నట్లు వెల్లడించారు. "టైటానియంతో శ్రీరామ దర్బార్ నిర్మిస్తాం. ఇది భద్రతాపరంగా బాగుంటుంది. ఎప్పటికీ దెబ్బతినదు. రామ్ దర్బార్‌లో రామయ్య, జానకి, లక్ష్మణుడు, భరతుడు, శత్రుజ్ఞుడు, హనుమాన్ విగ్రహాలు కూర్చున్నట్లు ఉంటాయి. అవి శుక్రవారం ట్రస్ట్‌కు చేరాయి." అని చంపత్ రాయ్ వెల్లడించారు.