Road Accident In Maharashtra : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బస్సు ఢీకొని ఐదుగురు మృతి చెందారు. మరో 11మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన బీజాపుర్ గుహాగర్ జాతీయ రహదారిపై జాంబుల్వాడి ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఘటన తర్వాత స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
కర్ణాటక బాగల్‌కోట్‌లోని జమఖండికి చెందిన కొంతమంది రెండు కార్లలో మహారాష్ట్రలోని సాంగలీ గ్రామంలో జరుగుతున్న పెళ్లికి బయలుదేరారు. బుధవారం సాయంత్రం జాంబుల్వాడి ప్రాంతంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం కావటం వల్ల మృతదేహాలను బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది ఇబ్బంది పడ్డారు.
డివైడర్‌ను ఢీకొట్టిన కారు - ఇద్దురు చిన్నారులతో సహా నలుగురు మృతి
Car Accident In Uttar Pradesh : ఉత్తర్‌ప్రదేశ్ ఎటా జిల్లాలోని అలీగఢ్, కాన్పుర్ హైవేపై ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. గురవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు మృతి చెందారు. మరో 5మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.