తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కోల్​కతా ట్రావెల్​ ఫెయిర్​లో రామోజీ ఫిల్మ్​ సిటీ అదుర్స్​- బెస్ట్ డెకరేషన్ అవార్డు సొంతం - ramoji film city award

Ramoji Film City Award : కోల్​కతాలో జరిగిన ట్రావెల్​ అండ్ టూరిజం ఫెయిర్​లో హైదరాబాద్​లోని ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్​ సిటీ బెస్ట్ డెకరేషన్ అవార్డును అందుకుంది. భవిష్యత్తులో రామోజీ ఫిల్మ్ సిటీలో ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్​ను నిర్వహించే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజర్ షోవన్ మిశ్రా వెల్లడించారు.

ramoji film city award
ramoji film city award (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 15, 2024, 10:30 AM IST

Ramoji Film City Award : బంగాల్​ రాజధాని కోల్​కతాలో ట్రావెల్​ అండ్​ టూరిజం నిర్వహించిన ఫెయిర్​లో రామోజీ ఫిల్మ్ సిటీకి బెస్ట్ డెకరేషన్ అవార్డు లభించింది. టూరిజం ఫెయిర్​లో ఆర్ఎఫ్​సీ ఏర్పాటు చేసిన డెకరేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిస్వా బంగ్లా మేళా ప్రాంగణంలో మూడు రోజులపాటు జరిగిన ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్​కు భారీగా సందర్శకులు హాజరయ్యారు. కశ్మీర్, సిక్కిం, లతాగుడితో సహా పలు రాష్ట్రాలు సందర్శకులకు తమ ప్రాంతంలోని ముఖ్య పర్యాటక ప్రదేశాల గురించి స్టాల్స్ వివరించాయి. అలాగే ఈ ఫెయిర్​కు వచ్చినవారు తమ తదుపరి హాలీడే ట్రిప్ కోసం అవసరమైన సమాచారాన్ని తెలుసుకున్నారు.

కోల్​కతా ట్రావెల్​ ఫెయిర్​లో అదరగొట్టిన రామోజీ ఫిల్మ్​ సిటీ (ETV Bharat)

ట్రావెల్​ అండ్​ టూరిజం ఫెయిర్​లో హైదరాబాద్​కు చెందిన రామోజీ ఫిల్మ్ సిటీకి బెస్ట్ డెకరేషన్ అవార్డు లభించడంపై ఆ సంస్థ జనరల్ మేనేజర్ షోవన్ మిశ్రా, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ టీఆర్ఎల్ రావు సంతోషం వ్యక్తం చేశారు. వీరిద్దరికీ రామోజీ ఫిల్మ్ సిటీ బెస్ట్ డెకరేషన్ అవార్డును ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ చైర్మన్ , సీఈఓ సంజీవ్ అగర్వాల్ అవార్డును అందించారు.

10వేల మంది హాజరు
మూడు రోజులపాటు కోల్​కతాలో జరిగిన ట్రావెల్​ అండ్​ టూరిజం నిర్వహించిన ఫెయిర్​కు 10,000 మంది హాజరయ్యారని రామోజీ ఫిల్మ్ సిటీ జనరల్ మేనేజర్ షోవన్ మిశ్రా తెలిపారు. ట్రావెల్​ అండ్​ టూరిజం ఫెయిర్ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రామోజీ ఫిల్మ్ సిటీలో ట్రావెల్​ అండ్​ టూరిజం ఫెయిర్ నిర్వహించే అవకాశాన్ని కూడా మిశ్రా ప్రస్తావించారు. "ట్రావెల్​ అండ్​ టూరిజం ఫెయిర్​ను రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించే అవకాశం ఉంది. ట్రావెల్​ అండ్​ టూరిజం ఫెయిర్​కు మంచి స్పందన వచ్చింది. బెంగాలీలకు సెలవు దొరికినప్పుడు ప్రయాణం చేయడమంటే చాలా ఇష్టం. మరికొన్ని నెలల్లో దుర్గా పూజ ఉంటుంది. అందుకే ప్రయాణాలకు ఇప్పుడే ప్లాన్ చేసుకుంటున్నారు. హాలీడే ట్రిప్​నకు వెళ్లాలనుకునేవారు ఈ ఫెయిర్​కు వచ్చి వివిధ స్టాల్స్​ను సందర్శించారు. వివిధ పర్యటక ప్రదేశాల గురించి అడిగి తెలుసుకున్నారు" అని రామోజీ ఫిల్మ్ సిటీ జనరల్ మేనేజర్ షోవన్ మిశ్రా పేర్కొన్నారు.

ఈ ఫెయిర్​కు ఉత్తర్​ప్రదేశ్, ఉత్తరాఖండ్, కశ్మీర్, ఒడిశా, నేపాల్, అసోం, తెలంగాణ, బంగాల్, బంగ్లాదేశ్, బెంగళూరు, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బిహార్ వంటి రాష్ట్రాలు, థాయిలాండ్, శ్రీలంక దేశాల నుంచి సందర్శకులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, సిక్కిం, త్రిపురకు చెందిన రాష్ట్ర టూరిజం శాఖలకు చెందిన ప్రతినిధులు ప్రత్యేకంగా ఆయా రాష్ట్రాలకు చెందిన స్టాల్స్​ను ఏర్పాటు చేశారు. మూడు రోజుల ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ చివరి రోజు(ఆదివారం) ఆసక్తికరమైన కార్యక్రమంతో ముగిసింది. ఇందులో పాల్గొన్న సందర్శకులు చిరస్మరణీయ అనుభవాన్ని పొందారు. చాలా మంది హాలీడే ట్రిప్​ను ప్లాన్ చేసుకునేందుకు ఈ ఫెయిర్​కు తరలివచ్చారు. అటువంటి వారికి ఈ ఫెయిర్ బాగా ఉపయోగపడింది.

ABOUT THE AUTHOR

...view details