తెలంగాణ

telangana

ETV Bharat / bharat

400 జీవాలను కాపాడిన శివంగి- వన్​దుర్గా అవార్డు సొంతం- అడవిలో జంతువులకు బాసటగా మహిళా ఫారెస్ట్ ఆఫీసర్

Prem Kanwar Shaktawat Woman Forest Officer : అడవిలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని విధులు నిర్వహిస్తున్నారు ఓ మహిళా ఫారెస్ట్ ఆఫీసర్​. దాదాపు 400 రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించి అటవీ జంతువులను కాపాడారు. అటవీ రంగంలో శివంగిలా దూసుకెళ్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె చేసిన సేవలు ఏంటనేది? ఈ స్టోరీలో తెలుసుకుందాం.

By ETV Bharat Telugu Team

Published : Mar 8, 2024, 6:24 AM IST

Updated : Mar 8, 2024, 8:23 AM IST

Prem Kanwar Shaktawat Woman Forest Officer
Prem Kanwar Shaktawat Woman Forest Officer

Prem Kanwar Shaktawat Woman Forest Officer :పురుషుల కంటే తాము ఏ రంగంలోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు మహిళలు. ఎన్ని కష్టాలనైనా ఓర్చి ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు. అయితే మధ్యప్రదేశ్​కు చెందిన ఓ మహిళ అటవీ శాఖలో సత్తా చాటుతున్నారు. సుమారు 400 జీవాలను కాపాడి విధుల్లో శివంగిలా దూసుకెళ్తున్నారు. మరెందుకు ఆలస్యం అంతర్జాతీయ మహిళా దినోత్సవం(మార్చి 8) సందర్భంగా ఆ ఫారెస్ట్ ఆఫీసర్​ గురించి తెలుసుకుందాం.

మధ్యప్రదేశ్​లోని నీమచ్​ జిల్లాకు చెందిన ప్రేమ్ కంవర్ శక్తావత్ 2011లో ఫారెస్ట్​ గార్డుగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ఆమె భైన్‌రోద్‌గర్ వన్యప్రాణుల అభయారణ్యంలో విధులు నిర్వర్తించారు. ఈ తర్వాత అభేద బయోలాజికల్ పార్కులో ఉద్యోగం చేశారు. 2020లో పదోన్నతి పొంది ప్రస్తుతం ఆమె రాజస్థాన్​ కోటాలోని ముకుందరా హిల్స్ టైగర్ రిజర్వ్​లోని కోలిపురా ప్రాంతంలో అసిస్టెంట్ ఫారెస్ట్ ఆఫీసర్​గా పనిచేస్తున్నారు. దట్టమైన, ప్రమాదకరమైన ముకుందరా హిల్స్​ టైగర్ రిజర్వ్​ ప్రాంతంలో పనిచేయడమంటే కత్తిమీద సామే అని చెప్పాలి. అయినా ఆమె ఏనాడు ధైర్యాన్ని కోల్పోలేదు. ఈ 13 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ప్రేమ్ కంవర్​ పాంథర్, మొసలి, జింకలు, లేడులను కాపాడారు. 400 కంటే ఎక్కువ రెస్క్యూ ఆపరేషన్​లు నిర్వహించారు. అలాగే విషపూరితమైన, ప్రమాదకరమైన పాములు, 15 అడుగల పొడవున్న మొసళ్లు, కొండచిలువలను రక్షించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో జంతు సంరక్షణకు సంబంధించి అవగాహన శిబిరాలు ఏర్పాటు చేశారు.

మొసలి రెస్క్యూ ఆపరేషన్​లో ప్రేమ్ కంవర్ శక్తావత్(పాత ఫొటో)

వన్​దుర్గా అవార్డు సొంతం
ప్రేమ్ కంవర్ శక్తావత్ భైన్‌రోద్‌గర్ అభయారణ్యంలో పనిచేసినప్పుడు పక్షులు, అటవీ జంతువుల పాదముద్రలపై ఒక నివేదిక తయారుచేశారు. ఈ క్రమంలో ఆమెకు వైల్డ్‌ వరల్డ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) నుంచి వైల్డ్‌లైఫ్ ఫ్రెండ్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డుతో పాటు ఆమెకు రూ.2 లక్షలు ప్రోత్సాహకం కూడా WWF ఇచ్చింది. వన్యప్రాణుల సంరక్షణ, పర్యవేక్షణకు సంబంధించి ఏషియన్ రేంజర్ ఫోరమ్ గువహాటిలో నిర్వహించిన కార్యక్రమంలో 'వన్​దుర్గా' అవార్డును సైతం సొంతం చేసుకున్నారు ప్రేమ్ కంవర్ శక్తావత్. ఆమెకు ఈ అవార్డును మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ అందించారు.

ప్రేమ్ కంవర్ శక్తావత్ వన్ దుర్గా అవార్డు

'మహిళలు ఏ విషయంలోనూ తక్కువకాదు. నేను పురుషుల కంటే మహిళలే చాలా శక్తివంతులని భావిస్తాను. వన్యప్రాణుల రక్షణ లేదా పెట్రోలింగ్ ఏదైనా నేను దేనికీ భయపడను. అడవులు, వన్యప్రాణులను రక్షించడం నా బాధ్యత. అందుకే జీతం తీసుకుంటున్నా. నేపాల్‌లో ప్రపంచ రేంజర్ సదస్సు కొన్నాళ్ల క్రితం జరిగింది. ప్రపంచ రేంజర్ సదస్సు ఆసియాలో నిర్వహించడం అదే మొదటిసారి. 2011 నుంచి నేను సాధించిన విజయాల కారణంగా నన్ను ఆ సదస్సుకు ఆహ్వానించారు. ఆ సదస్సులో ప్రపంచ దేశాలకు చెందిన 500మంది రేంజర్స్‌తో నా పని అనుభవాన్ని పంచుకోగలిగాను. అటవీ ప్రాంతాల్లో విధుల నిర్వహిస్తున్నప్పుడు మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి చర్చించుకున్నాం. ఏప్రిల్​ 15నుంచి 19వరకు జరిగే క్రొకొడైల్​ కాన్ఫరెన్స్​కు ఆహ్వానం అందింది. ప్రపంచంలోని ప్రముఖ రేంజర్‌లను ఆ కాన్ఫరెన్స్​కు ఆహ్వానించారు. భారత్ నుంచి నాకు ఆహ్వానం అందింది. నేను వీసా కోసం దరఖాస్తు చేస్తున్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే అక్కడికి వెళ్తాను.' అని ప్రేమ్ కంవర్ శక్తావత్ తెలిపారు.

ప్రేమ్ కంవర్ శక్తావత్

జంతువులపై అంబానీల ప్రేమ- 3 వేల ఎకరాల్లో 'వన్​తారా' అడవి సృష్టించిన రిలయన్స్ ఫౌండేషన్

మహిళా కాటికాపరి- 14 ఏళ్లలో 40వేలకుపైగా మృతదేహాలు దహనం- ఎక్కడో తెలుసా?

Last Updated : Mar 8, 2024, 8:23 AM IST

ABOUT THE AUTHOR

...view details