PM Modi Pays Tribute To Gandhi :జాతి పిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా దిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్ముడికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. సత్యం, సామరస్యం, సమానత్వంపై ఆధారపడిన ఆయన జీవితం, ఆదర్శాలు ఎల్లప్పుడూ దేశ ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తాయని మోదీ అన్నారు.
జై జవాన్, జై కిసాన్
తరువాత స్వతంత్ర భారత రెండో ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనకు విజయ్‌ఘాట్‌లో నివాళులు అర్పించారు ప్రధాని మోదీ. లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన జై జవాన్, జై కిసాన్ నినాదం భావి తరాలకు కూడా ప్రేరణగా నిలుస్తుందని ఆయన అన్నారు. దేశ స్వాభిమానం కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.
రాహుల్ గాంధీ నివాళులు
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా గాంధీ మహాత్మునికి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి ఘనంగా నివాళులు అర్పించారు.
ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్‌జీ సక్సేనా, దిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ, సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా గాంధీజీకి, లాల్ బహదూర్ శాస్త్రికి ఘనంగా నివాళులు అర్పించి, ఆయన సేవలను స్మరించుకున్నారు.