తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ VS రాహుల్- లోక్​సభలో వాడివేడి చర్చ- ప్రతిపక్ష నేత కామెంట్స్​ ప్రధాని అభ్యంతరం - parliament SESSIONS 2024 - PARLIAMENT SESSIONS 2024

Parliament Sessions Live Updates
Parliament Sessions Live Updates (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jul 1, 2024, 10:33 AM IST

Updated : Jul 1, 2024, 4:40 PM IST

Parliament Sessions Live Updates: రెండు రోజుల విరామం తర్వాత సోమవారం పార్లమెంట్ సమావేశాల తిరిగి ప్రారంభం అయ్యాయి. లోక్​సభలో కేంద్ర మాజీ మంత్రి అనురాగ్​ ఠాకుర్​, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. సభలో ఈ తీర్మానంపై చర్చించేదుందుకు లోక్​సభ 16 గటంల సమయాన్ని కేటాయించింది. కానీ, నీట్‌ ప్రశ్నపత్రాల లీకేజీ, నిరుద్యోగం, అగ్నిపథ్, ద్రవ్యోల్బణం వంటి అంశాలు సోమవారం పార్లమెంటులో దుమారం రేకెత్తించే అవకాశాలున్నాయి. సభలు పునఃప్రారంభం కాగానే విపక్షాలు దీనిపై ఆందోళన వినిపించేందుకు సన్నద్ధంగా ఉండగా, లోక్​సభ ప్రతిపక్ష నేతగా రాహుల్​గాంధీ కూడా ఈ అంశాలపై మాట్లాడనున్నారు.

LIVE FEED

4:36 PM, 1 Jul 2024 (IST)

ఆర్టికల్‌ 370 తొలగించడం మంచిదే అని బీజేపీ అంటుంది: మహువా

ఆర్టికల్‌ 370 తొలగించడం మంచిదే అయితే కశ్మీర్‌లో బీజేపీ ఎందుకు పోటీ చేయలేదు

అనంత్‌నాగ్‌, బారాముల్లా, శ్రీనగర్‌లో బీజేపీ ఎందుకు పోటీ చేయలేదు

కొత్తగా నిర్మించిన విమానాశ్రయాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి

రాజ్‌కోట్‌, జబల్‌పూర్‌, దిల్లీ విమానాశ్రయాల్లో ప్రమాదాలు జరిగాయి

4:09 PM, 1 Jul 2024 (IST)

మా ప్రాంతంలో మోదీ రెండుసార్లు ఎన్నికల ప్రచారం చేశారు: మహువా మొయిత్రా

గతంలో నన్ను సభలో మాట్లాడనివ్వలేదు: మహువా మొయిత్రా

నన్ను సభ నుంచి పంపించేందుకు గతంలో మీరంతా ఏకమయ్యారు: మహువా

ఈ ప్రభుత్వం బలంగా లేదు.. గతం కంటే సీట్లు తగ్గాయి..: మహువా

మీరు గతంలా పనిచేస్తామంటే కుదరదు: మహువా మొయిత్రా

ఇతర పార్టీల సాయంతో మీరు ప్రభుత్వం ఏర్పాటు చేశారు: మహువా మొయిత్రా

ఎన్నికల ప్రచారంలో మణిపూర్‌ గురించి ఎందుకు మాట్లాడలేదు: మహువా

4:09 PM, 1 Jul 2024 (IST)

సభలో స్పీకరే పెద్దవారు.. ఆయన ఎవరిముందు తలవంచకూడదు: రాహుల్‌

స్పీకర్‌ ముందు అందరూ తలవంచి నమస్కరించాల్సిందే: రాహుల్‌

సత్యం, అహింస, ధైర్యం.. అనేవి మా జాతి నినాదాలు..: రాహుల్‌

రైతులు, విద్యార్థుల సమస్యపై ప్రస్తావించినప్పుడు అవకాశం ఇవ్వాలి: రాహుల్‌

మనం శత్రువులం కాదు.. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే ఇక్కడ ఉన్నాం: రాహుల్‌

3:57 PM, 1 Jul 2024 (IST)

ప్రధాని.. సభానాయకుడు.. ఆయనకు గౌరవం ఇవ్వాల్సిందే: స్పీకర్‌

పెద్దలను గౌరవించడం మన సంస్కృతిలో భాగం: స్పీకర్‌

సమవయస్కులు, చిన్నవాళ్ల విషయంలో మరోలా ప్రవర్తిస్తాం: స్పీకర్‌

3:57 PM, 1 Jul 2024 (IST)

సభలో స్పీకరే పెద్దవారు.. ఆయన ఎవరిముందు తలవంచకూడదు: రాహుల్‌

స్పీకర్‌ ముందు అందరూ తలవంచి నమస్కరించాల్సిందే: రాహుల్‌

సత్యం, అహింస, ధైర్యం.. అనేవి మా జాతి నినాదాలు..: రాహుల్‌

రైతులు, విద్యార్థుల సమస్యపై ప్రస్తావించినప్పుడు అవకాశం ఇవ్వాలి: రాహుల్‌

మనం శత్రువులం కాదు.. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే ఇక్కడ ఉన్నాం:

రాష్ట్రపతి ప్రసంగంలో నీట్‌, అగ్నివీర్‌ గురించి ప్రస్తావన లేదు: రాహుల్‌

భాజపా హయాంలో సంస్థలు నిర్వీర్యమయ్యాయి: రాహుల్‌

ప్రొఫెషనల్‌ పరీక్ష అయిన నీట్‌ను.. కమర్షియల్‌ ఎగ్జామ్‌గా మార్చారు: రాహుల్‌

నీట్‌ కోసం విద్యార్థులు ఏళ్లపాటు చదువుతారు: రాహుల్‌గాంధీ

పేద విద్యార్థులు నీట్‌పై నమ్మకాన్ని కోల్పోయారు: రాహుల్‌గాంధీ

నీట్.. పేద విద్యార్థుల కోసం కాదు.. ఉన్నతవర్గాల కోసం..: రాహుల్‌

నీట్ పరీక్ష విధానంలో అనేక లోపాలు ఉన్నాయి: రాహుల్‌గాంధీ

సత్యమేవ జయతే అంటారు.. నిజం మాట్లాడితే భయపడతారు..: రాహుల్‌

ప్రజల సమస్యల గురించి మాట్లాడితే ప్రభుత్వం భయపడుతోంది: రాహుల్‌

ప్రతిపక్ష నేతగా ప్రజాసమస్యలను సభలో ప్రస్తావించడం నా బాధ్యత

3:35 PM, 1 Jul 2024 (IST)

రాష్ట్రపతి ప్రసంగంలో నీట్‌, అగ్నివీర్‌ గురించి ప్రస్తావన లేదు: రాహుల్‌

భాజపా హయాంలో సంస్థలు నిర్వీర్యమయ్యాయి: రాహుల్‌

ప్రొఫెషనల్‌ పరీక్ష అయిన నీట్‌ను.. కమర్షియల్‌ ఎగ్జామ్‌గా మార్చారు: రాహుల్‌

రైతులకు ఎంఎస్‌పీ దక్కడం లేదు: రాహుల్‌గాంధీ

రాహుల్‌గాంధీ.. సభను తప్పుదోవ పట్టిస్తున్నారు: శివరాజ్‌సింగ్ చౌహాన్‌

3:25 PM, 1 Jul 2024 (IST)

మీరు తెచ్చిన చట్టాలను రైతులు వ్యతిరేకించారు: రాహుల్‌గాంధీ

మీరు తెచ్చిన చట్టాల వల్ల 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు: రాహుల్‌

మరణించిన రైతులకు సభలో మౌనం కూడా పాటించలేదు: రాహుల్‌

దేవుడితో ప్రత్యక్షంగా మాట్లాడతానని స్వయంగా మోదీ చెప్పారు: రాహుల్‌

నోట్ల రద్దు చేయాలని కూడా దేవుడే చెప్పాడా?: రాహుల్‌

నోట్ల రద్దు వల్ల దేశంలోని యువత ఉపాధి కోల్పోయారు: రాహుల్‌

జీఎస్‌టీ వల్ల వ్యాపారులు, ప్రజలు అనేక బాధలు పడ్డారు: రాహుల్‌

నోట్ల రద్దు, జీఎస్‌టీ వల్ల దేశప్రజలకు కలిగిన లాభం ఏమిటి?: రాహుల్‌

మేం అధికారంలోకి వచ్చాక అగ్నివీర్‌ పథకాన్ని ఎత్తివేస్తాం: రాహుల్‌

భాజపా ప్రభుత్వం.. జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాన్ని ముక్కలు చేసింది: రాహుల్‌

మణిపూర్‌లో మంటలు చెలరేగాయి.. ఇప్పటివరకు ప్రధాని వెళ్లలేదు: రాహుల్‌

మణిపూర్‌.. మనదేశంలో అంతర్భాగం కాదా.. చెప్పాలి..: రాహుల్‌

విపక్ష నేతగా దేశంలోని సమస్యలపై ప్రస్తావిస్తా: రాహుల్‌

మణిపూర్‌లో నా కళ్లముందే పిల్లలపై బుల్లెట్ల వర్షం కురిసింది: రాహుల్‌

మీ పరిపాలన వల్లే మణిపూర్‌లో మంటలు చల్లారలేదు: రాహుల్‌

2:59 PM, 1 Jul 2024 (IST)

అయోధ్యలో భూములు లాక్కుని విమానాశ్రయం నిర్మించారు: రాహుల్‌

చిరు వ్యాపారుల దుకాణాలు, భవనాలు తొలగించి వారిని రోడ్డుపైకి నెట్టారు: రాహుల్‌

అయోధ్య మందిర ప్రారంభ సమయంలో బాధితులు దుఃఖంలో ఉన్నారు: రాహుల్‌

అయోధ్య మందిర ప్రారంభానికి కనీసం ఆలయ పరిసరాల్లోకి రానివ్వలేదు: రాహుల్‌

2:52 PM, 1 Jul 2024 (IST)

రాహుల్ అలా అనడం చాలా తప్పు! : మోదీ
లోక్​సభలో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ మధ్య వాడివేడి చర్చ జరిగింది. రాహుల్​ మాట్లాడుతుండగా మధ్యలో జోక్యం చేసుకున్న ప్రధాని మోదీ, ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. మొత్తం హిందూ సమాజాన్ని హింసాత్మకంగా అభివర్ణించడం తీవ్రమైన సమస్య అని అన్నారు. అనంతరం హోం మంత్రి అమిత్​ షా మాట్లాడుతూ, కోట్ల మంది హిందువులుగా గర్వంగా ఉన్నారని, వాళ్లంతా హింసావాదులను రాహుల్​ భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు రాహుల్​ కచ్చితంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. ​

2:25 PM, 1 Jul 2024 (IST)

  • మేము ప్రతిపక్షంలో ఉన్నామనే విషయం మాకు తెలుసు: రాహుల్‌
  • ప్రతిపక్షంలో ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం: రాహుల్‌ గాంధీ
  • శివుడి ఎడమ చేతి వెనక త్రిశూల్‌ ఉంటుంది: రాహుల్‌గాంధీ
  • త్రిశూల్‌ అనేది హింసకు గుర్తు కాదు: రాహుల్‌గాంధీ
  • హింసకు చిహ్నం కాదు కనుకే శివుడికి వెనకవైపు త్రిశూల్‌ ఉంటుంది: రాహుల్‌
  • హింసకు చిహ్నంగా నిలిస్తే శివుడి కుడిచేతిలోనే ఉండేది: రాహుల్‌గాంధీ
  • చాలా మంది ఒక చిహ్నాన్ని వ్యతిరేకిస్తారు: రాహుల్‌గాంధీ
  • ఆ చిహ్నమే అభయముద్ర అదే కాంగ్రెస్‌ పార్టీ గుర్తు: రాహుల్‌
  • నిజం, హింసను ఎదుర్కోవడానికి అభయముద్ర అవసరం: రాహుల్‌
  • భయం లేకుండా జీవించేందుకు అభయముద్ర అవసరం: రాహుల్

1:11 PM, 1 Jul 2024 (IST)

లోక్​సభను మధ్యాహ్నం 2:10 గంటల వరకు స్పీకర్‌ వాయిదా వేశారు.

12:38 PM, 1 Jul 2024 (IST)

పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో ప్రభుత్వాన్ని పొగడడం తప్ప ఏమీలేదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. మణిపూర్ తగలబడిపోతుంటే ప్రధాని ఒక్కసారి కూడా పర్యటించలేదని మండిపడ్డారు. విపక్షాలు సామాన్యుడి గురించి మాట్లాడితే ప్రధాని మోదీ మాత్రం మన్‌ కీ బాత్‌పైనే దృష్టి పెట్టారని రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పార్లమెంటు కాంప్లెక్స్‌ నుంచి తొలగించిన మహాత్మాగాంధీ, అంబేడ్కర్ వంటి మహనీయుల విగ్రహాలను తిరిగి అక్కడే పెట్టాలని రాజ్యసభ ఛైర్మన్‌కు ఖర్గే విజ్ఞప్తి చేశారు.

12:07 PM, 1 Jul 2024 (IST)

  • నీట్‌ పేపర్‌ లీకేజీపై చర్చించాలని సభలో ప్రస్తావించిన విపక్ష నేత రాహుల్‌గాంధీ
  • వాయిదా తీర్మానం నోటీసు కూడా ఇచ్చినట్లు పేర్కొన్న రాహుల్‌గాంధీ
  • వాయిదా తీర్మానాలను తీసుకోవడం కుదరదని చెప్పిన స్పీకర్‌ ఓంబిర్లా
  • రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు అవకాశం ఉందన్న స్పీకర్‌
  • వాయిదా తీర్మానాలు తీసుకునేందుకు నిబంధనలు అనుమతించవన్న స్పీకర్‌
  • నీట్‌ పేపర్‌ లీకేజీపై విద్యార్థులు ఆందోళనతో ఉన్నారన్న రాహుల్‌గాంధీ
  • విద్యార్థులకు భరోసా కల్పిస్తూ సందేశాన్ని ఇవ్వాల్సి ఉందన్న రాహుల్
  • రాహుల్‌గాంధీ లేవనెత్తిన విషయంపై జోక్యం చేసుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌
  • ప్రస్తుతం మరో విషయంపై చర్చించడానికి నిబంధనలు వర్తించవన్న రాజ్‌నాథ్‌
  • రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం అనంతరం లేవనెత్తవచ్చన్న రాజ్‌నాథ్‌
  • రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత నీట్‌ లీకేజీపై చర్చించాలని కోరిన రాహుల్‌
  • అందుకు సంబంధించిన నోటీసు ఇస్తే బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుందామన్న స్పీకర్‌

11:53 AM, 1 Jul 2024 (IST)

నీట్‌ అంశంపై చర్చించేందుకు స్పీకర్‌ అనుమతించకపోవడం వల్ల ఇండి కూటమి నేతలు లోక్​సభ నుంచి వాకౌట్ చేశారు.

11:50 AM, 1 Jul 2024 (IST)

కేంద్ర మాజీ మంత్రి అనురాగ్​ ఠాకుర్​ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్నిప్రవేశపెట్టి తీర్మానంపై చర్చను ప్రారంభించారు.

11:42 AM, 1 Jul 2024 (IST)

లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీల ఆందోళన

శుక్రవారం రాహుల్‌ గాంధీ మైక్‌ ఆగిపోవడంపై కాంగ్రెస్‌ ఎంపీల ఆందోళన

రాహుల్‌ మాట్లాడేటపుడు మైక్‌ ఆగిపోవడంపై స్పందించిన స్పీకర్‌ ఓం బిర్లా

మైక్‌ నిర్వహణ సభాపతి స్థానంలో ఉన్నవారి చేతిలో ఉండదన్న స్పీకర్‌

కాంగ్రెస్‌ ఎంపీ సురేష్‌ కూడా సభాపతి స్థానంలో కొన్నిసార్లు ఉన్నారన్న స్పీకర్‌

మైక్‌ పనితీరు స్పీకర్‌ చేతిలో ఉంటుందని సురేష్‌ చెబితే నమ్ముతానన్న స్పీకర్‌

స్పీకర్‌ వివరణతో ఆందోళన విరమించిన కాంగ్రెస్‌ ఎంపీలు

11:21 AM, 1 Jul 2024 (IST)

  • భారత క్రికెట్‌ జట్టుకు అభినందనలు తెలుపుతూ లోక్‌సభ తీర్మానం
  • విపక్షాల వాయిదా తీర్మానం నోటీసులను తిరస్కరించిన స్పీకర్‌ ఓం బిర్లా
  • నీట్‌, యూజీసీ, ఎన్‌టీఏ వైఫల్యంపై వాయిదా తీర్మానాలు తిరస్కరణ
  • కొత్త క్రిమినల్‌ చట్టాలపై వాయిదా తీర్మానాలు తిరస్కరణ

11:01 AM, 1 Jul 2024 (IST)

రెండు రోజుల విరామం తర్వాత సోమవారం పార్లమెంట్ సమావేశాల తిరిగి ప్రారంభమయ్యాయి.

10:51 AM, 1 Jul 2024 (IST)

పార్లమెంట్​ సమావేశాల ప్రారంభానికి ముందే కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం చేస్తోందంటూ ప్రతిపక్ష పార్టీలు నిరసనలు చేపట్టాయి. పార్లమెంట్​ ద్వారం వద్ద లోక్​సభలో ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ సహా పలువురు ఎంపీలు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేత పూని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Last Updated : Jul 1, 2024, 4:40 PM IST

ABOUT THE AUTHOR

...view details