Noodles Samosa: నూడుల్స్ అనగానే ఎవరికైనా టేస్ట్ చేయాలనిపిస్తుంది. ఇక పిల్లలైతే వాటిని ఎంతో ఇష్టంగా తింటారు. వెజ్ నూడుల్స్, ఎగ్‌నూడుల్స్, చికెన్ నూడుల్స్.. ఇలా రకరకాలుగా చేసుకుంటారు. చేసుకోవడం రాని వారైతే బయట ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్ నుంచి తెప్పించుకుని తింటారు. అయితే నూడుల్స్ అంటే కేవలం ఇవి మాత్రమే కావు.. ఎన్నో రకాలు ఉన్నాయి. వాటితో సమోసాలు చేసుకోవచ్చు. సూప్ తయారుచేసుకుని లాగించొచ్చు. రొయ్యలతో కలిపి రుచి చూడొచ్చు. మరి, మీరు కూడా ఇలాంటి వంటలను ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈజీగా ఇలా తయారుచేసుకోండి..
నూడుల్స్ సమోసా:
కావలసిన పదార్థాలు:
- నూడుల్స్- ఒక బౌల్(ఉడికించినవి)
- నూనె - సరిపడా
- వెల్లుల్లి రెబ్బలు - రెండు
- ఉల్లిపాయ - ఒకటి
- క్యాప్సికం - ఒకటి
- క్యారెట్ - ఒకటి
- క్యాబేజీ తురుము - ఒక కప్పు
- ఉప్పు - రుచికి తగినంత
- సోయా సాస్ - రెండు టీ స్పూన్లు
- వెనిగర్ - ఒక టేబుల్‌స్పూన్
- మైదా - రెండు కప్పులు
- గోధుమపిండి - ఒక కప్పు
- వాము - ఒక టీస్పూన్
- నీళ్లు - కొద్దిగా..
పనీర్‌తో ఈ స్నాక్స్ ట్రై చేయండి- పిల్లలు నుంచి పెద్దల వరకు ఆహా అనడం ఖాయం!
తయారీ విధానం:
- ముందుగా ఉల్లిపాయలు, వెల్లుల్లి, క్యారెట్, క్యాప్సికం, క్యాబేజీని సన్నగా తురుముకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక వెల్లుల్లి రెబ్బలు, తరిగిన ఉల్లిపాయలు వేసి వేగించుకోవాలి.
- ఆ తరువాత క్యారెట్, క్యాప్సికం ముక్కలు, క్యాబేజీ తురుము వేసి మరికాసేపు వేయించుకోవాలి.
- ఇప్పుడు తగినంత ఉప్పు వేసి, సోయాసాస్, వెనిగర్, ఉడికించిన నూడుల్స్ వేసి కలుపుకుని.. కాసేపు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక గిన్నెలో మైదా, గోధుమపిండి వేసి, తగినంత ఉప్పు, వాము, నూనె వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండిని అరగంటపాటు పక్కన పెట్టాలి.
- అరగంట తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చపాతీల్లా చేసుకోవాలి. తర్వాత సమోసా షేప్‌లో చేసుకుని.. మధ్యలో నూడుల్స్ మిశ్రమం పెట్టి చివర్లు నూనె లేదా నీటితో అద్దుతూ మూసేయాలి.
- ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక సమోసాలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే.. నూడుల్స్ సమోసా రెడీ!