తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మాలో విభేదాలు లేవు- కాంగ్రెస్​ 'అబద్ధాల దుకాణం' తెరవదు- హరియాణాలో మూడోసారి డబుల్ ఇంజిన్ సర్కార్' - Initernal Disputes In Haryana BJP

Initernal Disputes In Haryana BJP : ఎన్నికల వేళ హరియాణా బీజేపీలో అంతర్గత విభేదాలు ఉన్నాయన్న వార్తలను సీఎం నాయబ్​ సింగ్ సైనీ ఖండించారు. తామంతా ఐక్యంగా ఉన్నామన్నారు. మూడోసారి హరియాణాలో డబుల్​ ఇంజిన్ సర్కారు ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ మళ్లీ కాంగ్రెస్ అబద్ధాల దుకాణం తెరవదని అన్నారు.

Initernal Disputes In Haryana BJP
Initernal Disputes In Haryana BJP (IANS)

By ETV Bharat Telugu Team

Published : Sep 30, 2024, 3:20 PM IST

Initernal Disputes In Haryana BJP :హరియాణా బీజేపీలో అంతర్గత విబేధాలు లేవని ముఖ్యమంత్రి నాయబ్​ సింగ్ సైనీ అన్నారు. ఇక్కడ బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ అబద్ధాల దుకాణాన్ని(ఝూట్​ కా దుకాణ్​) ఎవరూ కోరుకోరని ఎద్దేవా చేశారు.
'హరియాణా సంకల్ప్​ యాత్ర' పేరిట సోమవారం నుంచి పాదయాత్ర చేస్తున్న రాహుల్​ గాంధీపై కూడా సైనీ విమర్శలు గుప్పించారు. ఆయన పొలిటికల్ టూరిజం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము పదేళ్లలో చేసిన అభివృద్ధిని ఆయన స్వాగతిస్తున్నారన్నారు. భూపిందర్​ హుడా హయాంలో అవినీతి, పక్షపాతం వల్ల ప్రజలకు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆయనకు ప్రశ్నలు ఎదురవుతాయిని అన్నారు సైనీ.

'మేతంగా ఐక్యంగా ఉన్నారం'
ఇద్దరు బీజేపీ సీనియర్​ నాయకులు రావు ఇంద్రజిత్ సింగ్, అనిల్​ విజ్​ మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇద్దరూ సీఎం కుర్చీ కోసం పోటీ పడుతున్నారని కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఐక్యంగానే ఉందని నాయబ్​ సింగ్ సైనీ అన్నారు. "మా మధ్య(బీజేపీలో) అంతర్గత విభేదాలు, కక్ష లేవు. మేమంతా ఐక్యంగా ఉన్నాము. మా సీనియర్ నాయకులు చురుకుగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ ప్రజాస్వామ్య పార్టీ. ఎవరైనా తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. పార్టీ పార్లమెంటరీ బోర్డు తీసుకున్న నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి విబేధాలూ లేవు. ఇకపైనా ఉండవు. హరియాణా ప్రజల్లో ఎలాంటి కన్​ఫ్యూజన్ లేదు. వారు డబుల్ ఇంజిన్ సర్కార్​కు ఓటు వేయబోతున్నారు." అని సైనీ చెప్పారు.

'కాంగ్రెస్​లో సీనియర్లను గౌరవించరు'
కాంగ్రెస్​ ఒక విడిపోయిన ఇల్లు అని నాయబ్​ సింగ్ సైనీ అన్నారు. ఆ పార్టీలో సీనియర్ నాయకులకు కూడా విలువ ఇవ్వరని, అలాంటిది వారు ఇచ్చిన హామీలకు ఏం విలువ ఇస్తారని ఘాటుగా విమర్శించారు. హరియాణా ఓటర్లు కాంగ్రెస్​ మళ్లీ అబద్ధాల దుకాణాన్ని ఏర్పాటు చేయకుండా తెలివిగా ఉన్నారన్నారు.

'ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత లేదు'
ఇక రాష్ట్రంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని వస్తున్న వార్తలను నాయబ్ సైనీ ఖండించారు. "రెండు పర్యాయాలు ఒక పార్టీ ప్రభుత్వంలో కొనసాగితే, మూడోసారి గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి ఇబ్బంది అవుతుందని ప్రతిపక్షాలు భావిస్తాయి. కానీ, మా విషయంలో అది తప్పు. ఇక్కడ, 2024 లోక్​సభ ఎన్నికల్లో 2019 కంటే ఐదు సీట్లు తక్కువ గెలిచాము. అందులో మూడు సీట్లు చాలా తక్కువ తేడాతో కోల్పోయాము. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని ప్రతిపక్షాలు తప్పుడు కథనాలను సృష్టించాయి. అదే హరియాణాలో మాకు ఇబ్బంది కలిగించింది. అయితే కాంగ్రెస్​ తప్పుడు వార్తలు వ్యాపింపజేస్తే, మేము సరైన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాము." అని సైనీ వివరించారు.

మరోవైపు, ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్న బీజేపీ నాయకులు గురించి సైనీ ప్రస్తావించారు. వారందరినీ ఒప్పించేందుకు ప్రయత్నించామన్నారు. అయితే కొందరు అంగీకరించారని, మరికొందరు పోటీలో ఉన్నారని తెలిపారు. అయితే ఈ విషయం తమ ఓట్లని ప్రభావితం చేయదని చెప్పారు.

'1.5 లక్షల ఉద్యోగాలిచ్చాం'
"2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో అవినీతి, పక్షపాతం రాజ్యమేలాయి. కానీ ఆ విధానాన్ని రద్దు చేసి, మా గవర్నమెంట్ పారదర్శకతతో 1.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. 24 పంటలకు కనీస మద్దతు ధర(ఎమ్​ఎస్​పీ) ఇస్తోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రం కూడా ఇలా మేము ఇస్తున్నట్లు ఇవ్వలేదు." అని సైనీ వివరించారు.

ఎలక్షన్స్​కు ముందే సీఎం సీటు కోసం పోటీ! ముఖ్యమంత్రి పోస్టు తనకే ఇవ్వాలన్న బీజేపీ సీనియర్ నేత! - Haryana Elections 2024

బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్- హరియాణా సీఎం నాయబ్‌ సింగ్ అక్కడి నుంచే పోటీ - Haryana Elections 2024

ABOUT THE AUTHOR

...view details