తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆర్​బీఐ కొత్త గవర్నర్​గా సంజయ్​ మల్హొత్రా నియామకం - NEW RBI GOVERNOR SANJAY MALHOTRA

సంజయ్​ మల్హొత్రాను రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా 26వ గవర్నర్​గా నియమించిన కేంద్రం

New RBI Governor Sanjay Malhotra
New RBI Governor Sanjay Malhotra (ANI)

By ETV Bharat Telugu Team

Published : Dec 9, 2024, 5:32 PM IST

Updated : Dec 9, 2024, 5:45 PM IST

New RBI Governor Sanjay Malhotra :సంజయ్​ మల్హొత్రాను రిజర్వ్​ బ్యాంక్ 26వ గవర్నర్​గా కేంద్రం నియమించింది. ఆయన ఇప్పటివరకు రెవెన్యూ కార్యదర్శిగా సేవలందించారు. మల్హోత్రా నియామకాన్ని నియామకాల క్యాబినెట్ కమిటీ ఖరారు చేసింది. మల్హోత్రా 1990 బ్యాచ్‌ రాజస్థాన్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. ఈ నెల 11 నుంచి మూడేళ్లపాటు సంజయ్ మల్హోత్రా పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుత గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పదవీ కాలం డిసెంబర్‌ 10 ముగియడం వల్ల తదుపరి గవర్నర్‌ను కేంద్రం నియమిచింది.

కాగా, 2018లో ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన శక్తికాంత దాస్‌ పదవీ కాలం 2021లోనే ముగియగా కేంద్రం మరో మూడు సంవత్సరాలు పొడిగించింది. ఈ గడువు కూడా డిసెంబర్‌ 10తో ముగియనుండడం వల్ల కొత్త గవర్నర్‌ను నియామకానికి కేబినెట్‌ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.

సంజయ్‌ మల్హోత్రా 1990 బ్యాచ్‌ రాజస్థాన్‌ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. ఐఐటీ కాన్పుర్‌లో కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ నుంచి పబ్లిక్‌ పాలసీలో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. విద్యుత్‌, ఆర్థిక, పన్నులు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మైన్స్‌ తదితర రంగాల్లో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించారు సంజయ్ మల్హొత్రా. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలోని రెవెన్యూ విభాగం కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక, పన్నుల విషయంలో, ఆర్థిక, ట్యాక్సేషన్‌లో అపారమైన అనుభవం కలిగిన సంజయ్‌ మల్హోత్రా, ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు సంబంధించిన విధాన రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు.

Last Updated : Dec 9, 2024, 5:45 PM IST

ABOUT THE AUTHOR

...view details