తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోక్​ సభ ఎన్నికల్లో భారీగా పోలింగ్​ - మొదటి 4 దశల్లో 67% ఓటింగ్​ నమోదు - Lok Sabha Elections Voting Percent

Lok Sabha Elections 2024 Voting Percent : సార్వత్రిక ఎన్నికల తొలి నాలుగు దశల్లో 66.95శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాబోయే మూడు దశల పోలింగ్​లో ఓటర్లు బయటకు వచ్చి పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని కోరింది.

general Elections 2024 Voting Percent
Lok Sabha Elections 2024 Voting Percent (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 16, 2024, 5:42 PM IST

Updated : May 16, 2024, 6:17 PM IST

Lok Sabha Elections 2024 Voting Percent :లోక్‌ సభ ఎన్నికల తొలి నాలుగు దశల్లో 66.95 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న 97కోట్ల మంది ఓటర్లలో ఈ నాలుగు విడతల్లో 45.10 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపింది. రానున్న దశల పోలింగ్​లో ఓటర్లు బయటకు వచ్చి పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని విజ్ఞప్తి చేసింది.

General Elections 2024 Polling Percentage :

  • మే 13న జరిగిన నాలుగో దశ పోలింగ్‌లో 69.16 శాతం నమోదైంది. 2019 పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి 3.65 శాతం ఎక్కువ ఓటింగ్ నమోదైంది.
  • మే 7న జరిగిన మూడో దశ పోలింగ్​లో 65.68 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల మూడో దశలో 68.4 శాతం ఓటు వేశారు.
  • ఏప్రిల్ 26న జరిగిన రెండో విడత పోలింగ్​లో 66.71 శాతం మంది ఓటేశారు. 2019 లోక్ సభ ఎన్నికల రెండో విడతలో 69.64శాతం ఓటింగ్ నమోదైంది.
  • ఏప్రిల్ 19న జరిగిన తొలి దశ ఎన్నికల్లో 66.14 శాతం పోలింగ్‌ నమోదైంది. 2019 సార్వత్రిక ఎన్నికల తొలి దశలో 69.43 శాతం ఓటింగ్ జరిగింది.

ఓటింగ్ ఇంకా పెరగాలి!
మిగతా మూడు దశల్లో ఓటింగ్​ను పెంచేందుకు ఓటర్లలో అవగాహనను పెంచాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్లకు సూచించామని సీఈసీ తెలిపింది. 'ఓటరును అవగాహన కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలి. ఎన్నికల సంఘం అభ్యర్థన మేరకు పలు సంస్థలు, సినీ నటులు, ప్రముఖులు ఓటు హక్కు గురించి ఓటరుకు అవగాహన కల్పించడం సంతోషదాయకం. అధిక శాతం ఓటింగ్ నమోదవ్వడం భారత ప్రజాస్వామ్యం బలం గురించి ప్రపంచానికి ఓటరు ఇచ్చిన సందేశం. ప్రజాస్వామ్య పండుగలో అందరూ పాల్గొనాలి. ఓటింగ్ రోజు సెలవు దినం కాదు. ఓటర్లు గర్వించదగ్గ రోజు. మిగతా మూడు విడతల పోలింగ్​లో ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు వేయాలి' అని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. కాగా, బ్యాంకులు, పోస్టాఫీసులు, ప్రైవేట్ సంస్థలు, టెలికాం ప్లాట్​ఫామ్​లు తమ పబ్లిక్ ఇంటర్​ఫేస్​ను ఉపయోగించి నమోదిత ఓటర్లను పోలింగ్​లో పాల్గొనేలా కృషి చేస్తున్నాయి.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నాలుగు దశల్లో 379 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మే 20న ఐదో దశ, మే 25న ఆరోదశ, జూన్ 1న ఏడో దశ పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 1న మొదలైన సార్వత్రిక ఎన్నికల పోరు జూన్ 1తో ముగియనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

'కేజ్రీవాల్​కు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు'- బెయిల్​పై సుప్రీంకోర్టు క్లారిటీ - Arvind Kejriwal Supreme Court

రూ.25వేలతో చీపుర్ల వ్యాపారం- ఏడాదిన్నరలో రూ.12లక్షల టర్నోవర్- సోనిక సక్సెస్​ స్టోరీ - sonika business story

Last Updated : May 16, 2024, 6:17 PM IST

ABOUT THE AUTHOR

...view details