Missing Boy Return To Home After 22 Years: ఏడేళ్ల వయసులో కిడ్నాప్‌నకు గురైన ఓ బాలుడు 22 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. అయితే తన కుటుంబానికి దూరమైన తర్వాత కొన్ని సంవత్సరాలు పాటు భిక్షాటన చేశాడు. ఆ తర్వాత పదో తరగతి వరకు చదువుకుని మంచి ఉద్యోగాన్ని కూడా సంపాదించాడు. కానీ తన కుటుంబ ఎక్కడ ఉందో తెలీదు, వెతకడానికి ట్రై చేద్దాం అనుకున్నా, ఏమి గుర్తు లేవు. ఇలాంటి పరిస్థితిలో ఓ పోలీసు సాయంతో 22ఏళ్ల తర్వాత తన ఇంటికి చేరుకున్నాడు. తన కుటుంబ సభ్యులను చూశాక అనందంతో ఉప్పొంగిపోయాడు. భావోద్వేగంతో తల్లిని హత్తుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.
అసలేం జరిగిందంటే
ఈ కథ 2003లో మొదలైంది. సహరాన్‌పూర్‌కి చెందిన అమిత్‌కు 7ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఓ రోజు వాళ్ల అమ్మ గోధమ రవ్వ తీసుకురామ్మన్ని చెప్పింది. దుకాణానికి వెళ్లిన అమిత్ కిడ్నాప్‌కు గురయ్యాడు. కట్ చేస్తే, మహారాష్ట్రలోని ముంబయిలో ప్రత్యక్షమయ్యాడు. ఎవరూ తీసుకుపోయారో తెలియదు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చెత్త ఏరుకుంటూ, భిక్షాటన చేశాడు. అలా కొంత కాలం తర్వాత ఎలాగోలా దిల్లీకి వెళ్లాడు. అక్కడి పోలీసులు అమిత్‌ను చిల్డ్రన్స్ హోమ్‌లో చేర్పించారు. అక్కడే 5 సంవత్సరాల పాటు ఉండి పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత ఒక చిన్న ఉద్యోగం కూడా సంపాదించాడు. కానీ, అమిత్‌ను తన ఇంటి జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. తన ఇంటికి వెళ్లాలని ఆశ పడుతున్నాడు కానీ, అతడికి ఏమి గుర్తుకు రావడం లేదు. అయితే చోర్ చౌక్ అనే పేరు, ఆ ప్రాంతంలో ఆయిల్ మిల్లులు ఉన్నట్లు మాత్రమే అమిత్‌కు గుర్తు ఉన్నాయి. వీటితో తన కుటుంబాన్ని కలిసేదెలా అని ఆవేదనకు గురయ్యాడు. అయినా కుటుంబాన్ని తిరిగి కలవాలి అన్న ఆరాటం అతనిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు.