తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తొలి గెలుపు కోసం అలుపెరుగని పోరాటం- 14వసారి బరిలోకి పోపట్​లాల్​- ఆస్తులు అమ్మి మరీ! - lok sabha elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Man Contesting Election For 14th Time : మొదటి విజయం కోసం అలుపెరుగకుండా కృషి చేస్తున్నారు ఓ వ్యక్తి. 13సార్లు వివిధ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా, వెనుకడుగు వేయకుండా 14వ సారి లోక్​సభ బరిలో నిలిచాడు. అభివృద్ధే ధ్యేయంగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఆయన కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Man Contesting Election For 14th Time
Man Contesting Election For 14th Time

By ETV Bharat Telugu Team

Published : Apr 20, 2024, 5:13 PM IST

తొలి గెలుపు కోసం అలుపెరుగని పోరాటం- 14వసారి బరిలోకి పోపట్​లాల్​- ఆస్తులు అమ్మి మరీ!

Man Contesting Election For 14th Time :తొలి గెలుపు కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు ఓ వ్యక్తి. ఇప్పటివరకు 13సార్లు వివిధ ఎన్నికల్లో పోటీ చేసిన పోపట్​లాల్​, ఈ సారి లోక్​సభ ఎన్నికల్లో 14వ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా, ఉన్న ఆస్తులు అమ్మి మరీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. అయితే పోపట్​లాల్​ ఇలా అలుపెరుగక చేస్తున్న ప్రయత్నం ఎందుకోసం? అసలు రాజకీయాల్లోకి ఆయనకు ఎందుకు రావాలనిపించిందో? ఇప్పుడు తెలుసుకుందాం.

పోపట్​లాల్​

రాజస్థాన్​లోని బలోత్రా జిల్లా సమ్​దారి ప్రాంతానికి చెందిన వ్యక్తి పోపట్​లాల్ (57)​. తన ప్రాంతాన్ని చేసి, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో పోపట్​లాల్ గత కొన్నేళ్లుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన ఇప్పటివరకు నాలుగు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో, మూడు సార్లు లోక్​సభ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అంతేకాకుండా తన భార్యను ఐదుసార్లు గ్రామపంచాయతీ ఎన్నికల్లో, ఓసారి జిల్లా పరిషత్​ ఎలక్షన్​లో నిలబెట్టారు. 2009 లోక్​సభ ఎన్నికల్లో తనకు మూడో స్థానం వచ్చిందని పోపట్​లాల్​ తెలిపారు. అయితే ఇన్నిసార్లు పోటీ చేసినా పోపట్​లాల్​కు నిరాశే ఎదురైంది. అయినా వెనకడుగు వేయకుండా 14వ సారి బాడ్​మెర్​ లోక్​సభ స్థానం నుంచి బరిలో దిగారు. ఇక్కడి నుంచి కేంద్ర మంత్రి కైలాశ్ చౌదరి, రవీంద్ర సింగ్​ భాటి, ఉమేరామ్​ బేనివాల్​ వంటి ప్రముఖులు పోటీ చేస్తున్నారు.

కర పత్రాలతో ప్రచారం చేస్తున్న పోపట్​లాల్​

ఆస్తులు అమ్మి మరీ!
పోపట్​లాల్​ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆయన భార్య, కుమారుడు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయినా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ సమస్యలు పోపట్​లాల్​ను ఆపలేదు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు పశువులను, భూమిని కూడా అమ్ముకున్నారు. అయితే ప్రారంభంలో కుటుంబ సభ్యులు వారించారని కానీ ఆ తర్వాత మద్దతు ఇచ్చారని పోపట్​లాల్​ తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు పోపట్​లాల్​ ఏ రాజకీయ పార్టీ నుంచి టికెట్ అడగలేదు. ఈ విషయంపై ప్రశ్నించగా, టికెట్​ రైతులు, ప్రజల వద్ద ఉందని అన్నారు. అయితే ఆర్థికంగా స్తోమత లేని పోపట్​లాల్​, ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ఇంట్లో భోజనం చేసి ప్రచారానికి వెళతున్నారు. ప్రచార సామాగ్రిని గుడ్డ సంచిలో వేసుకుని ఇంటింటికీ తిరుగుతున్నారు. పోపట్​లాల్​ ఎక్కడికి వెళ్లినా మంచి ప్రజాధారన లభిస్తోంది. దీంతో కనీసం ఒక్కసారైనా ప్రజలను తనకు మద్దతు ఇస్తారని పోపట్​లాల్​ బలంగా నమ్ముతున్నారు.

ప్రచారం చేస్తున్న పోపట్​లాల్​

ఎన్నికల వేళ కాంగ్రెస్​కు​ భారీ షాక్​- బీజేపీలో చేరిన ప్రియాంక గాంధీ సన్నిహితుడు! - Tajinder Singh Bittu

'కాంగ్రెస్ యువరాజుకు వయనాడ్​లోనూ కష్టమే- కొత్త స్థానం చూసుకోవాలి' - Lok Sabha Election 2024

ABOUT THE AUTHOR

...view details