- రూ.60కు వెజ్ మీల్స్- రూ.90కు నాన్ వెజ్ మీల్స్!
- మొబైల్లో ఆర్డర్ చేస్తే ఇంటికి డోర్ డెలివరీ!
- క్వాలిటీ, టేస్ట్‌లో అస్సలు నో కాంప్రమైజ్!
- వండేది, డెలివరీ చేసేది డ్వాక్రా మహిళలే!
Lunch Bell Kudumbashree : ఇదే కుటుంబశ్రీ లంచ్ బెల్ ప్రాజెక్ట్ మెయిన్ ధీమ్. అసలు ఈ కుటుంబశ్రీ ఏంటని మీకు డౌట్ రాలేదా?.. సాధారణంగా చాలా రాష్ట్రాల్లో డ్వాక్రా సంఘాలు ఉంటాయి. కానీ కేరళలోని డ్వాక్రా మహిళంతా కుటుంబశ్రీ పేరుతో స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టిన వీరు, ఇటీవల ఆహార రంగంలోకి కూడా ప్రవేశించారు.
మొబైల్లో ఆర్డర్ చేస్తే చాలు ఇంటికి లంచ్ బాక్స్‌లో క్వాలిటీ, టేస్టీ ఫుడ్‌ను డెలివరీ చేస్తున్నారు. ఇటీవల మొదలైన ఈ లంచ్ బెల్ ప్రాజెక్ట్ మంచి ఆదరణ దక్కించుకుంటోంది. మార్చి 5న కేరళ తిరువనంతపురంలో రాష్ట్ర వ్యవహారాల శాఖ మంత్రి ఎంబీ రాజేశ్ ఈ లంచ్ బెల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. మార్చి 6న సేవలు మొదలవ్వగా, ఇప్పటివరకు 2000 మందికి పైగా ఆర్డర్లు వచ్చాయి.
'కుటుంబశ్రీ ప్రాజెక్ట్ అందరి దృష్టిలో మంచి పేరు సంపాదించుకుంది. ఇక్కడ చాలా మంది మహిళలు పని చేస్తున్నారు. ఈ విషయం నాకు ఎంతో నచ్చింది. చాలా సౌకర్యంగా అనిపిస్తుంది. ఇంట్లో ఎలా అయితే చేస్తారో అలానే అనిపిస్తుంది. ఆ లంచ్ బాక్స్ తయారు చేసే విధానం కూడా అలానే ఉంటుంది.'
-కుటుంబశ్రీ సంస్థ ఉద్యోగి
ఈ ప్రాజెక్టు కింద భోజనాన్ని తయారు చేసేందుకు 11 మంది, ఆహారాన్ని డెలివరీ చేసేందుకు 8 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో వెజ్, నాన్ వెజ్ ఫుడ్ అందుబాటులో ఉంటుంది. మార్చి 5న ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్‌కు కేవలం 16 రోజుల్లో 2000కు పైగా ఆర్డర్స్ వచ్చాయని చెప్పారు ప్రాజెక్ట్ మేనేజర్ జాన్.
'ఇందులో చేయాల్సి పని చాలా ఉంటుంది. త్వరలో టెక్ పార్క్‌కు కూడా డెలివరీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. వీక్లీ, మంత్లీ ఇలా అన్ని రకాల సర్వీస్ ఉంటుంది. ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు లేకుంటే నేరుగా ఫోన్ చేసి మాకు ఆర్డర్ ఇవ్వచ్చు. మేం పార్టీలకు, ఫంక్షన్లకు కూడా ఫుడ్ సరఫరా చేస్తాం'