తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ఉగ్రదాడి - ఇద్దరు వలస కార్మికులు మృతి- తీవ్రంగా ఖండించిన ఒమర్ అబ్దుల్లా

జమ్ముకశ్మీర్​లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు- ఇద్దరు వలస కార్మికులు మృతి- మరో ఇద్దరికి గాయాలు

By ETV Bharat Telugu Team

Published : 7 hours ago

Updated : 7 hours ago

Labourers Killed In Terrorist Attack
Labourers Killed In Terrorist Attack (ANI)

Labourers Killed In Terrorist Attack :జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి కలకలం సృష్టించారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వలస కార్మికులు మృతి చెందారు. గాందర్‌బల్‌ జిల్లాలోని సోన్‌మార్గ్‌ ప్రాంతంలో ఓ సొరంగ మార్గం నిర్మాణ ప్రదేశంలోని కార్మికుల క్యాంపుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న భద్రతాబలగాలు ఘటనాస్థలికి చేరుకుని- ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఉగ్రవాదుల కోసం సెర్చ్​ ఆపరేషన్ చేపట్టాయి. కాగా, రెండు రోజుల క్రితమే షోపియాన్‌ జిల్లాలో బిహార్‌కు చెందిన వలస కార్మికుడిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు.

తీవ్రంగా ఖండిస్తున్నా : ఒమర్ అబ్దుల్లా
ఈ ఉగ్రదాడిని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు. "సోనామార్గ్ ప్రాంతంలోని గగాంగీర్‌లో వలస కార్మికులపై జరిగిన దారుణమైన, పిరికి దాడి చాలా విచారకరం. కార్మికులు ఈ ప్రాంతంలో కీలకమైన ఇన్​ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో పని చేస్తున్నారు. ఇద్దరు చనిపోయారు. మరో 2-3 గాయాలపాలయ్యారు. నిరాయుధులైన అమాయకులపై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధితుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. " అని ఎక్స్​లో పోస్ట్ చేశారు.

భద్రత కట్టుదిట్టం- ఘటనాస్థలికి ఐజీ
ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసుల. కశ్మీర్ జోన్ ఐజీ వీకే బిర్డి గగన్‌గీర్, గందర్‌బాల్ చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి.

Last Updated : 7 hours ago

ABOUT THE AUTHOR

...view details