PM Modi Varanasi Visit : భారత్ ఆరోగ్య వ్యూహాలు ఐదు స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేడు భారత్ దేశం వైద్య రంగంలో ప్రివెంటివ్ హెల్త్ కేర్, సకాలంలో వ్యాధి నిర్ధారణ, ఉచిత, చౌకమైన చికిత్స, చిన్నచిన్న పట్టణాల్లో మెరుగైన వైద్యం, వైద్యుల కొరతను భర్తీ చేయడం, వైద్యరంగంలో సాంకేతిక విస్తరణ వంటి ఐదు స్తంభాలను కలిగి ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని తన సొంతనియోజక వర్గంలోని వారణాసిలో కంచి మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్‌జే శంకర కంటి ఆస్పత్రిని ప్రధాని మోదీ ప్రారంభించారు. అలాగే ఉత్తర్‌ప్రదేశ్‌లో రూ.6,700 కోట్లతో పలు అభివృద్ధికి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ శంకర ఆస్పత్రి వల్ల యూపీతోపాటు మధ్యప్రదేశ్, బిహార్ రాష్ర్టాల్లోని మెుత్తం 20 జిల్లాలోని ప్రజలకు లబ్ధి చేకూరనుందని చెప్పారు. ఈ ఆసుపత్రి రాకతో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న కాశీ, ఇకపై ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా మారుతుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.
VIDEO | PM Modi (@narendramodi) inaugurates RJ Sankara Eye Hospital and visits an exhibition in Varanasi, Uttar Pradesh.
— Press Trust of India (@PTI_News) October 20, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/TPHmFvYTTm
#WATCH | Addressing at the inauguration ceremony of RJ Shankara Eye Hospital in Varanasi, Prime Minister Narendra Modi says, " rj sankara eye hospital is a blend of spirituality and modernity. it will serve the elderly as well as the kids while providing employment to the… pic.twitter.com/NTTUhbA48I
— ANI (@ANI) October 20, 2024
మోదీపై కంచి శంకరాచార్య ప్రశంసలు
ప్రధాని మోదీ నాయకత్వంపై కంచి కామకోటి పీఠం శంకరాచార్యులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ప్రశంసలు కురిపించారు. భగవంతుని ఆశీస్సుల వల్లే మోదీ లాంటి మంచి నేతలు వచ్చారని, ఆయన ద్వారా భగవంతుడు ఎన్నో మంచి పనులు చేయిస్తారని అన్నారు. వారణాసిలోని ఆర్‌జే శంకర్ కంటి ఆసుపత్రిని ప్రధాని ప్రారంభించిన సందర్భంగా విజయేంద్ర సరస్వతి స్వామీజీ మాట్లాడారు.
ఎన్‌డీఏ అంటే?
ఎన్‌డీఏ ప్రభుత్వ పాలనను 'నరేంద్ర దామోదర్‌దాస్ కా అనుశాసన్' అని విజయేంద్ర సరస్వతి స్వామి అభివర్ణించారు. ఇది భద్రత, సౌఖ్యం, పౌరుల క్షేమంపై దృష్టిసారించిన గొప్ప పాలన అని అన్నారు. మోదీ పాలన ప్రపంచానికే ఓక 'రోల్ మోడల్'గా నిలిచిందని, సాంస్కృతిక పునరుజ్జీవనంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, అందుకు సోమ్‌నాథ్, కేదార్‌నాథ్‌లే ఉదాహరణలని స్వామీజీ అన్నారు.
#WATCH | Uttar Pradesh: Addressing the inauguration ceremony of RJ Shankara Eye Hospital in Varanasi, Shankaracharya of Kanchi Kama Koti Peetha Sri Shankar Vijayendra Saraswati Swami says, " ...with the blessing of god, narendra damodar das modi and his government 'nda', which… pic.twitter.com/GZoWY39t2o
— ANI (@ANI) October 20, 2024
కొత్త అధ్యాయం
వారణాశిలో ఆర్‌జే శంకర కంటి ఆసుపత్రి ప్రారంభించడంతో, అభివృద్ధి, సేవ వైపు కాశీ ప్రయాణంలో కొత్త అధ్యయం ప్రారంభమైందని యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. తమ ప్రభుత్వం ఆరోగ్య రంగంలో రూ.2500 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టిందని పేర్కొన్నారు.
#WATCH | Varanasi | Uttar Pradesh CM Yogi Adityanath says, " as the leader of the new india, pm narendra modi represents the country from up's varanasi. the whole country and the world is witnessing a transforming varanasi which is preserving its spiritual and cultural heritage.… https://t.co/a7QtwYdeaM pic.twitter.com/eeq6SS7weo
— ANI (@ANI) October 20, 2024