- రెండో విడతలో 38 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్
- ఝార్ఖండ్‌లో 5 గంటల వరకు 67.59 శాతం పోలింగ్
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు - రెండో దశలో 67.59 శాతం పోలింగ్ - JHARKHAND ASSEMBLY ELECTIONS 2024
Published : Nov 20, 2024, 7:03 AM IST
Jharkhand Assembly Elections 2024 Live Updates :ఝార్ఖండ్‌లో చివరిదైన రెండో విడతకు సంబంధించి 38 నియోజకవర్గాల్లో కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లోని 31 పోలింగ్ కేంద్రాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే ఓటింగ్ ముగించనున్నారు.
LIVE FEED
ముగిసిన ఝార్ఖండ్ ఎన్నికలు
ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికల రెండో విడతలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. రెండో విడతలో 38 నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో ప్రజలంతా పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు వేశారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేసి పోలింగ్ నిర్వహించారు.
ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ప్రజలు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేశారు. పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. సమస్యాత్మక ప్రాంతాల్లోని 31 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4గంటలకే ఓటింగ్ ముగిసింది. కేంద్ర ఎన్నికల సంఘం 14 వేల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. బీజేపీ నాయకుడు బాబూలాల్ మరాండీ గిరిధ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి భార్య కల్పనా సొరేన్ తాను పోటీచేసిన గండే నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
ఝార్ఖండ్ రెండో విడతలో పోలింగ్ జరిగిన 38స్థానాల్లో 528 మంది అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకున్నారు. ఝార్ఖండ్‌లో మొత్తం 81శాసనసభ స్థానాలు ఉండగా ఈనెల 13న తొలివిడతలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. 66.18 శాతం పోలింగ్ నమోదైంది. ఝార్ఖండ్‌లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ కలిసి మహాఘట్ బంధన్ పేరుతో పోటీ చేశాయి. బీజేపీ, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్ యూనియన్, జేడీయూ, లోక్ జన్‌శక్తి రామ్ విలాస్ పార్టీలతో కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీచేశాయి. ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఓట్లను ఈనెల 23న లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.
- ఝార్ఖండ్‌లో కొనసాగుతున్న రెండో విడత పోలింగ్
- మధ్యాహ్నం ఒంటి గంట వరకు 61.47 శాతం పోలింగ్ నమోదు
- సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
- సమస్యాత్మక ప్రాంతాల్లోని 31 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4 వరకు పోలింగ్
- ఝార్ఖండ్‌లో కొనసాగుతున్న రెండో విడత పోలింగ్
- మధ్యాహ్నం ఒంటి గంట వరకు 47.92 శాతం పోలింగ్ నమోదు
- సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
- సమస్యాత్మక ప్రాంతాల్లోని 31 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4 వరకు పోలింగ్
ప్రిసైడింగ్ అధికారిపై వేటు
అధికార పార్టీ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించినందుకు దేవ్‌ఘర్ ప్రిసైడింగ్ అధికారిని మార్చారు. తమ ఫిర్యాదు మేరకే ప్రిసైడింగ్ అధికారిని మార్చినట్లు ఝార్ఖండ్ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే తెలిపారు.
రెచ్చిపోయిన మావోయిస్టులు
ఝార్ఖండ్‌లో చివరిదశ పోలింగ్‌కు కొన్నిగంటల ముందు మావోయిస్ట్‌లు రెచ్చిపోయారు. లతేహర్‌జిల్లాలోని అటవీ ప్రాంతం సమీపంలో ఐదు ట్రక్కులను మావోయిస్ట్‌లు కాల్చేశారు. బుధవారం వేకువజామున బొగ్గురవాణా చేసే ట్రక్కుల చుట్టూ మోహరించి దాడులకు తెగబడ్డారు. JCP మావోయిస్ట్ గ్రూపు సభ్యులు ట్రక్కులకు నిప్పు అంటించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు లతేహర్ ఎస్పీ గౌరవ్ తెలిపారు. దాదాపు 12 మంది మావోయిస్టులు అటవీప్రాంతం నుంచి వచ్చి విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు ట్రక్కు డ్రైవర్ ఒకరు చెప్పారు. వాహనాల నుంచి దిగమని చెప్పి ట్రక్కులను తగల బెట్టేశారని వారు వెల్లడించారు.
ఝార్ఖండ్‌లో 11 గంటల వరకు 31.37 శాతం పోలింగ్ నమోదు
- ఝార్ఖండ్‌లో కొనసాగుతున్న రెండో విడత పోలింగ్
- ఝార్ఖండ్‌లో 11 గంటల వరకు 31.37 శాతం పోలింగ్ నమోదు
- సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
- సమస్యాత్మక ప్రాంతాల్లోని 31 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4 వరకు పోలింగ్
ఝార్ఖండ్‌లో 9 గంటల వరకు 12.71 శాతం నమోదు
- ఝార్ఖండ్‌లో కొనసాగుతున్న రెండో విడత పోలింగ్
- ఝార్ఖండ్‌లో 9 గంటల వరకు 12.71 శాతం నమోదు
- సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
- రెండో విడతలో 38 నియోజకవర్గాల్లో పోలింగ్
- సమస్యాత్మక ప్రాంతాల్లోని 31 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4 వరకు పోలింగ్
- ఈనెల 23న ఝార్ఖండ్‌లో ఎన్నికల ఫలితాలు
నా యువ స్నేహితులను అభినందిస్తున్నా : ప్రధాని మోదీ
"ఈరోజు ఝార్ఖండ్‌లో చివరి రెండో దశ పోలింగ్. ఈ ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లందరూ ఉత్సాహంగా పాల్గొని పోలింగ్‌లో రికార్డు సృష్టించాలని కోరుతున్నా. తొలిసారిగా ఓటు వేయబోతున్న నా యువ స్నేహితులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నా. మీ ప్రతి ఓటు రాష్ట్రానికి బలం" అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
పోలింగ్ స్టార్ట్
ఝార్ఖండ్‌లో రెండో దశలో 38 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రారంభం అయింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.
ఝార్ఖండ్‌లో మొత్తం 81 శాసనసభ స్థానాలు ఉన్నాయి. వాటిలో తొలి విడతలో ఈనెల 13న 43స్థానాలకు పోలింగ్ జరిగింది. 43 స్థానాలకు 683 మంది అభ్యర్థులు పోటీపడగా 66.18 శాతం పోలింగ్ నమోదైంది. ఝార్ఖండ్‌లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ కలిసి మహాఘట్‌బంధన్ పేరుతో పోటీ చేస్తున్నాయి. బీజేపీ, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్ యూనియన్, JDU, లోక్‌జన్ శక్తి రామ్ విలాస్ పార్టీ కలిసి NDA కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఝార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి.