IRCTC Treasures of Thailand Ex Hyderabad:చాలా మంది వెళ్లాలనుకునే ఇంటర్నేషనల్ టూరిస్ట్ స్పాట్‌లలో థాయ్‌లాండ్ ఒకటి. బ్యాంకాక్ బీచ్‌లో ఎంజాయ్ చేయాలని చాలా మంది అనుకుంటుంటారు. ముఖ్యంగా యూత్కైతే ఇది ఫెవరేట్ డెస్టినేషన్. అయితే విదేశీ యాత్ర అనగానే కాస్ట్ ఎక్కువని అనుమానం సహజం. కానీ, ఐఆర్‌సీటీసీ (IRCTC) అందుబాటు ధరలోనే వీటిని ఆఫర్ చేస్తోంది. మరి థాయ్‌లాండ్ అందాల్ని ఆస్వాదించేందుకు ఐఆర్‌సీటీసీ అందిస్తున్న టూర్ ప్యాకేజ్ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
"ట్రెజర్స్ ఆఫ్ థాయ్‌లాండ్ ఎక్స్ హైదరాబాద్" (Treasures of Thailand Ex Hyderabad) పేరిట ఐఆర్‌సీటీసీ ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ యాత్ర మొత్తం మూడు రాత్రులు, 4 పగళ్లు కొనసాగుతుంది. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్రారంభమవుతుంది. థాయ్‌లాండ్‌లో ప్రముఖ టూరిస్ట్ కేంద్రాలైన కోరల్ ద్వీపం, పట్టయ, బ్యాంకాక్‌లో పలు సందర్శనీయ స్థలాలను వీక్షించొచ్చు.
ప్రయాణం వివరాలు ఇవే:
- మొదటి రోజు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి రాత్రి 9 గంటలకు బ్యాంకాక్‌కు ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. బ్యాంకాక్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తారు. అక్కడి నుంచి పట్టయకు బయలుదేరుతారు. ముందుగానే బుక్ చేసిన హోటల్లో దిగి ఫ్రెషప్ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. ఆ తర్వాత హోటల్లోనే మధ్యాహ్నం వరకు రెస్ట్ తీసుకుంటారు. లంచ్ తర్వాత పట్టయలో జెమ్స్ గ్యాలరీ విజిట్ చేస్తారు. సాయంత్రం అల్కజార్ షోను వీక్షించి.. రాత్రి ఇండియన్ రెస్టరెంట్లో డిన్నర్ ఉంటుంది. ఆ రాత్రి పట్టయలో బస ఉంటుంది.
"హిమాలయాల్లో సూర్యోదయపు అందాలు" - IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ! - అందుబాటు ధరల్లోనే! - IRCTC Hyderabad Nepal Tour
- రెండో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కోరల్ ద్వీపంలో స్పీడ్ బోటింగ్ ఉంటుంది. అక్కడే బీచ్‌లో కాసేపు సేదదీరొచ్చు. తర్వాత నూంగ్ నుచ్ ట్రోపికల్ గార్డెన్ చూడొచ్చు. పట్టయ తిరిగి రావడంతో ఆరోజు పూర్తవుతుంది. ఆ రోజు రాత్రి స్టే అక్కడే ఉంటుంది.
- మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సఫారీ వరల్డ్ టూర్ అండ్ మెరైన్ పార్క్ విజిట్ ఉంటుంది. సాయంత్రానికి బ్యాంకాక్‌కు చేరుకుంటారు. స్థానికంగా ఉన్న పలు ప్రాంతాలను చూస్తారు. ఆ రాత్రి బ్యాంకాక్‌లోనే స్టే ఉంటుంది.
- నాలుగో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత బ్యాంకాక్ సిటీలోని పలు ప్రాంతాలను చూస్తారు. తర్వాత బ్యాంకాక్‌లోని గోల్డెన్ బుద్ధ, మార్బుల్ బుద్ధ సందర్శిస్తారు. తర్వాత షాపింగ్ ఉంటుంది. సాయంత్రం ఆరు గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకోని.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు రిటర్న్ అవుతారు. భాగ్యనగరం చేరుకోవడంతో ఈ టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలు చూస్తే:
- హైదరాబాద్ - థాయ్ లాండ్ టూర్ ప్యాకేజీ ధరలు : సింగిల్ షేరింగ్ కు రూ.57,820గా ఉంది. డబుల్ షేరింగ్‌కు రూ.49,450గా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.49,450 ప్రకటించారు. 5- 11 ఏళ్ల పిల్లలకు చైల్డ్ విత్ బెడ్ అయితే రూ.47,440గా, విత్ అవుట్ బెడ్ అయితే రూ.42,420గా ధరలు ఉన్నాయి.
- ప్రస్తుతం ఈ టూర్ జులై 25 నుంచి అందుబాటులో ఉంటుంది.
- ఈ ప్యాకేజీ సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
"గాడ్స్ ఓన్ కంట్రీ"కి IRCTC సూపర్ ట్రిప్ - ప్రకృతి సోయగాల్లో తడిసి ముద్దైపోవచ్చు! - IRCTC Cultural Kerala Monsoon Magic
"ఈ మంచుల్లో.. ప్రేమంచుల్లో.." - కశ్మీర్ అందాల వీక్షణకు IRCTC స్పెషల్ ప్యాకేజీ! - IRCTC Mystical Kashmir Tour