తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"గాడ్స్ ఓన్ కంట్రీ"కి IRCTC సూపర్ ట్రిప్ - ప్రకృతి సోయగాల్లో తడిసి ముద్దైపోవచ్చు! - IRCTC Cultural Kerala Monsoon Magic

IRCTC Hyderabad Kerala Tour : కేరళ ప్రకృతి అందాలను చూడాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​. IRCTC టూరిజం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్​ జర్నీ ద్వారా ఈ టూర్​ ఆపరేట్ చేస్తోంది. మరి, ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

IRCTC Hyderabad Kerala Tour
IRCTC Hyderabad Kerala Tour (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 23, 2024, 9:42 AM IST

IRCTC Cultural Kerala Monsoon Magic Package: అందమైన ప్రకృతి సోయగాలకు నెలవైన కేరళలోని పర్యాటక ప్రదేశాలను వీక్షించాలనుకుంటున్నారా? తక్కువ ధరతోపాటు తక్కువ టైంలోనే ఎక్కువ ప్లేస్​లు చూడాలనుకుంటున్నారా? అయితే.. మీకో సూపర్ ఛాన్స్ ఇస్తోంది ఐఆర్​సీటీసీ టూరిజం. ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకుంటున్న వారి కోసం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా ఈ టూర్​ ఆపరేట్ చేస్తున్నారు. మరి ఏఏ ప్రదేశాలు చూడొచ్చు? ధర ఎంత? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

హైదరాబాద్​ నుంచి కేరళకు IRCTC టూరిజం CULTURAL KERALA-MONSOON MAGIC పేరుతో ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. మొత్తం ఈ టూర్​ 5 రాత్రులు, 6 పగళ్లు సాగనుంది. ఈ టూర్ లో కొచ్చి, కుమరకోమ్​, మున్నార్, త్రివేండ్రంలోని టూరిస్ట్ ప్రాంతాలను చూపిస్తారు.

ప్రయాణం ఇలా :

  • మొదటి రోజు హైదరాబాద్​లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి కొచ్చికి ఫ్లైట్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది. కొచ్చిలో దిగిన తర్వాత అక్కడ్నుంచి హోటల్​కు తీసుకెళ్తారు. తర్వాత కొచ్చిలోని ఫోర్ట్​ను సందర్శిస్తారు. హోటల్​లో లంచ్​ ఉంటుంది. సాయంత్రం మెరైన్ డ్రైవ్ ఉంటుంది. రాత్రి కొచ్చిలోనే డిన్నర్​ చేసి అక్కడే స్టే చేస్తారు.
  • రెండో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత కొచ్చి నుంచి మున్నార్ వెళ్తారు. మధ్యలో చీయప్పర వాటర్ ఫాల్స్(Cheeyappara Waterfalls)ను సందర్శిస్తారు. ఆ తర్వాత టీ మ్యూజియం చూస్తారు. రాత్రి మున్నార్​లోనే బస చేస్తారు.

అటు భగవత్​ దర్శనాలు - ఇటు బీచ్​లో సరదాలు - సముద్ర తీరానికి IRCTC అద్దిరిపోయే టూర్ ప్యాకేజీ! - IRCTC Hyderabad Karnataka Tour

  • మూడో రోజు Mattupetty డ్యామ్​కు వెళ్తారు. ఆ తర్వాత ఏకో పాయింట్ వ్యూ, కుండ్ల డ్యామ్ లేక్ చూస్తారు. రాత్రి మున్నార్​లోనే ఉంటారు.
  • నాలుగో రోజు మున్నార్ నుంచి కుమరకోమ్​కు వెళ్తారు. హోటల్​కు వెళ్లి ఫ్రెషప్ అయిన తర్వాత.. బ్యాక్ వాటర్ అందాలను వీక్షిస్తారు. రాత్రికి కుమరకోమ్​లో బస ఉంటుంది.
  • ఐదో రోజు త్రివేండ్రం బయల్దేరుతారు. Jatayu Earth Centre ను సందర్శిస్తారు. త్రివేండ్రంలోని పలు ప్రాంతాలను చూస్తారు. రాత్రి అక్కడే బస ఉంటుంది.
  • ఆరో రోజు త్రివేండ్రంలోని అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత Napier Museum, Azhimala Shiva Statueను చూస్తారు. రాత్రికి త్రివేండ్రం ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్​కు బయల్దేరుతారు. దీంతో టూర్​ ముగుస్తుంది.

ధరల వివరాలు ఇవే:

  • ఈ ప్యాకేజీ ధరలు చూస్తే Comfort క్లాస్​లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 47,700గా నిర్ణయించారు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 33, 800, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 32,700గా ఉంది.
  • 5 - 11 ఏళ్ల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.30,450, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.25,500, 2 నుంచి 4 సంవత్సరాల పిల్లలకు విత్​ అవుట్​ బెడ్​కు రూ.18,100 నిర్ణయించారు.
  • ఈ ప్యాకేజీ ఆగస్టు 13, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీని ప్రకటిస్తారు.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ఊటీ అందాల్లో విహరించండి - తక్కువ ధరకే IRCTC సూపర్ టూర్ ప్యాకేజీ! - IRCTC Ultimate Ooty Ex Hyderabad

"లేహ్​" అందాల వీక్షణ కోసం IRCTC సూపర్​ ప్యాకేజీ - ధర అందుబాటులోనే - వివరాలివే! - IRCTC Leh With Turtuk Package

ABOUT THE AUTHOR

...view details