IRCTC Punya Kshetra Yatra Package:దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు సహా ఇతర ప్రదేశాలను సందర్శించాలని చాలా మందికి ఉంటుంది. కానీ ఎలా వెళ్లాలో తెలియక పోవడం, డబ్బులు ఎక్కువవుతాయనే సందేహంతో చాలా మంది దానిని వాయిదా వేసుకుంటారు. అయితే ఇప్పుడు అలాంటి టెన్షన్ అక్కర్లేదు. కేవలం అందుబాటు ధరలోనే పలు ప్రదేశాలను చూసేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. అందులో భాగంగానే ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే వారికోసం "అయోధ్య - కాశీ: పుణ్యక్షేత్ర యాత్ర"పేరుతో అవకాశం కల్పిస్తోంది ఐఆర్‌సీటీసీ. మరి ఈ యాత్ర ఎప్పుడు మొదలవుతుంది? ధర ఎంత? ఏయే ప్రదేశాలు చూడొచ్చు? వంటి పూర్తి వివరాల కోసం ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.
ఈ టూర్ హైదరాబాద్ నుంచి మొదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్, భువనగిరి, జనగాం, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్లలో యాత్రికులు ఈ రైలు ఎక్కొచ్చు. ఈ యాత్రలో భాగంగా పూరీ, కోణార్క్, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్ వంటి పుణ్యక్షేత్రాలను చూడొచ్చు. ఈ యాత్ర 9 రాత్రులు, 10 పగళ్లు కొనసాగనుంది. టూర్ కంప్లీట్ అయిన తర్వాత తిరిగి ఇదే స్టేషన్ల మీదుగా ట్రైన్ హైదరాబాద్ చేరుకుంటుంది.
ప్రయాణం ఇలా సాగుతుంది:
- మొదటి రోజున మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా పుణ్యక్షేత్ర యాత్ర ప్రారంభమవుతుంది. భువనగిరి, జనగాం, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోటలో రైలు ఎక్కొచ్చు.
- రెండో రోజు తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం మీదుగా ప్రయాణించి ఉదయం 9 గంటలకు మాల్తీపాట్పూర్‌కు చేరుతుంది. అక్కడి నుంచి పూరీ వెళ్లాలి.
- ముందుగానే బుక్ చేసిన హోటల్‌లో బస ఉంటుంది. లంచ్ తర్వాత పూరీ జగన్నాథుని దర్శించుకుంటారు. ఆ రాత్రి పూరీలోనే స్టే ఉంటుంది.
- మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి ప్రపంచ ప్రసిద్ధికెక్కిన కోణార్క్‌లోని సూర్యదేవాలయాన్ని సందర్శించుకుంటారు.. తర్వాత మాల్తీపాట్పూర్ రైల్వేస్టేషన్ నుంచి గయకు ప్రయాణం స్టార్ట్ అవుతుంది.
శ్రావణమాసం స్పెషల్ : అరుణాచలం TO తంజావూర్ - అతి తక్కువ ధరకే IRCTC సూపర్ ప్యాకేజీ!
- నాలుగో రోజు ఉదయానికి గయ చేరుకుంటారు. అక్కడ ముందుగానే బుక్ చేసిన హోటల్‌లో ఫ్రెషప్ అవ్వాలి. మధ్యాహ్నం భోజనం తర్వాత విష్ణుపాద దేవాలయాన్ని దర్శించుకుంటారు. ఆ రాత్రికి అక్కడే బస ఉంటుంది.
- ఐదో రోజు ఉదయం గయ నుంచి వారణాసికి స్టార్ట్ అవుతారు. అక్కడ రైల్వే స్టేషన్‌కు చేరుకుని స్టే చేయడానికి సారనాథ్ చేరుకుంటారు. ఆ రాత్రికి అక్కడే బస ఉంటుంది.
- ఆరో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనంతరం ఆరోజంతా సైట్ సీయింగ్ ఉంటుంది. అందులో భాగంగా కాశీ విశ్వనాథ్ పుణ్యక్షేత్రం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవీ ఆలయాల దర్శనం ఉంటుంది. సాయంత్రం గంగా హారతిని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఆ రోజు రాత్రి వారణాసిలో బస ఉంటుంది.
- ఏడో రోజు వారణాసి నుంచి శ్రీరాముని జన్మస్థానమైన అయోధ్యకు చేరుకుంటారు. ఆ రోజు శ్రీరాముడు, హనుమంతుని ఆలయాలు దర్శించుకుంటారు. ఒకవేళ కుదిరితే సాయంత్రం సరయూ హారతిని వీక్షించి రాత్రి భోజనం తర్వాత ప్రయాగ్‌రాజ్‌కు స్టార్ట్ అవుతారు.
- ఎనిమిదో రోజు ఉదయం ప్రయాగ్‌రాజ్ చేరుకుంటారు. అక్కడ త్రివేణి సంగమాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి సికింద్రాబాద్‌కు రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది. తొమ్మిదో రోజు మొత్తం ట్రైన్ జర్నీ ఉంటుంది.
- పదో రోజు విజయనగరం, పెందుర్తి, దువ్వాడ, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, మధిర, ఖమ్మం, డోర్నకల్, మహబూబ్‌బాద్, వరంగల్, కాజీపేట, జనగాం, భువనగిరి, సికింద్రాబాద్ చేరుకోవటంతో యాత్ర పూర్తవుతుంది.