IOCL Apprentice Jobs 2024 : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), పైప్‌లైన్ డివిజన్లోని 5 రీజియన్లలో టెక్నికల్, నాన్-టెక్నికల్ ట్రేడుల్లోని 473 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- యూఆర్ - 251 పోస్టులు
- ఓబీసీ - 95 పోస్టులు
- ఈడబ్ల్యూఎస్ - 38 పోస్టులు
- దివ్యాంగులు - 20 పోస్టులు
- ఎస్టీ- 29 పోస్టులు
- ఎస్సీ - 60 పోస్టులు
- మొత్తం పోస్టులు - 473
ట్రేడ్ విభాగాలు
మెకానికల్, ఎలక్ట్రికల్, టీ అండ్ ఐ, హ్యూమన్ రిసోర్స్, అకౌంట్స్/ ఫైనాన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్
పైప్‌లైన్ రీజియన్స్
వెస్ట్రన్, నార్తర్న్, ఈస్ట్రన్, సదరన్, సౌత్ ఈస్ట్రన్ రీజియన్స్
విద్యార్హతలు
IOCL Apprentice Qualifications :అభ్యర్థులు 10+2 (ఇంటర్)తో పాటు ఆయా పోస్టులకు అనుగుణంగా ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మెకానికల్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేసినవారు కూడా ఈ పోస్టులకు అర్హులు. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
వయోపరిమితి
IOCL Apprentice Age Limit :అభ్యర్థుల వయస్సు 2024 జనవరి 12 నాటికి 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి.
అప్లికేషన్ ఫీజు
IOCL Apprentice Application Fee :అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ
IOCL Apprentice Selection Process :అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన చేసి, ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం
IOCL Apprentice Application Process :
- అభ్యర్థులు ముందుగా ఐవోసీఎల్ అధికారిక వెబ్సైట్ https://iocl.com/ ఓపెన్ చేయాలి.
- Careers సెక్షన్లోకి వెళ్లి IOCL Apprentice లింక్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు కొత్త పేజీ ఓపెన్ అయ్యి, రిజిస్ట్రేషన్ లింక్ కనిపిస్తుంది.
- ఈ లింక్‌పై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.
- తరువాత మీ అకౌంట్లోకి లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి.
- అప్లికేషన్లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- అన్ని వివరాలను మరోసారి చెక్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
IOCL Apprentice Apply Last Date :
- ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 2024 జనవరి 12
- ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 ఫిబ్రవరి 1
- అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ :2024 ఫిబ్రవరి 9 నుంచి 18 వరకు
- పరీక్ష తేదీ : 2024 ఫిబ్రవరి 18
రైల్వేలో 5696 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు - అప్లై చేయండిలా!
ఐటీఐ అర్హతతో 1646 రైల్వే ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!