తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'చిల్లర' సమస్యను తీర్చే మెషీన్​- ఫోన్‌తో స్కాన్ చేస్తే కాయిన్స్- ఎలా విత్​డ్రా చేయాలంటే? - QR BASED COIN VENDING MACHINE

దేశంలోనే తొలి 'క్యూఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మెషీన్' ప్రారంభం- చిల్లర సమస్యకు చెక్- యూపీఐతో ట్రాన్సాక్షన్ చేసి నాణేలు పొందే అవకాశం

First QR Based Coin Vending Machine in Kerala
First QR Based Coin Vending Machine in Kerala (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 26, 2024, 4:43 PM IST

Updated : Oct 26, 2024, 5:29 PM IST

First QR Based Coin Vending Machine :దుకాణం లేదా మార్కెట్​కు వెళ్లి ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు కొన్ని సార్లు చిల్లర సమస్య ఏర్పడుతుంది. దురాణదారుడి వద్ద చిల్లర లేకపోతే కస్టమర్లనే తీసుకురావాలని చెబుతుంటాడు. చిల్లర దొరకకపోవడం వల్ల కొన్ని సార్లు వాటిని కొనుగోలు చేయకుండానే తిరిగి రావాల్సి వస్తుంది. ఈ సందర్భం దాదాపు అందరికి ఏదో ఒక సమయంలో ఎదురయ్యే ఉంటుంది. ఇలాంటి చిల్లర సమస్యలను అరికట్టేందుకు దేశంలోనే మొదటి 'క్యూఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మెషీన్'ను కేరళలో ప్రారంభించారు. మరి అది ఎలా పని చేస్తుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కోజీకోడ్​లోని పుతియారాలోని ఫెడరల్ బ్యాంకులో 'క్యూఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మెషీన్' ను ప్రారంభించారు. డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు ఏటీఎంలు ఏవిధంగానైతే ఉన్నాయో, అదే విధంగా కాయిన్స్ తీసుకునేందుకు క్యూఆర్ కోడ్ వెండింగ్ మెషీన్ ఉపయోగపడుతుంది. ఈ మెషీన్​లో స్క్రీన్ పై కనిపించే క్యూఆర్ కోడ్​ను స్కాన్ చేయడం వల్ల కావాల్సినన్ని నాణేలను తీసుకోవచ్చు. మీ యూపీఐ ద్వారా డబ్బును చెల్లించి నాణేలు పొందవచ్చు. ఈ మెషిన్​లో 1,2,5,10 రూపాయలు అందుబాటులో ఉంటాయి.

'క్యూఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మెషీన్' అంటే ఏమిటి?
ఇది నగదు రహిత కాయిన్ డెలివరీ సిస్టమ్. ఈ మెషీన్లలో స్క్రీన్‌ పై ఉండే క్యూఆర్‌ కోడ్​ను స్కాన్‌ చేయడం ద్వారా కావాల్సిన నాణేలను పొందొచ్చు. యూపీఐ ద్వారా బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును చెల్లించి నాణేలు పొందొచ్చు. నాణేల కొరతను తగ్గించేందుకు ఈ మెషీన్ ఉపయోగపడుతుంది.

గతంలో కంటే భిన్నం
గతంలోనూ ఇలాంటి మెషీన్లు ఉన్నప్పటికీ, అవి నోట్లను స్వీకరించి మాత్రమే నాణేలను అందించేవి. కానీ క్యూఆర్ కోడ్ ఆధారిత వెండింగ్ మెషిన్​లో యూపీఐ చేసి నాణేలను ఈజీగా పొందొచ్చు. 2023లోనే క్యూఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మెషీన్లను తీసుకురావాలని ఆర్​బీఐ నిర్ణయించింది. ఈ క్రమంలో కోజీకోడ్​లోని ఫెడరల్ బ్యాంకులో దేశంలోనే 'క్యూఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మెషీన్' ప్రారంభమైంది.

ఎలా పని చేస్తుందంటే?

  • ముందుగా క్యూఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మెషీన్ వద్దకు వెళ్లి, అక్కడ స్క్రీన్ పై మీకు అవసరమైన చిల్లర మొత్తంపై క్లిక్ చెయ్యండి.
మనకు కావాల్సిన కాయిన్​ను సెలక్ట్ చేసుకోవాలి (ETV Bharat)
  • మీకు ఏ నాణేం అవసరమో దానిపై క్లిక్ చెయ్యండి. ఈ మెషిన్​లో స్క్రీన్‌ పై ఉండే క్యూఆర్‌ కోడ్‌ మీ యూపీఐతో స్కాన్‌ చేయండి.
క్యూఆర్‌ కోడ్​ను స్కాన్​ చేయాలి (ETV Bharat)
  • ట్రాన్సాక్షన్ పూర్తయిన తర్వాత నాణేలు మెషిన్ నుంచి బయటకు వస్తాయి.
మెషీన్​ నుంచి నాణేలు (ETV Bharat)

గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి డిజిటల్ చెల్లింపు యాప్​ల ద్వారా క్యూఆర్ కోడ్ ఆధారిత వెండింగ్ మెషిన్​లో నాణేలను విత్ డ్రా చేసుకోవచ్చు. ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నా ఈ మెషిన్​లో డబ్బులు తీసుకోవచ్చు. భారీ మొత్తంలో చిల్లర కావాలనుకునేవారిపై మాత్రం ఆంక్షలు విధించారు. దుకాణదారులు, బస్సు ప్రయాణికులు, విద్యార్థులు, కార్మికులకు ఈ మెషీన్లు ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంది.

Last Updated : Oct 26, 2024, 5:29 PM IST

ABOUT THE AUTHOR

...view details