తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jun 24, 2024, 11:13 AM IST

Updated : Jun 24, 2024, 11:28 AM IST

ETV Bharat / bharat

ఐక్యంగా పార్లమెంట్​కు ఇండియా కూటమి నేతలు- రాజ్యాంగ ప్రతులతో ఎంపీల నిరసనలు - Lok Sabha Session 2024

India Bloc protests In Parliament : 18వ లోక్​సభ సమావేశాల్లో ప్రొటెం స్పీకర్​గా బీజేపీ భర్తృహతి మహతాబ్​ నియమించడంపై ఇండియా కూటమి మండిపడింది. ఈ మేరకు పార్లమెంట్​లోని మహాత్మాగాంధీ విగ్రహం ఉన్న ప్రాంతంలో రాజ్యాంగ ప్రతులను పట్టుకుని ఇండియా కూటమి ఎంపీలు నిరసనలు తెలిపారు.

India Bloc Protests In Parliament
India Bloc Protests In Parliament (ANI)

India Bloc Protests In Parliament: 18వ లోక్​సభ సమావేశాల్లో ప్రొటెం స్పీకర్​గా బీజేపీ ఎంపీ భర్తృహతి మహతాబ్​ నియమించడంపై ఇండియా కూటమి నిరసనలు చేపట్టింది. ముందుగా విపక్ష ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంటు సముదాయంలోని పాత భవనం వద్ద కలుసుకున్నారు. అక్కడి నుంచి నూతన భవనం వరకు ర్యాలీగా వచ్చారు. మహాత్మాగాంధీ విగ్రహం ఉన్న ప్రాంతంలో రాజ్యాంగం చిరు ప్రతులను చేతపట్టుకుని కొంతసేపు నిరసన చేపట్టారు. బీజేపీ పార్లమెంటు సంప్రదాయాలను పాటించడం లేదని అందుకే ఈ నిరసనలు చేపట్టినట్లు ఇండియా కూటమి ఎంపీలు తెలిపారు.

ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. మోదీ ప్రజాస్వామ్య నిబంధనలన్నింటిని ఉల్లంఘిస్తున్నారని, అందుకే అన్ని పార్టీల నేతలు కలిసి ఒక్కతాటిపైకి వచ్చి నిరసలు తెలుపుతున్నామని అన్నారు. రాజ్యాంగంపై ప్రధాని మోదీ, అమిత్​ షా చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తున్నామని అందుకే ఈ విధంగా నిరసనలు తెలుపుతున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగంపై జరుగుతున్న దాడులను ఆపేందుకే మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ప్రతులతో నిరసనలు చేపట్టామని తెలిపారు.

ప్యానెల్​ నుంచి తప్పుకున్న ముగ్గురు సభ్యులు
ఇండియా కూటమి ముందు నుంచే ప్రొటెం స్పీకర్​గా భర్తృహరిని నియమిచడంపై అసంతృప్తిగానే ఉంది. ఎక్కువసార్లు లోక్‌సభకు ఎన్నికైన సీనియర్ సభ్యుడు, కాంగ్రెస్ ఎంపీ కె సురేష్‌ను కాదని బీజేపీ ఎంపీ భర్తృహరిని ఎంపిక చేయడాన్ని వ్యతిరేకించింది. జూన్​ 26న స్పీకర్ ఎన్నిక జరిగే వరకు ప్రొటెం స్పీకర్​కు సహయంగా ముగ్గురు విపక్ష సభ్యులను నియమించారు. వారిలో కాంగ్రెస్‌కు చెందిన కె సురేశ్‌, డీఎంకే ఎంపీ టీఆర్‌ బాలు, టీఎంసీ ఎంపీ సుదీప్‌ బందోపాధ్యాయ్‌ ఛైర్‌పర్సన్‌ ఆఫ్‌ ప్యానెల్​ సభ్యులుగా ఉన్నారు. ప్రొటెం స్పీకర్ నియమకం నిరసనగా ఆ ముగ్గురు సభ్యులు ఛైర్‌పర్సన్‌ ఆఫ్‌ ప్యానల్‌ నుంచి తప్పుకున్నారు.

ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మెహతాబ్ ఎంపికను సమర్థించుకున్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు ఛైర్‌పర్సన్‌ ఆఫ్‌ ప్యానెల్‌ సభ్యుడైన సుదీప్‌ బందోపాధ్యాయ్‌ను కలిశారు. ఇండియా కూటమి నిర్ణయం మేరకు తాను ప్యానెల్‌లో కొనసాగలేనంటూ రిజిజు విజ్ఞప్తిని ఆయన సున్నితంగా తిరస్కరించారు. భర్తృహరి మెహతాబ్ వరసగా ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నిక కాగా కాంగ్రెస్‌కు చెందిన కె.సురేష్‌ 1998, 2004లో ఓడిపోయినట్లు కేంద్రమంత్రి చెప్పారు.

'మీ ప్రేమే నన్ను కాపాడింది'- వయనాడ్ ప్రజలకు రాహుల్ ఎమోషనల్​ లెటర్​ - Rahul Gandhi Emotional Letter

పరీక్ష ముందురోజే ఫోన్​కు PDF- నీట్ పేపర్ లీకేజీపై CBI దర్యాప్తు ముమ్మరం- అధికారులపై స్థానికులు దాడి - NEET UG 2024 Paper Leak

Last Updated : Jun 24, 2024, 11:28 AM IST

ABOUT THE AUTHOR

...view details