తెలంగాణ

telangana

ETV Bharat / bharat

RG కర్​ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్​పై IMA సస్పెన్షన్ వేటు- సీబీఐ ముమ్మర దర్యాప్తు - Kolkata Doctor Case - KOLKATA DOCTOR CASE

Kolkata Doctor Case IMA : కోల్​కతా ఆర్​జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది. ఈ మేరకు IMA నిర్ణయం తీసుకుంది.

Kolkata Doctor Case IMA
Kolkata Doctor Case IMA (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2024, 7:05 PM IST

Updated : Aug 28, 2024, 7:25 PM IST

Kolkata Doctor Case IMA : జూనియర్ డాక్టర్​ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ, కోల్​కతా ఆర్​జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది. ఐఎంఏ కోల్‌కతా బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఘోష్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అనంతరం ఆర్డర్​ కాపీని విడుదల చేసింది.

"హత్యాచార ఘటనను ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌వి అశోకన్ నేతృత్వంలోని కమిటీ సుమోటోగా స్వీకరించింది. ఐఎంఏ ప్రధాన కార్యదర్శితో కలిసి బాధితురాలి తల్లిదండ్రులను కలిసింది. ఆ సమయంలో సందీప్ ఘోష్​ తన బాధ్యతను విస్మరించారని వారు చెప్పారు. ఐఎంఏ బంగాల్​ రాష్ట్ర శాఖతో పాటు కొన్ని వైద్య సంఘాలు మీ(సందీప్ ఘోష్​) పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అందుకే క్రమశిక్షణా చర్యల కమిటీ మీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది" అని ఆర్డర్​ కాపీలో ఐఎంఏ పేర్కొంది.

ఏఎస్​ఐ అనూప్ దత్తాకు లై డిటెక్టర్ పరీక్ష!
మరోవైపు, హత్యాచార ఘటనపై సీబీఐ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. తాజాగా కోల్‌కతా పోలీసు విభాగానికి చెందిన ఏఎస్​ఐ అనూప్ దత్తాకు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించింది. హత్యాచారానికి పాల్పడిన నిందితుడు సంజయ్‌ రాయ్‌కు, అనూప్ దత్తాకు మధ్య ఉన్న సంబంధాలను తెలుసుకునేందుకు లై డిటెక్టర్ పరీక్షను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కోల్‌కతా పోలీసుల సంక్షేమ కమిటీలో పనిచేసిన అనూప్ దత్తా, ట్రాఫిక్ పోలీసు వాలంటీర్‌గా పనిచేసిన సంజయ్‌ రాయ్‌కు గతంలో అనేక సార్లు సహాయపడినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్యాచారం గురించి నిందితుడు దత్తాకు సమాచారమిచ్చి, నేరం నుంచి తప్పించుకునేందుకు ఏమైనా సహాయం కోరాడా అని తెలుసుకునేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని అధికారులు వెల్లడించారు.

అనుమానితులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో నిజమెంత ఉందో గుర్తించడానికి పాలిగ్రాఫ్ పరీక్ష ఉపయోగపడుతుంది. మానసిక స్పందనలు, గుండె కొట్టుకునే వేగం, శ్వాస విధానం, చెమట, రక్తపోటును పర్యవేక్షించడం ద్వారా దర్యాప్తు అధికారులు వారి స్పందనలలో తేడాలను గుర్తిస్తారు. హత్యాచార నేర దర్యాప్తును సీబీఐ తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వత ఇప్పటివరకు ఏడుగురికి లై డిటెక్టర్ పరీక్షలను నిర్వహించింది. వారిలో నిందితుడు సంజయ్‌ రాయ్‌తో పాటు ఆర్​జీ కర్ వైద్యకళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఉన్నారు. హత్యాచారం జరిగిన సమయంలో బాధితురాలితో పాటు విధుల్లో ఉన్న నలుగురు వైద్యులకు కూడా సీబీఐ లై డిటెక్టర్ పరీక్షను నిర్వహించింది.

'అప్పుడు అక్కడ లేను- నేను వెళ్లే సరికే ఆమె చనిపోయింది'- కోల్​కతా కేసులో ట్విస్ట్! - Kolkata Doctor Case

హత్యాచారం కేసు ప్రధాన నిందితుడికి లై డిటెక్షన్‌ టెస్ట్‌- మాజీ ప్రిన్సిపల్ ఆస్తులపై సీబీఐ నజర్​! - Kolkata Doctor Case

Last Updated : Aug 28, 2024, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details