తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇంట్లోనే హైదరాబాదీ​ "ఇరానీ చాయ్​" - ఈ టిప్స్​ పాటిస్తే జిందగీ ఖుష్ అయ్యే టీ ఆస్వాదిస్తారు! - How to Prepare Irani Chai at Home - HOW TO PREPARE IRANI CHAI AT HOME

Irani Chai Preparation : ఇరానీ చాయ్​.. చాలా మందికి దీని పేరు చెబితేనే ఎక్కడ లేని రిలీఫ్​ వచ్చేస్తోంది. ఇక తాగితే మైమరచిపోవాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది మరి! అలాంటి ప్రత్యేకమైన రుచి కలిగిన ఇరానీ చాయ్​ను ఇంట్లో తయారు చేయాలనుకుంటున్నారా? అది కూడా హోటల్​ స్టైల్లో ప్రిప్రేర్​ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

Irani Chai Preparation
Irani Chai Preparation (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 7, 2024, 12:27 PM IST

Updated : Aug 9, 2024, 3:39 PM IST

Hyderabad Style Irani Chai Making Process: హైదరాబాద్​లో దమ్​ బిర్యానీ ఎంత ఫేమసో.. ఘుమఘుమలాడే ప్రత్యేక వాసన, రుచి కలిగి ఉండే ఇరానీ చాయ్‌ అంతే ఫేమస్​. పింగాణీ కప్పు, సాసర్‌లో పొగలు కక్కుతున్న చాయ్‌ తాగుతుంటే ఆ ఫీలింగ్​ వేరే లెవల్​. రోజులో ఒక్కసారైనా దీనిని తాగని వారని వేళ్ల మీద లెక్కేసుకోవచ్చు. అంతగా పాపులర్​ ఈ చాయ్​. అంతేనా మహా నగరానికి వచ్చే పర్యాటకులు, అతిథులు తప్పనిసరిగా చాయ్‌ రుచి చూస్తారు. నలుగురు స్నేహితులు కలిసి మాట్లాడుకుంటున్నారంటే చేతిలో చాయ్‌ గ్లాసు ఉండాల్సిందే. మరి ఇంత ఫేమస్​ అయిన ఇరానీ చాయ్​ను ఇంట్లో ఎప్పుడైనా తయారు చేశారా? అబ్బే మాకు రాదంటారా? నో టెన్షన్​.. మేము చెప్పే ఈ టిప్స్​ పాటిస్తే హోటల్​ స్టైల్​ పక్కా గ్యారెంటీ! మరి దీనిని ఎలా ప్రిపేర్​ చేయాలి? అసలు ఇరానీ చాయ్​ వెనక ఉన్న చరిత్ర ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఇరానీ చాయ్​ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:

  • పాలు - అర లీటర్​
  • కండెన్స్​డ్​ మిల్క్​ - 1 టేబుల్​ స్పూన్​
  • యాలకుల పొడి పావు టీ స్పూన్​
  • టీ పొడి - 3 టేబుల్​ స్పూన్లు
  • పంచదార - 2 టేబుల్​ స్పూన్లు
  • నీరు - 2 కప్పులు(400 ml)

ఇరానీ చాయ్​ తయారీ విధానం:

  • ముందుగా స్టవ్​ ఆన్​ చేసి గిన్నె పెట్టి అందులో నీళ్లు, టీ పొడి, పంచదార, యాలకుల పొడి వేసి గిన్నె పై భాగం అంచులను గోధుమపిండి ముద్ద లేదా క్లాత్​ తీసుకుని సీల్​ చేసి మూత పెట్టి.. మంటను సిమ్​లో పెట్టి బాగా మరిగించుకోవాలి. ఇలా సీల్​ చేయడం వల్ల డికాషన్​ మరుగుతున్నప్పుడు ఆవిరి బయటకు వెళ్లకుండా ఉంటుంది. దీంతో చాయ్​ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాయ్ టేస్టీగా రావాలంటే చాయ్ పత్తీ కూడా బాగుండాలి. అందుకోసం క్వాలిటీ కలిగిన చాయ్ పత్తీని మాత్రమే ఉపయోగించాలి.
  • మరోపక్క ఇంకో స్టవ్​ ఆన్​ చేసి గిన్నె పెట్టుకుని పాలు పోసి అందులో కండెన్స్​డ్​ మిల్క్​ వేసి బాగా మరిగించుకోవాలి. సాధారణంగా డికాషన్​, పాలను ఎంత ఎక్కువ సేపు మరిగిస్తే ఈ చాయ్​ అంత టేస్టీగా ఉంటుంది.
  • ఇప్పుడు డికాషన్​ రెడీ అయిన తర్వాత దానిని ఎంత కావాలో అంత జల్లెడలో పోసుకోవాలి.
  • ఆ తర్వాత టీ గ్లాస్​ తీసుకుని అందులో డికాషన్​ పోసుకోవాలి. ఆ తర్వాత ఆ డికాషన్​లో పాలు పోసి తాగితే సరి. ఎంతో ఘుమఘుమలాడే ఇరానీ చాయ్​ రెడీ.

టిప్స్​ : తీసుకున్న క్వాంటిటీని బట్టి పాలు, డికాషన్​ మరిగించుకోవాలి. పైన చెప్పిన వాటిలో డికాషన్​ను అరగంట సేపు లో-ఫ్లేమ్​లో పెట్టి మరిగించుకోవాలి. పాలను ఓ 20 నిమిషాలు మరిగించుకోవాలి.

Last Updated : Aug 9, 2024, 3:39 PM IST

ABOUT THE AUTHOR

...view details