How To Use Induction Stove :నేటి కాలంలో ఇండక్షన్ స్టౌల వాడకం పెరిగిపోయింది. పెరుగుతున్న గ్యాస్ ధరల కారణంగా వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా గ్యాస్ స్టవ్ కంటే ఇండక్షన్ ఉపయోగించడం చాలా ఈజీ. ఇండక్షన్ మీద వంటలు కూడా త్వరగా పూర్తవుతాయి. పైగా సమయం కూడా ఆదా అవుతుంది. అయితే, మామూలు గ్యాస్ స్టౌతో పోలిస్తే.. ఇండక్షన్ స్టౌ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల చాలాకాలంపాటు ఇండక్షన్ స్టౌ చక్కగా పని చేస్తుందని అంటున్నారు. మరి ఆ జాగ్రత్తలు ఏంటో ఈ స్టోరీ చూద్దాం..
గ్యాస్ స్టౌ పక్కన పెట్టకూడదు :కొంతమంది ఇండక్షన్ స్టౌని గ్యాస్ స్టౌ పక్కన పెడుతుంటారు. అయితే ఇలా పెట్టకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. ఎప్పుడైనా గ్యాస్ లీకైతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని చెబుతున్నారు. కాబట్టి, కిచెన్‌లోనే వేరేచోట ఇండక్షన్ స్టౌని పెట్టాలని సూచిస్తున్నారు.
తుప్పు, జిడ్డు మరకలతో ట్యాప్స్ అసహ్యంగా ఉన్నాయా? - ఇలా చేస్తే కొత్తవాటిలా మెరిసిపోతాయి!
మెటల్ టేబుల్ పైన పెట్టకండి:ఇండక్షన్ స్టౌ కరెంట్‌తో పని చేస్తుంది కాబట్టి దీనిని మెటల్ టేబుల్ పైన పెట్టకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. ఇలా పెట్టడం వల్ల షాక్ కొట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి దీనిని వీలైనంత వరకు చెక్క టేబుల్‌పై పెట్టడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే సెరామిక్ టైల్స్, సిమెంట్ ఫ్లోర్ పైన కూడా పెట్టుకోవచ్చంటున్నారు.