తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఓ వైపు వర్షం.. మరోవైపు సండే : "అద్దిరిపోయే నాటుకోడి పులుసు" ఇలా ప్రిపేర్ చేయండి! - యమ్మీ యమ్మీగా జుర్రుకోవాల్సిందే! - How to Prepare Natu Kodi Pulusu

Natu Kodi Pulusu: ఓ పక్క వర్షం.. మరో పక్క సండే. ఇంకేముంది ఈ రెండింటి కాంబినేషన్​లో అద్దిరిపోయే వంటకం "నాటుకోడి పులుసు". మసాలాలు దట్టంగా పట్టించి వండి.. వేడి వేడిగా తింటే.. "నా సామి రంగా" అనాల్సిందే. అంతేనా ఘాటెక్కించే రుచితో 'సర్ది' కూడా తుడుచుపెట్టుకు పోద్ది. మరి ఈ సండే స్పెషల్​గా మీరూ నాటుకోడి పులుసు ట్రై చేస్తారా?

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 20, 2024, 5:10 PM IST

How to Prepare Natu Kodi Pulusu: నాటుకోడి పులుసు.. ఈ పేరు వింటే చాలా మంది నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. నిజానికి దీని టేస్ట్​ వేరే లెవల్​. కూర, వేపుడు, పులుసు, పలావ్, బిర్యానీ ఏది చేసినా రుచి అద్దిరిపోవాల్సిందే. అలా తింటుంటే ఇలా నోట్లోకి జారుకుంటూ వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడా.. బ్రాయిలర్​ కోళ్లు అలవాటు అయ్యి.. నాటుకోళ్లను పక్కకు పెడుతున్నారు కానీ.. సరైన రీతిలో వండుకుని తింటే నాటుకోడి మజానే వేరు. పైగా ఇప్పుడు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ టైంలో నాటుకోడి తింటే.. "ఆహా" అనాల్సిందే. వండటం మాకు రాదు అంటారా? టెన్షన్​ అక్కర్లేదు. ఎలా చేయాలో మేము నేర్పిస్తాం. ఈ పద్ధతిలో కుక్​ చేస్తే ఇక మీకు తిరుగుండదు. మరి లేట్​ చేయకుండా రెసిపీ చదివేయండి..

నాటుకోడి పులుసు చేయడానికి కావాల్సిన పదార్థాలు:

  • నాటుకోడి ముక్కలు - 1 kg
  • పసుపు - అర టేబుల్​ స్పూన్​
  • నూనె - సరిపడా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • అల్లం వెల్లులి పేస్ట్ - 2 టేబుల్​ స్పూన్లు
  • ధనియాలు - రెండు టేబుల్​ స్పూన్లు
  • లవంగాలు - 8
  • యాలకలు - 5
  • దాల్చిన చెక్క - కొద్దిగా
  • ఎండుకొబ్బరి ముక్కలు - పావు కప్పు
  • గసగసాలు - 1 టేబుల్​ స్పూన్​
  • బిర్యానీ ఆకు - 2
  • మిరియాలు - అర టీ స్పూన్​
  • కారం - రుచికి సరిపడా
  • ఉల్లిపాయలు - 2(మీడియం సైజ్​)
  • కరివేపాకు - 2 రెబ్బలు
  • పచ్చిమిర్చి - 3
  • వేడినీళ్లు - ముప్పావు లీటర్​
  • టమాటలు - 2
  • నిమ్మకాయ - 1
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

సండే స్పెషల్‌ - చికెన్ ఫ్రై విత్‌ మామిడికాయ పచ్చిపులుసు - కాంబినేషన్ అద్దిరిపోద్ది - మీరూ ఓ సారి ట్రై చేయండి!

తయారీ విధానం:

  • ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటలు సన్నగా కట్​ చేసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే నిమ్మకాయను పిండి రసాన్ని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని అందులో నాటుకోడి ముక్కలు వేసుకోవాలి. ఆ ముక్కల్లో కొద్దిగా ఉప్పు, పసుపు, ఒక టేబుల్​ స్పూన్​ అల్లం వెల్లులి పేస్ట్​, కొద్దిగా నూనె వేసి.. ముక్కలకు పట్టించి కనీసం 3 గంటలైనా నానబెట్టాలి.
  • మూడు గంటల తర్వాత మసాలా కోసం స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి.. ధనియాలు, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకలు, దాల్చిన చెక్క, మిరియాలు, ఎండుకొబ్బరి ముక్కలు వేసి మంట సిమ్​లో పెట్టి మసాలాలు మంచి వాసన వచ్చేవరకు దోరగా వేయించాలి. ఆ తర్వాత గసగసాలు వేసి ఒకసారి కలిపి వెంటనే స్టవ్​ ఆఫ్​ చేయాలి.
  • మసాలాలు పూర్తిగా చల్లారిన మిక్సీ జార్​లో వేసుకుని మెత్తని పొడి చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పెద్ద గిన్నె పెట్టి.. ఆరు టేబుల్​ స్పూన్లు నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొద్దిగా ఉప్పు వేసి పచ్చి వాసన పోయి బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి.

వీకెండ్​ స్పెషల్​ - చింతచిగురు మటన్​ ! ఇలా చేస్తే సూపర్​ అనాల్సిందే!

  • ఆ తర్వాత అందులో మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి వేయించుకోవాలి. తర్వాత టమాట ముక్కలు వేసి కలపాలి. టమాట ముక్కలు మెత్తబడి నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి.
  • ఆ తరువాత సరిపడా కారం వేసి కొద్దిగా నీళ్లు వేయించుకోవాలి. నీళ్ల పోసి వేపితే కారం మాడదు.
  • కారం మగ్గి.. నూనె పైకి తేలిన తరువాత మూడు గంటలు నానబెట్టిన చికెన్ ముక్కలు వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా హై ఫ్లేమ్ మీద వేయించుకోవాలి.
  • ఓ పది నిమిషాల తర్వాత ముక్కలు ఉడికి.. నూనె పైకి తేలిన తరువాత ముప్పావు లీటర్​ వేడి నీళ్లు పోసి కలిపుకుని.. ఆ స్టేజ్​లో ఉప్పు చూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే రుచికి సరిపడా వేసుకోవాలి.
  • ఆ తర్వాత మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద ముక్క మెత్తబడేదాకా ఉడికించుకోవాలి.
  • సుమారుగా 35 నుంచి 40 నిమిషాలు చికెన్​ 80% ఉడుకుతుంది(ఒకవేళ చికెన్​ ఎక్కువ తీసుకుంటే టైమ్​ ఎక్కువ పడుతుంది). ఆ తర్వాత ముందే ప్రిపేర్​ చేసుకున్న మసాలాలు వేసి కలిపి మూతబెట్టి నూనె పైకి తేలేదాకా ఓ 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి
  • నూనె పైకి తేలిన తరువాత చివరగా నిమ్మకాయ రసం, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోవడమే.
  • అన్నంతో అయినా సరే.. జొన్న రొట్టె, చపాతీ, గారెలు.. ఇలా కాంబినేషన్​ ఏదైనా సరే.. అద్భుతమైన రుచిని ఆస్వాదించడం గ్యారెంటీ.

సండే స్పెషల్ : జింజర్ పెప్పర్ చికెన్ రెసిపీ - ఆహా ఏమి రుచి అంటారంతే!

చికెన్​ రెగ్యులర్​గా వండేస్తున్నారా? - ఈ సండే ఇలా చేయండి - కమ్మగా, కారంగా!

ABOUT THE AUTHOR

...view details