తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నోట్లో వేస్తే కరిగిపోయే నేతి బొబ్బట్లు - ఇంటి వద్దే ఇలా చేసుకోండి!

How to Make Puran Poli : బొబ్బట్లు.. ఈ పేరు చెబితేనే చాలు చాలా మందికి నోరూరిపోతుంది. కానీ, టైమ్ ఎక్కువ పడుతుందని వీటిని చేసుకోవడానికి కొందరు అంతగా ఆసక్తి చూపరు. ఇంకొందరు వీటిని ఎలా తయారు చేసుకోవాలో తెలియక ఆగిపోతారు. అలాంటి వారు చాలా సులభంగా ఇంటి వద్దే నోరూరించే పూరన్ పోలీలను చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Bobbatlu
Puran Poli

By ETV Bharat Telugu Team

Published : Mar 1, 2024, 2:54 PM IST

How to Prepare Healthy Puran Poli :మనలో చాలా మంది తీపితో చేసిన వంటకాలు ఎంతో ఇష్టంగా తింటారు. అందులో ముఖ్యంగా బొబ్బట్లు. వీటిని పూరన్ పోలీలు, హోలిగే, పోలాలు, భక్ష్యాలూ.. ఇలా రకరకాలుగా పిలుస్తారు. సాధారణంగా వీటిని మహారాష్ట్రీయులు.. ఉగాది, గణేష్ చతుర్థి, గుడి పడ్వా సమయంలో ఎక్కువగా తయారు చేస్తారు. అయితే, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దీన్ని కొన్ని పండగల టైమ్​లో ఎంతో ఇష్టంగా చేసుకుంటుంటారు. అంతేకాకుండా తినాలని అనిపించినప్పుడు కూడా చేసుకుంటారు. అయితే కొందరు బొబ్బట్లు(Puran Poli) చేయడానికి ఎక్కువ టైమ్ పడుతుందని బయట నుంచి తెప్పించుకుంటుంటారు. అలాంటి వారు, కొత్తగా చేయాలనుకునే వారు కూడా ఇంటి వద్దే చాలా ఈజీగా వీటిని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇక నోరూరించే బొబ్బట్లు ఎలా తయారీ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు :

  • పచ్చి శనగ పప్పు- 1 కప్పు
  • నెయ్యి - సరిపడా
  • బెల్లం తురుము - 1 కప్పు
  • యాలకుల పొడి - 1/2 టీస్పూన్
  • ఉప్పు - చిటికెడు
  • మైదా లేదా గోధుమ పిండి - 1 కప్పు
  • నూనె - 1 టీస్పూన్​

Mysore Pak Recipe: ఇంట్లోనే సింపుల్​గా మైసూర్​పాక్​ తయారీ!

పూరన్ పోలీ తయారీ విధానం :

  • ముందుగా మీరు ఒక గిన్నెలో శనగపప్పును తీసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఓ గిన్నెలో గోధుమ పిండి లేదా మైదా పిండి తీసుకుని అందులో చిటికెడు ఉప్పు, కొద్దిగా నూనె వేసి కలుపుకోవాలి. తర్వాత సరిపడా నీళ్లు పోసి చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. అందులోకి ఓ నాలుగు టేబుల్​ స్పూన్ల నెయ్యి వేసి పిండిని మరోసారి కలిపి మూతపెట్టి కాసేపు పక్కన పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత నానబెట్టిన శనగపప్పును ప్రెషర్ కుక్కర్​లో వేసి రెండు కప్పుల నీరు పోసి 3-4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించాలి. తర్వాత నీళ్లు వడకట్టాలి.
  • ఇప్పుడు మిక్సీజార్​లో ఉడికించిన పప్పుతో పాటు బెల్లం తురుము వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక గ్రైండ్​ చేసిన పేస్ట్​ వేసి చిన్న మంట మీద ఓ 5 నిమిషాలు కలుపుతూ, అడుగు మాడకుండా చూసుకోవాలి.
  • ఇప్పుడు యాలకుల పొడి యాడ్ చేసి బాగా కలుపుకోని స్టవ్​ ఆఫ్​ చేసుకోవాలి.
  • మిశ్రమం చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు చపాతి పిండిని చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఓ ఉండ తీసుకుని కొద్దిగా అరచేతిలోనే ఒత్తుకోవాలి. అందులోకి శనగపప్పు, బెల్లం ఉండను పెట్టి క్లోజ్​ చేసుకోవాలి.
  • ఆ తర్వాత పాలిథిన్​ కవర్​ లేదా అరిటాకు తీసుకుని నెయ్యి రాసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసుకున్న బాల్​ను తీసుకుని చిన్నగా పూరీలుగా చేతితో ఒత్తుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ మీద పాన్‌ పెట్టి నెయ్యి రాసుకోవాలి. తర్వాత బొబ్బట్లు వేసి నెయ్యి రాసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి.
  • అంతే నోరూరించే తియ్యతియ్యని పూరన్ పోలీలూ సిద్ధం!

టిప్స్​: బొబ్బట్లు చేయడానికి చాలా మంది మైదా పిండిని వాడతారు. కానీ, అది ఆరోగ్యానికి మంచిది కాదు. గోధుమ పిండిని వాడడం వల్ల రుచిలో ఏమీ తేడా రాదు.

Dussehra Special Food: తియ్యని రాజ్‌భోగ్‌.. నోరూరించే పూరన్‌ పోలీ

ABOUT THE AUTHOR

...view details