How To Make Vankaya Dum Biryani Recipe : బిర్యానీ అనగానే చాలా మందికి చికెన్, మటన్, గుడ్లతో చేసిన దమ్ బిర్యానీలే గుర్తుకు వస్తుంటాయి. అయితే, ఎప్పుడూ బిర్యానీ నాన్‌వెజ్‌తో కాకుండా.. కొత్తగా వంకాయలతో ట్రై చేయండి. ఈ వంకాయ దమ్ బిర్యానీ ఒక్కసారి ఇంట్లో ట్రై చేశారంటే.. మళ్లీ మళ్లీ చేసుకోవడం పక్కా. ఎందుకంటే, చాలా తక్కువ సమయంలోనేఘుమఘుమలాడేబిర్యానీ రెడీఅయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం నోరూరించే.. టేస్టీ వంకాయ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ స్టోరీలో చూద్దాం పదండి!
వంకాయ బిర్యానీ రెడీ చేయడానికి కావలసిన పదార్థాలు :
- బాస్మతి రైస్ - రెండు కప్పులు
- వంకాయలు - ఆరు
- కారం - రెండు స్పూన్లు
- పసుపు - అర స్పూన్
- జీలకర్ర పొడి - ఒక స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- గరం మసాలా - అర స్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర స్పూన్
- ధనియాలు - ఒకటిన్నర స్పూన్
- పెరుగు - అర కప్పు
- నిమ్మరసం - రెండు స్పూన్లు
- లవంగాలు - ఐదు
- కొత్తిమీర తరుగు - అరకప్పు
- యాలకులు - మూడు
- పుదీనా తరుగు - అరకప్పు
- బిర్యానీ ఆకులు - రెండు
- షాజీరా - అర స్పూన్
- దాల్చిన చెక్క - రెండు ముక్కలు
- ఉల్లిపాయలు - రెండు
- నూనె -సరిపడా
Fish Food Festival In Telangana : ఆ చేపల పులుసు.. ఆహా అదిరింది బాసూ
వంకాయ బిర్యానీ తయరీ విధానం :
- బాస్మతీ బియ్యాన్ని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
- వంకాయలను గుత్తి వంకాయ కూర కోసం ఎలా నిలువుగా కోసుకుంటారో అలా చేసి.. ఆయిల్‌లో సన్నని మంట మీద డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలకు కూడా సన్నగా కట్ చేసి ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు వంకాయ బిర్యానీ మసాలా కోసం ఒక గిన్నెలో పెరుగు, సరిపడినంత ఉప్పు, కారం, జీలకర్రపొడి, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, నిమ్మరసం, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు ఈ మసాలా మిశ్రమంలో డీప్ ఫ్రై చేసుకున్న వంకాయలను వేసి కలిపి 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
- తర్వాత స్టవ్ మీద ఓ గిన్నె పెట్టి రైస్‌ను ఉడికించుకోవడానికి సరిపడా నీళ్లు పోసి.. అందులో కొద్దిగా ఉప్పు, యాలకులు, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, షాజీరా, లవంగాలు వేసి మరిగించుకోవాలి.
- నీళ్లు మరుగుతున్నప్పుడు బాస్మతీ బియ్యాన్ని వేసి 70 శాతం ఉడికించుకుని నీళ్లను వడకట్టి రైస్ పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు బిర్యానీ వండడానికి మందపాటి బేస్ ఉన్న గిన్నెను తీసుకోవాలి.
- అందులో వంకాయ బిర్యానీ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఆపైన ఉడికించి వడకట్టిన బాస్మతీ బియ్యాన్ని వేసుకోవాలి. ఆపై ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీరా, పుదీనా వేసి ఒక 15 నిమిషాలు సన్నని మంటమీద దమ్ పెట్టుకోవాలి.
- అంతే ఇలా సింపుల్‌గా వంకాయ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడిగా తింటే ఈ బిర్యానీ టెస్ట్ అదిరిపోతుంది. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి!
ఆ చేపల పులుసు.. ఆహా అదిరింది బాసూ
చికెన్ కూరలు.. కమ్మగా, కారంగా..!