తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రపంచంలో నెంబర్-2 బెస్ట్ స్వీట్​గా మన రసమలై - ఇలా ఈజీగా ప్రిపేర్ చేయండి!

Rasmalai Recipe Preparation : భారతీయుల ఫేవరెట్ స్వీట్​గా పేరొందిన రసమలై స్వీట్.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ చీజ్ డెజర్ట్​లలో సెకండ్​ ప్లేస్​లో నిలిచింది. వరల్డ్​ నెంబర్ 2 ప్లేస్​లో దక్కించుకుందంటే.. ఇది ఎంత టేస్టీగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మరి.. అంతటి ఘనత సాధించిన రసమలైని ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలాగో మీకు తెలుసా?

Rasmalai Recipe Preparation
Rasmalai

By ETV Bharat Telugu Team

Published : Mar 18, 2024, 2:00 PM IST

Rasmalai Second Best Cheese Dessert in The World : భారతీయ తీపి వంటకం రసమలై.. ప్రపంచంలోనే అత్యుత్తమ చీజ్ డెజర్ట్‌లలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రముఖ ట్రావెల్, ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రకటించిన వరల్డ్ బెస్ట్​ చీజ్ డెజెర్ట్స్ జాబితాలో.. రసమలైకి వరల్డ్ నెంబర్ 2 పొజిషన్ దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్వీట్ లవర్స్ ఈ రసమలైని.. హోలీ, దివాళి సమటాల్లో ఎక్కువ ఇష్టంగా తీసుకుంటారు. అయితే.. ఈ స్వీట్​ను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలుసా?

రసమలై తయారీకి కావాల్సిన పదార్థాలు :

2 లీటర్ల పాలు

3 కప్పుల చక్కెర

1/2 టీస్పూన్ కుంకుమపువ్వు

2 టేబుల్ స్పూన్ల వాటర్

1 టేబుల్ స్పూన్ తరిగిన పిస్తా ముక్కలు

1 టేబుల్ స్పూన్ తరిగిన బాదం ముక్కలు

1 1/2 లీటర్ వేడినీరు

1/2 టీస్పూన్ పొడి పచ్చి యాలకులు

2 టేబుల్ స్పూన్ల నిమ్మ రసం.

గులాబ్ జామ్ బజ్జీ తింటావా బ్రో

రసమలై తయారు చేసుకునే విధానం :

మీరు ఈ స్వీట్ డెజర్ట్ కోసం ముందుగా రస​మలై ఉండలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం ఒక లోతైన అడుగు భాగం ఉన్న సాస్పాన్ బౌల్​ తీసుకొని.. అందులో 1 1/2 లీటర్ల పాలను పోసి అధిక మంట మీద మరిగించాలి.

ఆపై మంటను ఆఫ్ చేసి వేడి పాలలో నిమ్మరసాన్ని కలపాలి. దాంతో పాలు విరుగుతాయి. అప్పుడు ఒక మస్లిన్ గుడ్డను తీసుకొని అదనపు నీటిని తొలగించి మిగిలిన ఘన పదార్థాలను గుడ్డలో గట్టిగా కట్టాలి. దీన్ని 15-20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

ఆ తర్వాత ఘన పదార్థాన్ని మెత్తగా పిండి మాదిరిగా తయారుచేసుకోవాలి. తర్వాత ఆ పిండితో చిన్న చిన్న ఉండలు ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడు వాటిని తడి గుడ్డతో కప్పి ఉంచి చక్కెర సిరప్ సిద్ధం చేసుకోవాలి.

అందుకోసం మీడియం మంట మీద కడాయి ఉంచి, దానిలో 1 1/2 లీటర్ వేడి నీటితో పాటు 2 కప్పుల చక్కెరను వేసుకొని షుగర్ పూర్తిగా కరిగే వరకు ఆ మిశ్రమాన్ని మరిగించుకోవాలి. అది కరిగి చిక్కగా పాకంలా మారాక.. అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసమలై ఉండలను వేసి 10 నుంచి 15 నిమిషాలు మరిగించాలి. దాంతో ఉండల పరిమాణం రెట్టింపు అవ్వడంతో పాటు మెత్తగా అవుతాయి.

ఇప్పుడు రస్​మలై జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం ఒక పాన్​లో మిగిలిన పాలను తీసుకొని మరిగించాలి. పాలు మరిగాక అందులో 1 కప్పు చక్కెర, కుంకుమపువ్వు యాడ్ చేసుకోవాలి. చిన్న మంటపై ఓ పదినిమిషాలు మరిగించి కలుపుతూనే ఉండాలి. ఇలా పాలను ఓ 20-25 నిమిషాలు మరిగించాక బాగా చిక్కగా మారతాయి.

ఇప్పుడు అందులో యాలకుల పొడి, తరిగిన బాదం, పిస్తాలను యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత చక్కెర పాకంలోని రసమలై బాల్స్‌ తీసి చేత్తో అదిమి ఈ మరిగించిన చిక్కటి పాలలో వేసుకోవాలి. ఈ పాలు కాస్త గోరువెచ్చగా ఉండాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని అయిదారు గంటలు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అంతే.. నోరూరించే టేస్టీ రసమలై రెడీ!

ఆర్గానిక్​ స్వీట్స్​.. ఆరోగ్య ప్రయోజనాలు అనేకం

పసందైన 'కొబ్బరి బర్ఫీ'ని ఆస్వాదించండిలా..

ABOUT THE AUTHOR

...view details