How To Make Munagaku Roti Pachadi :రోటి పచ్చళ్లనగానే మనలో చాలా మందికి టమాటా, దొండకాయ పచ్చళ్లే గుర్తుకొస్తుంటాయి. కానీ.. మునగ ఆకుతోనూ అద్భుతమైన పచ్చడి తయారు చేయొచ్చు. ఇది ఎంతో రుచిగా ఉండడమే కాకుండా.. బాడీకి ఎన్నో విటమిన్లు, పోషకాలు, ఖనిజాలు అందిస్తుంది. అలాగే.. ఈ పచ్చడిని ప్రిపేర్ చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. చాలా సింపుల్‌గా, తక్కువ టైమ్‌లోనే ఇంట్లో ఉండే పదార్థాలతో ఈజీగా పచ్చడిని తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? టేస్టీ మునగకాయ రోటి పచ్చడిని ఎలా చేయాలో ఓ లుక్కేయండి!
మునగాకు రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు :
- మునగాకు- రెండు కప్పులు
- పచ్చిమిర్చి-8
- వెల్లుల్లి రెబ్బలు-8
- పసుపు- చిటికెడు
- ఉప్పు - రుచికి సరిపడా
- నిమ్మకాయ సైజు చింతపండు
- మెంతులు-టీస్పూన్
- టమాటాలు- 2
- జీలకర్ర-అర స్పూన్
తాళింపు కోసం..
- 2 స్పూన్ల నూనె
- స్పూన్ - ఆవాలు, జీలకర్ర
- ఒక స్పూన్ మినపప్పు
- రెండు ఎండు మిర్చి
- కరివేపాకు
తయారీ విధానం..
- ముందుగా మునగాకులను బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
- తర్వాత స్టౌ ఆన్ చేసి పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చిలను వేయించుకోవాలి. వాటిని తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్‌లో మునగాకు వేసుకుని పచ్చి వాసన పోయే వరకు రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి.
- మునగాకు వేగిన తర్వాత మెంతులు, జీలకర్ర వేసుకుని కలుపుకోవాలి.
- ఇప్పుడు టమాటా ముక్కలను వేసి కలిపి రెండు నిమిషాలు మూతపెట్టాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకుని కలుపుకోవాలి.
- టమాటాలు కొద్దిగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి.. చల్లారనివ్వాలి.
- మునగాకు మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, చింతపండు నీటిలో నానబెట్టింది వేసుకోవాలి, అలాగే వేయించిన పచ్చిమిర్చిలను వేసుకుని రోట్లో మెత్తగా రుబ్బుకోవాలి.
- ఇప్పుడు పాన్‌లో ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి వేసుకుని బాగా కలపాలి. అలాగే కరివేపాకు వేసుకుని మనం రుబ్బుకున్న మునగాకు పేస్ట్‌ని వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే మునగాకు రోటి పచ్చడి మీ ముందు ఉంటుంది.
- ఈ మునగాకు పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిని వేడి వేడి అన్నంలోకి చపాతీల్లోకి వేసుకుని తింటే టేస్ట్ అద్భుతంగా ఉండటంతో పాటు, హెల్త్ కూడా బాగుంటుంది.
- నచ్చితే మీరు కూడా ఈ సారి ఇంట్లో రోటి పచ్చడిని ట్రై చేయండి!