తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలని ఉందా? - ఇంట్లోనే ఇలా ఈజీగా! - French Fries Making Process

How to Prepare French Fries : మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టమా? ప్రతిసారీ బయట కొని తెచ్చుకుంటున్నారా? ఇకనుంచి ఆ అవసరం లేదు. మీరే ఇంట్లో ఈజీగా వాటిని తయారుచేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

How to Prepare French Fries
How to Prepare French Fries

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2024, 1:23 PM IST

How to Make Homemade French Fries : ఫ్రెంచ్ ఫ్రైస్​ అనగానే చాలా మందికి నోరూరిపోతుంది. బంగాళదుంపలతో చేసే వీటిని వయసుతో ప్రమేయం లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇక చిన్నపిల్లలైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీటికి కాస్త ఉప్పు(Salt), కారం, మసాలా దట్టించి తింటే.. ఆ టేస్టే వేరేలెవల్​. అయితే.. ఈ ఫుడ్​ను చాలా మంది బయటే కొనుగోలు చేస్తారు. ఇంట్లో చేయడం చాలా ప్రాసెస్ అనుకుంటారు. కానీ.. ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి.. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

  • పెద్ద సైజ్​లో ఉన్న బంగాళదుంపలు 2
  • ఆలూ ముక్కలు వేయించడానికి సరిపడా నూనె
  • రుచికి తగినంత ఉప్పు

ఫ్రెంచ్ ఫ్రైస్ తయారుచేసుకునే విధానం..

  • ముందుగా చాకుతో బంగాళదుంపల తొక్క తీసుకోవాలి. ఆ తర్వాత వాటిని పొడవుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. ఆలుగడ్డలను కట్​ చేసేటప్పుడు అవి మరీ మందంగా లేదా చాలా సన్నగా లేకుండా చూసుకోవాలి.
  • ఆ తర్వాత కట్​ చేసుకున్న బంగాళదుంపలను ఒక బౌల్​లోకి తీసుకొని ముందుగా ట్యాప్ వాటర్​ కింద శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం మరో బౌల్​లో కూల్ వాటర్​ తీసుకొని అందులో కాసింత ఉప్పువేసుకుని వాటిని 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టాలి. ఒకవేళ కూల్ వాటర్ లేకపోతే ఫ్రిజ్​లో ఉండే ఐస్​క్యూబ్స్ కొన్ని నీళ్లలో వేసుకొని అందులో నానబెట్టుకోవాలి.
  • అనంతరం వాటిని బౌల్ నుంచి తీసి ఒక క్లాత్ మీద కాసేపు ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని అందులో బంగాళదుంపలను వేయించడానికి సరిపడా నూనె పోసుకోవాలి.
  • ఆ తర్వాత నూనె తగినంత వేడి అయ్యాక సిద్ధం చేసుకున్న బంగాళదుంపలను అందులో వేసుకోవాలి. ఆపై మంటను మీడియం ఫ్లేమ్​లో పెట్టుకుని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
  • అనంతరం వేయించిన బంగాళదుంప ముక్కలను నూనె నుంచి తీసి టిష్యూ పేపర్ మీద వేసి చల్లార్చుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఆ ముక్కలను పట్టిన అదనపు నూనెను టిష్యూ పేపర్స్ పీల్చుకుంటాయి. అంతే ఎంతో రుచికరమైన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ.
  • ఒకవేళ మీరు వాటిని మరింత టేస్ట్​గా తినాలనుకుంటే.. కాస్త ఉప్పు, కారం, చాట్ మసాలా చల్లుకొని తినేయొచ్చు.
  • అదేవిధంగా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్​ను టమాటో సాస్​తో తిన్నా రుచి అద్భుతంగా ఉంటుంది.

ఫ్రెంచ్ ఫ్రైస్​కు సంబంధించిన కొన్ని టిప్స్..

  • మీరు మరింత పర్ఫెక్ట్​ ఫ్రెంచ్ ఫ్రైస్ తయారుచేసుకోవాలనుకుంటే.. కట్ చేసిన బంగాళదుంపలను 20 నుంచి 30 నిమిషాలు ఐస్​ వాటర్​లో నానబెట్టండి.
  • అదేవిధంగా ఫ్రెంచ్ ఫ్రైస్ త్వరగా నల్లబడకుండా చక్కగా క్రిస్పీగా ఉండాలంటే.. మీరు నానబెట్టిన ఆలుగడ్డ ముక్కలను ఒక రెండు, మూడు టిష్యూ పేపర్లు తీసుకొని వాటిపై వేసి బాగా ఆరబెట్టిన తర్వాత వేయించుకోండి.

పనీర్‌తో ఈ స్నాక్స్ ట్రై చేయండి-​ పిల్లలు నుంచి పెద్దల వరకు ఆహా అనడం ఖాయం!

స్నాక్స్​లో ఆయిల్ ఫుడ్ వద్దు - ఇవి తింటే అదుర్స్ - రుచికి రుచీ ఆరోగ్యానికి ఆరోగ్యం!

ABOUT THE AUTHOR

...view details